అనువాదలహరి

అది సాధ్యమా? … సర్ థామస్ వైయట్


.

అది సాధ్యమా?
అంత తీవ్ర వాగ్వివాదం, అంత నిశితంగా,
అంత వాడిగా, అంత జోరుగా, జరిగింది
ఆలస్యంగా ప్రారంభమైనా
అంత తొందరగా ముగిసిందా?
అది సాధ్యమా?

అది సాధ్యమా?
అంత దుర్మార్గమైన ఆలోచన,
అంత క్షణికావేశము,
అంతతొందరగా తగ్గిపోయిందా,
ప్రేమనుండి ద్వేషానికి,
ద్వేషం నుండి జాలిపడడానికీ మారిందా?
అది సాధ్యమా?

అది సాధ్యమా?
ఆ గుండెలోనే  ఒకసారి ప్రశాంతంగానూ,
మరోసారి కల్లోలంగానూ మారిపోగల
వైరుధ్యాలున్న మనసు ఉండడం…
అది నిజంగా సాధ్యమేనా?

అది సాధ్యమేనా?
ఎంతమాత్రం ఊహించలేని
పాచికవేస్తే పడే అంకెలా కదిలే
కళ్ళలోని సత్యాన్ని
ఎవరైనా గుర్తించగలరా?
అది సాధ్యమేనా?

అది సంభవమే.
తరచుగా,
అట్టడుగున ఉన్నది
అత్యున్నతస్థానం చేరడమూ,
ఉన్నతమైనది
పతనమై చులకనైపోవడమూ
సంభవమే.

ఏదైనా సంభవమే,
నమ్మడానికి సిధ్ధపడిన వాళ్ళకి.
కనుక ముందు విశ్వసించు,
తర్వాత సాధ్యాసాధ్యాలు ఋజువుచెయ్యి;
శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్న స్త్రీని
పురుషుడు ముందు విశ్వసించి,
తర్వాత వదిలేసి నట్టు,
అన్నీ సంభవమే.

.

Sir Thomas Wyatt contributed 96 poems to Totte...
Sir Thomas Wyatt contributed 96 poems to Tottel’s Miscellany. (Photo credit: Wikipedia)

సర్ థామస్ వైయట్.

(1503 – 11  అక్టోబరు 1542)

[ఈ కవితని సర్ థామస్ వైయట్ వ్యక్తిగత జీవితం నేపధ్యంలోంచి అర్థం చేసుకోవాలి. చిట్టచివరి ఉపమానాన్ని మినహాయిస్తే, ఈ కవిత, మనిషిని ఎంత అసంభవమని అనిపించే పనినైనా, ఆదిలోనే అది అసంభవమని ఊహించి విడిచిపెట్టకుండా, ప్రయత్నించమని ఉద్భోదిస్తోంది. కాని, దీని సౌందర్యాన్ని చివరి ఉపమానం బాగా పాడుచేసింది. అయితే, మనం అతని కాలంలో నైతికవర్తన పట్ల సమాజం లో ఉన్న నిష్ఠా, వివాహేతర సంబంధం అపవాదు కారణంగా తన భార్యనుండీ తను విడిపోవడమూ, అతని మనసుమీద వేసిన ముద్ర గుర్తెరిగి దీన్ని మన్నించవచ్చని నా అభిప్రాయం.

ఇతని మీద ఇటాలియన్ కవి పెట్రార్క్ ప్రభావం చాలా ఉంది. అతని సానెట్ లని చాలా అనువాదం చేసినా, తనుకూడ స్వయంగా ఎన్నో సానెట్ లు  ఇంగ్లీషులో వ్రాసాడు. ఆ  రోజుల్లో లాటిన్, ఇటాలియన్ వంటి భాషలకున్న గుర్తింపు  ఇంగ్లీషుకిలేకపోవడంతో, ఇంగ్లీషుభాషని సంస్కరించాలని, వాటితోపాటు దీటుగా ఉండాలని కృషిచేశాడు. సెనెకా,హొరేస్ వంటి సంప్రదాయకవులని అనుకరించడమే కాకుండా,ఫ్రెంచి, ఇటాలియన్ భాషలలోని ఛందోరూపాలతో ఎన్నోరకాలప్రయోగాలు చేశాడు. అయినప్పటికీ, అతనికి ఇంగ్లీషు కవి ఛాసరు అంటే మక్కువే. సర్ థామస్ వైయట్ ప్రత్యేకత అతని “ప్రేమలోని శోధన” విషయంగా రాసిన కవితలు. మిగతావి, రాజసభలోని ఆత్మవంచనలమీద సునిశితమైన విమర్శలు. అతని సాహిత్యకృషిమీద విమర్శకులకు భిన్నాభిప్రాయాలున్నాయి. 20 వ శతాబ్దంలో అతని సాహిత్యాన్ని పుర్మూల్యాంకనం చేసిన CS Lewis అతన్ని Father of Drab age గా అభివర్ణించాడు. Patricia Thompsonఅయితే అతన్ని Father of English Poetry గా కీర్తించింది.]

.

Is it possible

.

Is it possible
That so high debate,
So sharp, so sore, and of such rate,
Should end so soon and was begun so late?
Is it possible?

Is it possible
So cruel intent,
So hasty heat and so soon spent,
From love to hate, and thence for to relent?
Is it possible?

Is it possible
That any may find
Within one heart so diverse mind,
To change or turn as weather and wind?
Is it possible?

Is it possible
To spy it in an eye
That turns as oft as chance on die,
The truth whereof can any try?
Is it possible?

It is possible
For to turn so oft,
To bring that lowest which was most aloft,
And to fall highest yet to light soft:
It is possible.

All is possible
Whoso list believe.
Trust therefore first, and after preve,
As men wed ladies by licence and leave.
All is possible.

.

Sir Thomas Wyatt

(1503 – 11 October 1542)

English Poet, Courtier, Translator.

%d bloggers like this: