అనువాదలహరి

నే నొకరి ఆస్థినికాదు… షేక్స్పియర్

[ఇది షేక్స్పియర్ చారిత్రక నాటకాలలో భిన్నమైనది. కింగ్ జాన్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ నాటకం వ్రాసినా, ఇందులో రసపోషణకంటే, వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకి రాజ్యాధికారం ఉంటుందా అన్న నైతికచర్చమీద ఎక్కువ కేంద్రీకృతమైంది. దానికి అనుబంధంగా వారసత్వపు అర్హత ముఖ్యమా? లేక సమర్థత ముఖ్యమా? అన్న చర్చ ఉంటుంది.

ఇంగ్లాండు రాజు కింగ్ జాన్, పూర్వ చక్రవర్తి ఎంపికచెయ్యబడిన రాజు. పూర్వ చక్రవర్తి అన్న కుమారుడు ఆర్థర్ అసలు వారసుడు. లూయీ ఫ్రెంచి యువరాజు. పెండల్ఫ్ రోమను కాథలిక్కు మతపెద్ద పోప్ కి రాయబారి. అసలు వారసుడుకి ఫ్రెంచ్ రాజు సహాయం చేద్దామనుకోవడంతో పెండొల్ఫ్ ముందుగా ఇంగ్లాండుమీద యుద్ధానికి లూయీని మానసికంగా తయారుచేస్తాడు. అయితే పోప్ దూతగా వచ్చిన పెండల్ఫ్ కి కిరీటాన్ని అప్పగించి కింగ్ జాన్, పోప్ ఆజ్ఞకిలోబడి రాజ్యాన్ని పరిపాలించడానికి ఒడంబడిక చేసుకుంటాడు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ యువరాజుకి చెప్పి, యుద్ధం అవసరం లేదన్నప్పుడు, ఈ నాటకంలోని అతిప్రాచుర్యం వహించిన ఈ మాటలు ఫ్రెంచ్ యువరాజు పెండల్ఫ్ అన్నవి.]

.

మీరు నన్ను క్షమింతురుగాక!
నేను వెనకడుగువెయ్యలేను.
నేను ప్రపంచంలోని ఏ స్వతంత్రరాజ్యానికీ
లోబడి ఉండడానికీ, స్వంత ఆస్థిగా భావించడానికీ,
ఎవరి అవసరానికో పనికివచ్చే వస్తువుగానో,
పనికివచ్చే మనిషిగానో బతకడానికి
ఉత్తమ వంశంలోని నా పుట్టుక అంగీకరించదు

.

నాకూ, ఈ రాజ్యానికీ మధ్య బుసిఆరిపోయిన
ఈ యుధ్ధపు నిప్పుని మీరే ఊది రాజేసేరు,
అది మంటగా ఎదగడానికివలసిన ఇంధనమూ సమకూర్చేరు;
ఇప్పుడది కార్చిచ్చు గా మారిపోయింది;
దాన్ని ఇపుడు ఉఫ్ మని నిప్పు రాజెయ్యడానికి ఊదినట్టు
బలహీనమైన ఊపిరితో ఊది ఆర్పడం సాధ్యపడదు

.

ముందుగా మీరు న్యాయాన్ని ఎలాపోల్చుకోవాలో చెప్పేరు,
ఈ నేల మీద నాకు ఆసక్తిని కల్పించేరు,
అవును, అసలు, ఈ ఉద్యమపుటాలోచనని
నా మనసులోకి చొప్పించిందీ మీరే;
ఇప్పుడు మీరు ఎవడో జాన్ రోము తో
సంధిదేసుకున్నాడని చెప్పడానికి వచ్చేరా?
వాడు సంధిచేసుకుంటే, నాకేమిటి సంబంధం?
నేను నా వివాహం సాక్షిగా,
ఆర్థరు కోసం ఈ నేల నాదని ప్రకటిస్తున్నాను
సగం స్వాధీనం చేసుకున్నాను.
.

ఇప్పుడు జాన్ రోముతో సంధిచేసుకున్నాడని వెనకడుగువెయ్యాలా?
నేనేమైనా రోముకి బానిసనా? రోము ఏ పైసా ఖర్చుపెట్టిందని?
ఏ మందీమార్బలాన్నీ, ఆయుధాలని సమకూర్చిందని
నా ప్రయత్నం విరమించుకోవాలి?
ఈ దాడి చెయ్యవలసింది నేనుకాదూ?
నేను తప్ప ఇంకెవరు నా హక్కుకోసం శ్రమించి
జవాబుదారీ వహించవలసింది?
ఈ ద్వీపవాసులకి వాళ్ళ నగరాలకు రక్షణకల్పించినందుకు
“మహారాజుగారు కలకాలం వర్ధిల్లాలి” అన్న నినాదాలు చెయ్యడం
నేను వినలేదా? సింహాసనం కోసం జరుగుతున్న పోరాటంలో
అన్ని అవకాశాలూ నాకు అనుకూలంగా ఉండి
అవలీలగా గెలిచేస్థితిలో నేను లేనా?
అలాంటి సమయం లో ఇవన్నీ నేను ఒదులుకోవాలా?
నా ప్రాణం మీద ఒట్టు, అదెన్నటికీ జరగదు.

.

షేక్స్పియర్

.

Your grace shall pardon me, I will not back:
I am too high-born to be propertied,
To be a secondary at control,
Or useful serving-man and instrument,
To any sovereign state throughout the world.
Your breath first kindled the dead coal of wars
Between this chastised kingdom and myself,
And brought in matter that should feed this fire;
And now ’tis far too huge to be blown out
With that same weak wind which enkindled it.
You taught me how to know the face of right,
Acquainted me with interest to this land,
Yea, thrust this enterprise into my heart;
And come ye now to tell me John hath made
His peace with Rome? What is that peace to me?
I, by the honour of my marriage-bed,
After young Arthur, claim this land for mine;
And, now it is half-conquer’d, must I back
Because that John hath made his peace with Rome?
Am I Rome’s slave? What penny hath Rome borne,
What men provided, what munition sent,
To underprop this action? Is’t not I
That undergo this charge? who else but I,
And such as to my claim are liable,
Sweat in this business and maintain this war?
Have I not heard these islanders shout out
‘Vive le roi!’ as I have bank’d their towns?
Have I not here the best cards for the game,
To win this easy match play’d for a crown?
And shall I now give o’er the yielded set?
No, no, on my soul, it never shall be said.

Shakespeare
King John Act V Scene II

Though the play focuses on some of the historical events of King John’s reign, it is more a pragmatic representation of events and the story does not conform to aesthetic standards of Shakespeare.  The central theme of the play is more a moral one… whether a bastard child can lay claim to the throne… and subordinate to it, the debate on legitimacy of rule, which was a hot topic during Queen Elizabeth I reign.

%d bloggers like this: