అనువాదలహరి

కెరటం … (సంక్షిప్తం) ఫరూవే ఫరుక్జాద్.ఇరానియన్ కవయిత్రి

Foroogh Farokhzad, Iranian poet
Foroogh Farokhzad, Iranian poet (Photo credit: Wikipedia)

.

నా మట్టుకు నువ్వు కేవలం  
లోపలికి లాగి,
ఈడ్చుకుని పారిపోయే
ఒక సంద్రపుటలవి

ప్రాణాంతకమైన మహమ్మారిలా
నువ్వు చప్పున వ్యాపిస్తావు
ఏవో తీరాలవైపు పరిగెత్తుతావు
పోనీ, గమ్యం? అగమ్యం.

నిజం!
నిరంతరం చరిస్తూ
అంతులేకుండా సాగుతూ
నువ్వొక అదుపులేని కెరటానివి.

***
కానీ,
నీ కో విషయం తెలుసా?

ఓ రాత్రి
నేను గురుతు తెలియని ఏకాంత ద్వీపాల,
వాటి తీరాల దాహార్తిని
ముసుగుగా కప్పుకుంటాను

కప్పుకుని,
సముద్ర గర్భం నుండి,
నీ జన్మభూమికి సుదూరంగా….
నిన్నింకించుకోగల నా సైకతాలలోకి
శాశ్వతంగా పట్టుకుంటాను   
.
ఫరూవే ఫరుక్జాద్.

(జనవరి  5, 1935  — ఫిబ్రవరి 13, 1967)

ఇరానియన్ కవయిత్రి

.

To me, you are just a wave,
grabbing, dragging,
then fleeing away!

You swiftly spread–
just like a deadly plague.
You rush to the other lands,
but the destination? Well, vague!

Yes!
You are an unruly tide,
always on the ride,
in an endless glide!

***

But,
You know?

One night,
I will wear a mask,
made of the thirst – of the remotest shores,
and their deserted islands.

And then,
I’ll capture you – in my absorbing sands,
forever far away – from your naval natal lands!

.

Forough Farrokhzad 

(January 5, 1935, — February 13, 1967)

Iranian Poet

(The Wave 1956, Abridged)

(Trans.: MD, July 2006, Montreal)

%d bloggers like this: