అనువాదలహరి

సానెట్ XVII …పావ్లో నెరూడా

.

నువ్వొక అపురూపమైన గులాబీవనో, గోమేధిక మణివనో,
లేక నిప్పురవ్వల్లాంటి లవంగమొగ్గవనో ప్రేమించను.  
నిన్ను కొన్ని రహస్యమైన వస్తువుల్ని ప్రేమించినట్టు,
ఎవరికీ తెలియకుండా గుండెకీ, నీడకీ మధ్య ప్రేమించాలి

ఎన్నడూ పుష్పించకపోయినా, కనపడని ఎన్నోపుష్పాలప్రకాశాన్ని
తనలో నిలుపుకున్న ఒక చెట్టుని ప్రేమించినట్టు, నిన్నుప్రేమిస్తా.
నీ ప్రేమ కారణంగానే, ఒక చెప్పలేని గాఢ సుగంధం
భూమినుండి వెలువడి నిగూఢంగా నాలో నిక్షిప్తమై ఉంది

ఎలా, ఎప్పుడు, ఎక్కడనుండి ప్రేమిస్తున్నానో తెలీదు
నిన్నునిన్నుగా, భేషజాలూ, అహం లేకుండా ప్రేమిస్తున్నాను.
నిన్నలా ఎందుకు ప్రేమిస్తున్నానంటే మరోలా తెలీదు కనుక

ఈ ప్రేమలో … “నేను” అన్నదీ లేదు … “నువ్వు” అన్నదీ లేదు
నాగుండెమీది నీ చెయ్యి నా చెయ్యే అనుకునేంత సామీప్యత    
నేనునిద్రలోకి ఒరుగుతుంటే, నీ కళ్ళు మూతపడేంత మమేకత.

.

Pablo Neruda (1904–1973)
Pablo Neruda (1904–1973) (Photo credit: Wikipedia)

పావ్లో నెరూడా

.

Sonnet XVII

.

I do not love you as if you were salt-rose, or topaz,
or the arrow of carnations the fire shoots off.
I love you as certain dark things are to be loved,
in secret, between the shadow and the soul.

I love you as the plant that never blooms
but carries in itself the light of hidden flowers;
thanks to your love a certain solid fragrance,
risen from the earth, lives darkly in my body.

I love you without knowing how, or when, or from where.
I love you straightforwardly, without complexities or pride;
so I love you because I know no other way

than this: where I does not exist, nor you,
so close that your hand on my chest is my hand,
so close that your eyes close as I fall asleep.

.

Pablo Neruda

(July 12, 1904 – September 23, 1973 )

Chilean Poet

%d bloggers like this: