అనువాదలహరి

ఉపదేశం … సారా టీజ్డేల్

Filsinger, Sara Teasdale, Mrs., portrait photo...
Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

[సారా టీజ్డేల్ చాలా తక్కువపదాలతో అపురూపమైన తాత్త్వికచింతనని ఈ కవితలో అందించింది. మనశరీరంలో ఉన్న ధాతువులన్నీ భూమి పుట్టిననాటి నుండీ ప్రకృతిలో పరిణామం చెందుతూ, నిత్యం పునరుపయోగమవుతున్నవే. ఈ శరీరం అంతపురాతనమైనది. అలాగే మనలోని భావాలు… మన పూర్వీకులు దారిలోని ముళ్ళన్నీ ఏరి మనకు మార్గం సుగమం చెస్తే వచ్చినవే. మనగొంతు మనదికాదు. మనపూర్వీకులదే. ఇక్కడ నాకు న్యూటను మహాశయుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి.  మీరు చాలా గొప్ప ఆవిష్కరణలు చేశారని ఎవరో ఆయనని పొగడబోతే, ఆయన వినమ్రంగా, “ఈ రోజు నేను సుదూరంగా చూడగలుగుతున్నానంటే, నేను మనపూర్వీకుల వీపుమీద సవారీ చెయ్యబట్టే” అన్నాడుట.

సారా టీజ్డేల్ ఈ భావాన్ని ఎంత సుకుమారంగా చెప్పిందో గమనించండి.  మనం మనము కాము. మన శరీరం మనది కాదు. మన భావాలు మనవి కావు. (తమకృషి, కష్టం ఏమీ లేకుండా, పిల్లలకి చదువుచెప్పడానికీ లక్షలు వసూలుచేసే విద్యాసంస్థలని నిలదీయకపోగా, అహ్లువాలియావంటి మహాశయులు విశ్వవిద్యాలయాల్లో ఫీజులు పెంచాలని సెలవిస్తున్నారు. ఈ నేలమీద పుట్టిన పిల్లలలకి ఆరోగ్యం, విద్యా ఉచితంగా ఇవ్వలేని ప్రభుత్వాలు వాటి బాధ్యతని ఏమిటి నిర్వర్తిస్తున్నట్టు. ఉద్యోగస్తులకి జవాబుదారీ ఉంటుంది. అంతకంటే ఎక్కువ అధికారాన్నీ, జాతి వనరులనీ వినియోగించుకుంటున్న ప్రభుత్వాలకి పనిచెయ్యలేకపోతే జవాబుదారీ ఉండదా అనిపిస్తుంది.)

మన ఉనికి ఇక్కడ తాత్కాలికమే. ఈ చిన్నపాటి వెలుతురులో నిలిచేసమయంలో, ఆమె దర్శించమన్నది సౌందర్యాన్ని.  ఇక్కడ సత్యమే సౌందర్యం. ప్రకృతి నుండి జ్ఞానసముపార్జనా, ఉచితంగా జ్ఞానవితరణ చెయ్యడం నేర్చుకోవడమే సత్యం.]

***

నక్షత్రాలంత పురాతన అణువులతో

పరిణామం తర్వాత పరిణామంతో

లోపల ఎన్ని లక్షల కోట్ల జీవకణాలు

విభజింపబడూన్నా చెక్కుచెదరకుండా ఉంటూ;

గాలినుండి, పరిభ్రమిస్తున్న భూమినుండి,

అతి ప్రాచీన, ప్రాచీ నదులనుండి,

నీలివర్ణంతో మెరిసే

ఉష్ణమండల మహాసాగరాలనుండి,

నేను నేనుగా అస్తిత్వం పొందేను

.

నా జీవాత్మ కూడ నా శరీరం లాగే

అనేకానేక మూలాలనుండి ప్రోదిచెయ్యబడింది…

ఆదిమ మానవుడినుండీ,

వేటనేర్చినవాడినుండీ,

పశులకాపరినుండీ;

ఈజిప్టు మొదలు సైప్రస్, ఇటలీ మొదలైన దేశాలనుండి;

నాలోని సజీవమైన ఈ ఆలోచనలన్నీ

కాలగతిలో మరుగునపడి మరిచిపోయిన

అమరులైన స్త్రీపురుషులనుండి వచ్చినవే;

అందులో చాలామంది నురుగుమీది బుడగల్లా

క్షణకాలం జీవించిన వారే;

.

ఇక్కడ ఒక లిప్తపాటి సమయంకోసం,

చీకటినుండి వెలుగులోకి నేనువస్తే,

నాతోపాటు వాళ్ళూ వచ్చేరు

నా శ్వాసలో వాళ్ళ మాటలు వెతుక్కుంటూ;

కొన్ని వేల జన్మల జ్ఞానంతో

వాళ్ళు చేసిన ఉపదేశం విన్నాను:

“ఎప్పుడూ సౌందర్యం కోసమే అన్వేషించు;

మృత్యువుతో పోరాటంలో

మనిషికి అండగా నిలిచేది అదొక్కటే!”

.

సారా టీజ్డేల్

.

The Voice

Atoms as old as stars,
Mutation on mutation,
Millions and millions of cells
Dividing yet still the same,
From air and changing earth,
From ancient Eastern rivers,
From turquoise tropic seas,
Unto myself I came.

My spirit like my flesh
Sprang from a thousand sources,
From cave-man, hunter and shepherd,
From Karnak, Cyprus, Rome;
The living thoughts in me
Spring from dead men and women,
Forgotten time out of mind
And many as bubbles of foam.

Here for a moment’s space
Into the light out of darkness,
I come and they come with me
Finding words with my breath;
From the wisdom of many life-times
I hear them cry: “Forever
Seek for Beauty, she only
Fights with man against Death!”

.

Sara Teasdale

American Poet

Sarah Teasdale communicates some of the finest philosophical ideas through this poem in her own inimitable style. This material body is a composite of elements coming down the ages from the time of bigbang; what we are today,  is not an accident or even event… but it is a consequence. We are a byproduct of the integral of the collective human intellect of the generations preceding us… right from the cave-man to the civilized man of the day. And today, if we want to find our voice, we should not forget, that through our voice echoes the voice and the wisdom of those people. And finally, she speaks about the meaning of this life. And it is to search for beauty … only which shall come to the aid of man in his fight against death. 

I sometimes feel she had a great interaction / exposure to the indian philosophical thought.


%d bloggers like this: