అనువాదలహరి

నష్టపరిహారం … సారా టీజ్డేల్

Filsinger, Sara Teasdale, Mrs., portrait photo...
Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

శీతకాలపు రాత్రి

క్షణికమైనాసరే,

మనోజ్ఞంగా, వెలుగుతూ 

రాలిపోయే ఉల్కలా

గుండెలోనే కొట్టుకులాడే,

సుమధురమైన గీతం ఒక్కటి

రాయగలిగితే చాలా సంతోషిస్తాను…

బాధామయమైన జీవితం లో మార్పులేకపోయినా

మనసు అలసినా, దేహం ఆర్తితో తపించినా

విరిగినరెక్కలతోనే

గంటలతరబడి ఎగరవలసివచ్చినా

ఒంటరిగా మిగిలిపోయినా!

.

Compensation

.

I should be glad of loneliness

And hours that go on broken wings,

A thirsty body, a tired heart

And the unchanging ache of things,

If I could make a single song

As lovely and as full of light,

As hushed and brief as a falling star

On a winter night.

.

Sara Teasdale

%d bloggers like this: