అనువాదలహరి

నేనొక తలెత్తుకుని జీవించగల ఏకాకిని … హెన్రీ డేవిడ్ థొరో.

Henry David Thoreau
Henry David Thoreau (Photo credit: Wikipedia)

.

నేను తలెత్తుకుని బ్రతకగల

ఏకాకిగా సృష్టించబడ్డాను.

నాలో దమ్ముంది.

నా దృష్టి నిర్మలంగానే ఉంటుంది;

నా జీవితం ఎన్నడూ నిరుత్సాహంగా ఉండదు.

కేంద్రానికి అన్నిబిందువులూ దగ్గరే.

(భగవంతునికి అందరూ సమదూరమే).

ఈ క్షణానికి నేనే రాజుని.

కాలమా!

నువ్వు నాకు ప్రతికూలించదలుచుకున్నా,

అనుకోని ఆఘాతాలు కలిగించదలుచుకున్నా ఫర్వాలేదు.

జీవిత సారాన్ని తీసుకో.

కానీ, హృదయం మాత్రం నాకు  విడిచిపెట్టు.

.

హెన్రీ డేవిడ్ థొరో

(జులై 12, 1817 – మే 6, 1862)

Site of Thoreau's cabin
Site of Thoreau’s cabin (Photo credit: Wikipedia)

[19వ శతాబ్దపు తాత్విక చింతనని ప్రభావితం చేసిన వ్యక్తులలో థొరో ఒకరు.  కవిగా, తత్త్వవేత్తగా,  బానిసత్వానికి వ్యతిరేకంగా తనగొంతు ప్రకటించడంలో, స్వాతంత్ర్యం, రాజ్యం, చట్టాన్ని ఎప్పుడు వ్యతిరేకించాలి, పన్నులు ఎందుకు చెల్లించమని ప్రజలు ప్రభుత్వాలపై తిరుగుబాటు చెయ్యవచ్చు, మొదలైన సాంఘిక, రాజకీయ విషయాలమీదే కాకుండ, ప్రకృతిమీద, పర్యావరణం మీద ఆయన ఎన్నో వ్యాసాలు వ్రాసేడు. స్వయంగా ప్రకృతిలో జీవించి అనుభవించడానికి, మనకోరికలు తగ్గించుకుంటే, ఫ్రకృతిలో దొరికే వస్తువులతో జీవితం సాఫీగా వెళ్ళిపోతుందని చెప్పడానికి ముందు, స్వయంగా 2 సం వత్సరాలపాటు రాల్ఫ్ వాల్డొ ఎమర్సన్ కు చెందిన జాగాలో వాల్డెన్ పాండ్ కు ఎదురుగా చిన్న Cabin నిర్మించుకుని 2 సంవత్సరాలపాటు “సాదా జీవితం” గడపడంపై  ప్రత్యక్షప్రయోగం చేశాడు. ఇతని భావాలు లియో టాల్ స్టాయ్, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ Jr. వంటి వారిని ప్రభావితం చేశాయి]

.

I was made erect and lone

.

I was made erect and lone,
And within me is the bone;
Still my vision will be clear,
Still my life will not be drear,
To the center all is near.
Where I sit there is my throne.
If age choose to sit apart,
If age choose, give me the start,
Take the sap and leave the heart.
.
Henry David Thoreau

(July 12, 1817 – May 6, 1862)

American Transcendentalist, Philosopher, Abolitionist, Naturalist, Essayist, and Poet.

%d bloggers like this: