అనువాదలహరి

ఒక గుక్కెడు సూర్యరశ్మి … జాన్ కీట్స్

John Keats, by William Hilton (died 1839). See...
John Keats, by William Hilton (died 1839). See source website for additional information. This set of images was gathered by User:Dcoetzee from the National Portrait Gallery, London website using a special tool. All images in this batch have been confirmed as author died before 1939 according to the official death date listed by the NPG. (Photo credit: Wikipedia)

[కీట్స్ కవితలని అర్థం చేసుకోవడం ఎప్పుడూ సవాలే. ఎందుకంటే అతని ప్రతీకలు అన్ని రకాల అన్వయాలకి అనువుగా ఉంటాయి. కొందరు దీన్ని లౌకిక ప్రేమకు అన్వయించిచెబితే, మరికొందరు తాగుబోతు తనానికి అన్వయించేరు. కొందరు క్రిస్టియానిటీకి అన్వయించి చెప్పేరు.
ఇది కీట్స్ క్షయవ్యాధితో బాధపడుతున్నప్పుడు వ్రాసిన కవిత. చిత్రంగా ఇందులో భారతీయ ఆధ్యాత్మిక చింతనకు సంభంధించిన పదాలూ, విషయాలూ, అచ్చం అలాగే కాకపోయినా, కొన్ని ద్యోతకమవుతాయి. ఉదాహరణకి సూర్యమడలంలోనుండి ఆత్మ ప్రయాణించడం. నామలింగానుశాసనంలో సూర్యమండలానికి ఇచ్చిన పేర్లలో “పోరనీల్గెడు మొనగాండ్రు పోవుదారి” అని ఉంది. అంటే, యుధ్ధంలో మరణించినవారు  సూర్యమండలాన్ని భేదించుకుని పోతారుట. దీన్నే తెనాలి రామలింగడు పెద్దనగారి “శరసంధానబలక్షమాది వివిధైశ్వర్యంబులన్ గల్గి” అన్న పద్యాన్ని ఆక్షేపించినపుడు,  చమత్కారంగా చెప్పిన”కలనన్తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మాభర్త మార్తాండమండలభేదంబొనరించి ఏగునెడ” అన్న పద్యంలో  గమనించవచ్చు. భగవంతుడిని God of song అని అనడం కూడా అలాంటిదే.
అతనికి అన్ని మత్తుపానీయాలకంటె మత్తెక్కించేది ప్రకృతిలో లీనమవడం (భౌతికంగానూ, భావుకతలోనూ); ఈ సృష్టి మన మానసిక స్థితిని బట్టి ఒకసారి ఎంత మనోహరంగా కనపడుతుందో, మరొకసారి అంత భీతావహంగానూ కనపడుతుంది.ఈ విశ్వవిలీనగానాన్ని ఆలపించే అధినాధుడితో కవి మొరపెట్టుకుంటున్నాడు… తన ఏకాంతసమయం నిర్వికారంగా గడిచేట్టు ఉండాలనీ …  లౌకికార్థంలో నిర్వికారంగా అంటే ఏ రకమైన ప్రలోభాలకీ లోనవకుండా అని అర్థం; ఆధ్యాత్మికార్థంలో మరణానంతరజీవితం తీరని కోరికల వేదనతో ఆత్మ అసంతృప్తిగా ఉండకుండ అని.]

.

ఇక్కడనుండి ఈ ఫ్రెంచి, పోర్చుగీసు, జర్మను,
ఆఫ్రికా మద్యాలూ, సారాయిలూ తీసుకుపొండి.
నా ఆనందానికి ఇలాంటి మరీ చవకబారువి పనికి రావు.
వాటిని మించిన పానీయం …
తేటైనదీ, స్వఛ్చమైనదీ ఉంది…

అబ్బే ఇంత చిన్న మధుపాత్ర లాభం లేదు.  
నా మధువు వేసవి అంతా పొంగిపొరలుతుంది.
ఆకాశమే నా మధు కలశం.
నేను నా కంటితో ఎంతగా తాగుతానంటే
నాకే తెలియని వివశత్వంతో నా తల తూగేదాకా

కనుక దేవదూతలారా, నాతో రండి, నన్ననుసరించండి
అదిగో ఆ కొండమీది పచ్చికతిన్నెల్లో
మనసుతీరా ఈ స్వర్ణకాంతిని తాగుదాం…  
ఆ సూర్యుని మహిమతో, అనుగ్రహంతో
మన మనసులు పెనవేసుకునేదాకా.

 ఓ ఖగోళప్రభూ! దిశాంత చక్రవర్తీ!
నా ఆత్మ నీ వైపు పయనిస్తుంటే,
ఈ శరీరం మాత్రం భూపతనమౌతోంది.
ఇది కష్టమైన పని, భయంకరమైన ఎడబాటు  
ఇది లౌకికమైన భయాలతో నింపడానికి,
లోతుతెలియని అఖాతాన్ని మిగులుస్తుంది.
అవును, ఆత్మ ఊర్థ్వలోకాలలోకి ఎగిరిపోయిన తర్వాత,  
అనంత వాయువుల్లో దాని ప్రయాణాన్ని
భయంతో, ఆశ్చర్యంతో తిలకిస్తుంటాం…
గెద్ద గోళ్ళలో చిక్కుకున్న తన పసి బిడ్డని
ఆర్తితో తిలకించే తల్లికోడిలా!
ఇది మతి పోగొట్టదూ?

గానమోహనా! నేనెంతమాత్రమూ తట్టుకోలేని
దృశ్యపరంపర వెంట నను కొనిపోతున్నావు…
ఒక్క క్షణం నీ తోనూ, ఆ రుద్రవీణతోనూ
ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతన జరపనీ!

నా ఏకాంత సమయాలను నిర్వికారంగా గడపనీ.
నీ పొదరిళ్ళను భయరహితముగా దర్శించనీ!

.

జాన్ కీట్స్

.

A Draught of Sunshine

.

Hence Burgundy, Claret, and Port,
Away with old Hock and madeira,
Too earthly ye are for my sport;
There’s a beverage brighter and clearer.
Instead of a pitiful rummer,
My wine overbrims a whole summer;
My bowl is the sky,
And I drink at my eye,
Till I feel in the brain
A Delphian pain –
Then follow, my Caius! then follow:
On the green of the hill
We will drink our fill
Of golden sunshine,
Till our brains intertwine
With the glory and grace of Apollo!
God of the Meridian,
And of the East and West,
To thee my soul is flown,
And my body is earthward press’d. –
It is an awful mission,
A terrible division;
And leaves a gulph austere
To be fill’d with worldly fear.
Aye, when the soul is fled
To high above our head,
Affrighted do we gaze
After its airy maze,
As doth a mother wild,
When her young infant child
Is in an eagle’s claws –
And is not this the cause
Of madness? – God of Song,
Thou bearest me along
Through sights I scarce can bear:
O let me, let me share
With the hot lyre and thee,
The staid Philosophy.
Temper my lonely hours,
And let me see thy bowers
More unalarm’d!

.

(Feb 1818)

John Keats

(31 October 1795 – 23 February 1821)

2 thoughts on “ఒక గుక్కెడు సూర్యరశ్మి … జాన్ కీట్స్”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: