అనువాదలహరి

చివరి కోరిక … రబీంద్రనాథ్ టాగోర్.

Rabindranath Tagore won the Nobel prize for li...
(Photo credit: Wikipedia)

(విశ్వకవి రవీంద్రుని 151 వ జయంతి సందర్భంగా)

.

నన్ను ఇతరులు అడిగినవన్నీ, నే నివ్వలేకపోయాను.

అంతమట్టుకు నాకు తెలుసు.

నాకు ఎరికే…

నే చేసిన మోసాలూ, తీర్చని ఋణాలూ, నెరవేర్చని పనులూ.

ప్రపంచానికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను.

మరయితే, ఇప్పుడెందుకు ఇవన్నీ చెబుతున్నట్టు?

సంధిపేలాపనా? పశ్చాత్తాపమా? కోరికతోనా? అవసరముకొద్దీనా?

నేను ప్రపంచం నుండి కోరుకునేవి చాలానే ఉన్నాయి.

మాటల్లోచెప్పలేని లాలసతో కోరుకుంటూనే ఉన్నాను.

కోరికలు నెరవేరని నిస్పృహలో, అవసరాలు తీరని నిరాశలో,

నేను శపిస్తుంటాను, ఏడుస్తుంటాను.

.

ప్రభూ! ఇక నేనీ శాపగ్రస్తమైన వాంఛలూ,

అంతులేని పశ్చాత్తాపాలూ కోరుకోవడం లేదు.

నా కోరికని హరించు… ఈ తృప్తిపరచలేని కాంక్షని హరించు.

ఓ ప్రభూ! నేను వేడుకుంటాను, నా దురాశని హరించు.

ఈ ఋణభారం రోజురోజుకీ బరువైపోతోంది.

స్వామీ! నేను ప్రమాణం చేస్తున్నాను. నిన్నింక ఏ కోరికలూ కోరను.

నేను నీ అన్వేషణ  ఉపసంహరించుకుంటాను.

నన్ను నీకు సమర్పించుకున్న ప్రశాంత క్షణంలో

నేను నీ శరణుజొచ్చేనన్న విషయం తెలిసి

బహుశా, నీవే నాకడకు వస్తావన్న ఎరుకతో

నీకై నిరీక్షిస్తుంటాను.

.

రబీంద్రనాథ్ టాగోర్.

( 8th May 1861 – 7th Aug 1941)

.

Final Expectation

.

Those things that everyone asked of me

I could not give, this much I know.

I know of the deceits, the debts unpaid

The work undone. To the world I owe

So much. So why do I speak right now?

In delirium, in regret, in desire, in need?

Seems I still have so much to demand

From the world. I beg in wordless greed.

I curse, I cry, in desperate despair

From wants unfulfilled, from needs unmet

My lord, I really do not desire more

Of this cursed craving, this deep regret.

Kill my desire…this insatiable yearning

Kill my greed, ye lord, I implore

This burden of debt gets heavier by the day..

I promise my lord, I’d desire no more.

I will give up my pursuit of you, I’ll wait

Knowing that you will come to me

Perhaps in that moment of quiet submission

When you know that I have turned myself over to thee.

.

Rabindranath Tagore.

“Although Tagore wrote successfully in all literary genres, he was first of all a poet. Among his fifty and odd volumes of poetry are Manasi (1890) [The Ideal One], Sonar Tari (1894) [The Golden Boat], Gitanjali (1910) [Song Offerings], Gitimalya (1914) [Wreath of Songs], and Balaka (1916) [The Flight of Cranes]. The English renderings of his poetry, which include The Gardener (1913), Fruit-Gathering (1916), and The Fugitive (1921), do not generally correspond to particular volumes in the original Bengali; and in spite of its title, Gitanjali: Song Offerings (1912), the most acclaimed of them, contains poems from other works besides its namesake. Tagore’s major plays are Raja (1910) [The King of the Dark Chamber], Dakghar (1912) [The Post Office], Achalayatan (1912) [The Immovable], Muktadhara (1922) [The Waterfall], and Raktakaravi (1926) [Red Oleanders]. He is the author of several volumes of short stories and a number of novels, among them Gora (1910), Ghare-Baire (1916) [The Home and the World], and Yogayog(1929) [Crosscurrents]. Besides these, he wrote musical dramas, dance dramas, essays of all types, travel diaries, and two autobiographies, one in his middle years and the other shortly before his death in 1941. Tagore also left numerous drawings and paintings, and songs for which he wrote the music himself.”Text Quoted From:

Nobel Lectures, Literature 1901-1967, Editor Horst Frenz, Elsevier Publishing Company, Amsterdam, 1969

5 thoughts on “చివరి కోరిక … రబీంద్రనాథ్ టాగోర్.”

 1. Wow,

  really great

  జన గణ మన వ్రాసారు,

  గీతాంజలి famous గా విని ఉన్నాను ఇంతకాలం

  కాని ఏనాడు గుర్తించలేదు

  రవీంద్ర కవీంద్రుని జ్ఞాన సౌరభం

  విన్నారా విన్నారా?
  ఆ ప్రార్థనలో

  చూసారా చూసారా?
  ఆ ఆర్తిని జిజ్ఞాసను ముముక్షుత్వాత్వాన్ని

  గుర్తించారా?
  మనం చేస్తున్నదానిని,

  గ్రహించారా?
  మనం చెయ్యాల్సిన దానిని!

  very extraordinary tremendous ఇంకా ఎంత చెప్పినా తక్కువే,,,,

  నిజానికి భగవంతున్ని (కి) చేయాల్సింది అన్వేషణ కాదు సమర్పణ అని ఒక్క వాక్యం లో
  సమస్య సాధన సిద్ధి మూడు చెప్పసాడు ఈ Indian eternal వేదాంతి

  hats up నా తండ్రి !!

  ?!

  మెచ్చుకోండి

 2. శివ గారూ,
  గురుదేవుడన్నందుకు ఆయన నిజంగా గురుదేవుడే. మనిషికి ఒక కళలో ప్రావీణ్యం ఉండడమే సకృత్తుగా ఉంటుంది. అలాంటిది రవీంద్రుడు, కవి, సంగీతజ్ఞుడు, గాయకుడు, చిత్రలేఖకుడు. జనగణమణ గీతానికి మన అనంతపూర్ జిల్లాలోని మదనపల్లెలో ఉన్నప్పుడు ఆయన దానికి సంగీతాన్ని సమకూర్చేరు.
  గురు శబ్దం ఉన్నతమైనది. అందరికీ వాడవలసిన పదం కాదు. ఉపాధ్యాయులందరూ గురువులు కాలేరు. అందులో కొందరు మాత్రమే గురువులు కాగలరు. గురువు కావడానికి తాను స్వయంగా దార్శనికుడై, లౌకికప్రలోభాలకి అతీతంగా ఆలోచించగలిగి, విశ్వమానవ కళ్యాణానికి సమకాలీన సమాధానం కనుక్కున్నవాడై, దాన్ని బోధించగల సమర్థుడై ఉండాలి. అందుకే, “అజ్ఞాన తిమిరాంధస్య, జ్ఞానాంజన శలాకయా, చక్షురున్మీలనం యేన తస్మై” అన్నారు గురు శబ్దాన్ని నిర్వచిస్తూ. వాళ్ళే అజ్ఞానంలో కొట్టుకుంటూ, కంఠతాపెట్టిన నాలుగుముక్కలూ క్లాసులో వల్లించి, చదువుచెప్పడం చాతగాక పిల్లల్ని మంచిచేసుకోవడం, తదితరవక్రమార్గాలు అవలంబించే వాళ్ళు గురువులెలాగవుతారు?
  భారతీయులు సగర్వంగా చెప్పుకోగల గురుదేవుడు టాగోర్. ఇప్పుడు మనకి మూలవిలువలు మారిపోవడం తో, ప్రేరణనిచ్చేవ్యక్తులు (Idols) మారిపోయారు. అది కాలం చేసే మాయల్లో ఒకటి. “సర్వేజనాశ్శుఖినోభవంతు” అనికోరుకునే భారతీయ ఆత్మకి మూలమైన సంస్కృతి ఇంతకంటే దిగజారిపోకూడదనీ, పరమాణువులుగా విడిపోయే మన మనస్తత్వాలు ఐకమత్యం దిశగా, చేతలలో సమిష్ఠిఅభివృధ్ధి దిశగా పయనించాలనీ, మనగొప్పలు తాతలగురించి చెప్పుకోడానికి గాక నేడు ఆచరణలో చూపించగల మానసిక పరిపక్వత సాధించగలదిశలో ఉండాలని కోరుకుంటూ, అది దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, నిరాశపడక మన బాధ్యతలని ఎన్ని అవాంతరాలొచ్చినా చేసుకుంటూ పోవడమే మన తక్షణకర్తవ్యం.
  గురుదేవుడు పై కవితలో చెప్పినట్టు మన అత్యాశలకీ, దురాశలకీ భరతవాక్యం చెప్పగలిగితే, సంఘశ్రేయస్సులోనే ఆత్మనిర్వాణం ఉందన్న సత్యాన్ని గుర్తించగలుగుతాం.
  అభివాదములతో,

  మెచ్చుకోండి

 3. ”నిరాశపడక మన బాధ్యతలని ఎన్ని అవాంతరాలొచ్చినా చేసుకుంటూ పోవడమే మన తక్షణకర్తవ్యం. గురుదేవుడు పై కవితలో చెప్పినట్టు మన అత్యాశలకీ, దురాశలకీ భరతవాక్యం చెప్పగలిగితే, సంఘశ్రేయస్సులోనే ఆత్మనిర్వాణం ఉందన్న సత్యాన్ని గుర్తించగలుగుతాం”

  Thanks A lot for your Valuable heart touching reply Sir,

  మెచ్చుకోండి

 4. గురువు అన్న అర్హతని చక్కగా చెప్పారు. విశ్వకవిని గూర్చి నేను చెప్పేది చందమామ ని కలం తో గీయటమే అవుతుంది. 2011 made it possible, as part of Tagore’s Sesquicentennial Celebrations, to learn more and be part of some. Personally I liked this Biographical essay on Tagore by Amartya Sen – http://www.nobelprize.org/nobel_prizes/literature/laureates/1913/tagore-article.html

  చలం గీతాంజలి అనువాదం, ఫలసేకరణ పూర్తిగాను ఇంకొన్ని టాగోర్ ఇతరత్రా రచనలు ఇంగ్లీష్ లో కూడా చదివాను, చదువుతుంటాను. అవగాహన మారుతూ ఉంది కూడా.

  I always am in so love with the way Tagore looks at death:

  When death comes and whispers to me
  “Thy days are ended,”
  Let me say to him, “I have lived in love
  And not mere in time.”
  He will ask “Will thy songs remain?”
  I shall say, “I know not, but this I know that
  Often when I sang I found my eternity”.

  నాకు ఇవాళ ముందుగా గుర్తుకు వచ్చిన కవిత ఇది: Ekla Cholo Re = Walk Alone (Tagore’s)

  Mahatma Gandhi cited it as one his favorite songs. We can unitedly make a difference but also create a world of our own individual self too.

  http://en.wikipedia.org/wiki/Ekla_Chalo_Re

  Tagore’s English translation

  If they answer not to thy call walk alone,
  If they are afraid and cower mutely facing the wall,
  O thou unlucky one,
  open thy mind and speak out alone.

  If they turn away, and desert you when crossing the wilderness,
  O thou unlucky one,
  trample the thorns under thy tread,
  and along the blood-lined track travel alone.

  If they do not hold up the light when the night is troubled with storm,
  O thou unlucky one,
  with the thunder flame of pain ignite thy own heart
  and let it burn alone.

  తర్వాత:
  Where The Mind Is Without Fear

  Where the mind is without fear and the head is held high
  Where knowledge is free
  Where the world has not been broken up into fragments
  By narrow domestic walls
  Where words come out from the depth of truth
  Where tireless striving stretches its arms towards perfection
  Where the clear stream of reason has not lost its way
  Into the dreary desert sand of dead habit
  Where the mind is led forward by thee
  Into ever-widening thought and action
  Into that heaven of freedom, my Father, let my country awake

  – Rabindranath Tagore

  మీకు నచ్చుతాయని ఈ సమాచారం.

  1) Tagore’s rare photos from “సంస్కృతి ఎక్స్ ప్రెస్” (తృష్ణ గారి బ్లాగు పోస్ట్) – http://trishnaventa.blogspot.com/2010/09/tagores-rare-photos-from.html

  2) Tagore గొంతులో ఆయన కవితలు, పాట…(ఇదీ తృష్ణ గారి సౌజన్యం తోనే) http://samgeetapriyaa.blogspot.com/2010/06/tagore.html

  —–

  3) చివరిగా నా చివరి కోరికలు నా భాష్యాల్లో విడివిడిగా రాసుకున్నవి:
  -1-
  మనసనే నీ శత్రువు నాకుంది,
  ఆ ఒక్కటీ అంతం చేసేయ్.
  రక్కసి వూహా రాజ్యమేలుతుంది,
  ఆ సంహారమూ కానిచ్చేయ్.
  నన్ను శిధిలం చేయమని నా ప్రార్ధన,
  దేవా! కానుకగా నా మరుజన్మ నీకిచ్చేస్తా
  *****
  -2-

  అయ్యో దేవా,
  నా గుండె తలుపులు, గొళ్ళాలు వూడే దాకా
  తట్టి తట్టి బొబ్బలెక్కాయేమో నీ హస్తాలు
  ఇలా చాపు నా భక్తి నవనీతం రాస్తాను
  రేపో మాపో నాకై అభయమీయాలవి మరి!

  మెచ్చుకోండి

  1. ఉషారాణిగారూ,
   మీకు మిలియన్ మిలియన్ థాంక్స్. మీరు ఇచ్చిన లింకులకే కాదు, చలం అనువాదానికీ, ఒంటరిగా నడు అన్న కవితతో పాటు, మీ మాటల్లో రాసుకున్న “చివరి కోరికలు” కీ. ముఖ్యంగా నాకు ఈ మాటలు చాలా నచ్చాయి: మొదటి కవితలో “కానుకగా నా మరుజన్మ నీకిస్తా” అన్నదీ, రెండో కవిత పూర్తిగానూ. అందులో మంచి చమత్కారం కూడ ఉంది. కాకపోతే చిన్న అనుమానం. మొదటికవిత మొదటి పాదం లో నీ శత్రువుకు బదులు నా శత్రువు అని ఉండాలేమో, లేదా కేవలం శత్రువు అన్నా పర్వాలేదేమో.
   మరొక్క సారి మీకు అనేక కృతజ్ఞతలతో.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: