అనువాదలహరి

ఆడవాళ్ళ పని… మాయా ఏంజెలో

Maya Angelou
Maya Angelou (Photo credit: Burns Library, Boston College)

.

నేను పిల్లల్ని సంబాళించాలి
దుస్తులకి చిన్నమార్పులు చెయ్యాలి
నేల తడిగుడ్దతో తుడవాలి
బజారుకెళ్ళి సరుకులు కొనుక్కురావాలి
కోడికూర వేపుడు చెయ్యాలి
ఆ పిల్లని తుడవాలి
స్నేహితులకి ఫలహారం తయారుచెయ్యాలి
తోటలో కలుపుతియ్యాలి
చొక్కాలు ఇస్త్రీ చెయ్యాలి
పసివాళ్లకి బట్టలుతొడగాలి
ఆ డబ్బామూత తెరవాలి
ఈ ఇల్లంతా ఊడవాలి
తర్వాత అస్వస్థుల్ని పలకరించాలి
పత్తికాయలు కొయ్యాలి

ఓ సూర్య కిరణమా! నా మీద ప్రసరించు.
ఓ వర్షమా! నా మీద ఒకసారి వర్షించు!
ఓ హిమబిందువులారా! నా మీద తేలికగా రాలి,
నా నుదిటిని మరోసారి చల్లబరచండి!

ఓ తుఫానూ! నీ అతిప్రచండమైన వీచికలతో
నన్నిక్కడనుండి ఎత్తికెళిపో.
నేను మళ్ళీ విశ్రాంతి తీసుకోగలిగేదాకా,
ఆకాశంలో అలా తేలియాడనీ.

ఓ మంచు తునకలారా!
మెల్లమెల్లగా రాలి చల్లని తెల్లని
మీ మంచు ముద్దులతో ముంచెత్తండి.
నన్నీరాత్రికి విశ్రమించనీయండి.

ఎండా, వానా, వంగిన ఆకాశం, పర్వతాలూ,
మహాసముద్రాలూ, చెట్టుచేమలూ, రాయిరప్పలూ,
మిణుకుమనే నక్షత్రాలూ, మెరిసే వెన్నెల…
నాదని చెప్పుకోగలిగింది మీరుతప్ప వేరెవరూ లేరు.

.

మాయా ఏంజెలో.

.

Womanwork

.

I’ve got the children to tend
The clothes to mend
The floor to mop
The food to shop
Then the chicken to fry
The baby to dry
I got company to feed
The garden to weed
I’ve got shirts to press
The tots to dress
The can to be cut
I gotta clean up this hut
Then see about the sick
And the cotton to pick.

Shine on me, sunshine
Rain on me, rain
Fall softly, dewdrops
And cool my brow again.

Storm, blow me from here
With your fiercest wind
Let me float across the sky
‘Til I can rest again.

Fall gently, snowflakes
Cover me with white
Cold icy kisses and
Let me rest tonight.

Sun, rain, curving sky
Mountain, oceans, leaf and stone
Star shine, moon glow
You’re all that I can call my own.

.

Maya Angelou

%d bloggers like this: