ఆటవికులకోసం … కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి

[గ్రీకు సాహిత్యంపట్ల దేశంలోనూ బయటా ఆసక్తి  పునరుజ్జీవింపజెయ్యడంలో Cavafy పాత్ర ఎంతైనా ఉంది. కాని దురదృష్టవశాత్తూ, అతను చనిపోయిన తర్వాత, EM Forster, Arnold Toynbee and TS Eliot వంటి ప్రముఖులు చేపట్టేదాకా అతనికృషి ఇంగ్లీషుమాటాడేప్రపంచానికి దాదాపు తెలియదు. అతని సాహిత్యసృష్టిఅంతా గ్రీకుభాషలోనే జరిగింది. అయితే అతని అన్ని కవితలూ అనువాదం  చెయ్యబడ్డాయి. కాకపోతే, అతని మాతృభాషలోని నైపుణ్యం అనువాదాలలో అంతగా కనిపించదు. అంత్యప్రాసలు లేకపోవడం, ఉన్నచోట వ్యంగ్యాన్ని సూచించడం, సంప్రదాయేతర విషయాలపై కవిత్వం రాయడం అతని ప్రత్యేకతలు. అగోచరమైనభవిషత్తు, మనసునివివశంచేసే ఆనందాలు, నైతిక ప్రవర్తన, వ్యక్తుల మానసిక ప్రవృత్తి,  స్వలింగసంపర్కం, అతని కవిత్వాన్ని నిర్వచించే కొన్ని ముఖ్యమైన కవితావస్తువులు. అతనికి కవితలో ప్రతి పాదాన్నీ లోపరహితంగా రాయడం ఎంత అలవాటంటే, అది ఒక చాదస్తంగా గుర్తించవలసినంత.

1904 లో రాసిన “Waiting for the Barbarians” కవితా, 1911 లో వ్రాసిన Ithaca అన్న కవితలు కన్స్టాంటిన్ కవాఫిజ్ కి అమితమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. అతను  తన కవిత్వాన్ని పుస్తకరూపంలో తీసుకు రాలేదు. అతని మరణానంతరం 1935లో అతని 154 కవితలతో మొదటి కవితా సంకలనం వచ్చింది. ఇంకా చాలా సాహిత్యం అసంపూర్ణంగా ఉండిపోయింది.

ఈ కవిత రోమను సామ్రాజ్య చరిత్ర నేపథ్యంగా వ్యంగ్యంగా రాయబడింది. ఏదైనా ఒక ప్రమాదమో, ఒక దండయాత్రో జరుగబోతుందంటే, ప్రజలూ, అధికారులూ, సామ్రాజ్యాధినేతలూ, శాశనసభ్యులూ, ప్రజలూ ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా స్పందిస్తారు. చక్రవర్తి తన సార్వభౌమత్వాన్ని పదిలం చేసుకుందికీ, అధికారులు తమ అధికారాన్ని పదిలం చేసుకుందికీ ప్రయత్నిస్తుంటారు. ప్రజలు తమకు ఎప్పుడైనా ప్రస్తుతం ఉన్న దౌర్భాగ్యస్థితినుండి విముక్తి లభిస్తుందేమో నని ఆశగా చూస్తుంటారు. భయపెట్టో, ప్రలోభ పెట్టోరాజ్యాధినేతలూ, విధేయత కనబరిచి అధికారులూ, తమ పబ్బం గడుపుకోగలరు. ఎటొచ్చీ అమ్మకిచిక్కిన మేకల్లా ఏదో మంచి ఎక్కడినుండో, ఎవరివల్లనో జరుగుతుందని ఎదురుచూపులు చూసేది ప్రజలే. పరోక్షంగా, ఏ మార్పు అయినా తమవల్లనే జరగాలి తప్ప “ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకురా” అని శ్రీ శ్రీ చెప్పిన సత్యం ఈ కవిత ప్రతిఫలిస్తుంది.]

.
అందరూ ఎందుకు బజారులో సమావేశమై,
ఎవరికోసం ఎదురు చూస్తున్నారు?

ఇవాళ ఆటవికులు వచ్చే రోజు. అందుకు.

చట్టసభలో ఏ కార్యకలాపాలూ జరగడం లేదెందుకు?
సభ్యులెందుకు ఖాళీగా కూర్చున్నారు చట్టాలు చెయ్యకుండా?

ఎందుకంటే, ఆటవికులీరోజు వస్తున్నారు కాబట్టి
ఇక చట్టసభ్యులేం చట్టాలు చెయ్యగలరు?
ఒకసారి ఆటవికులిక్కడకు వస్తే, వాళ్ళే చట్టాలు చేస్తారు

చక్రచర్తి ఎందుకు అంతపొద్దున్నే లేచి, నగర ముఖద్వారం దగ్గర
సింహాసనం మీద కిరీటం ధరించి రాజసంతో కూర్చున్నారు?

ఆటవికులు ఈరోజు వస్తున్నారు కాబట్టి,
వాళ్ళ నాయకుడిని  ఆహ్వానించడానికి.
అతనికి బిరుదులూ, పదవులూ ఇవ్వడానికి
ఒక పట్టీ కూడా ఒకటి తయారుచేసి ఉంచేరు.

చక్కని చేతిపనిచేసిన ఎర్రని అధికారదుస్తులు వేసుకుని మరీ
మన ఇద్దరు సేనాధిపతులూ, న్యాయాధీశులూ వచ్చేరెందుకు?
అన్ని గరుడపచ్చలుపొదిగిన కంకణాలెందుకు వేసుకున్నారు?
వేళ్ళకి మరకతాలతో మెరుస్తున్న ఆ ఉంగరాలెందుకు?

ఎందుకంటే, ఇవాళ ఆటావికులు వస్తున్నారు కాబట్టి.
అలాంటివి వస్తువులు వాళ్ళ కళ్ళుచెదిరేలా చేస్తాయి.

అలవాటుగా  చెప్పదలుచుకున్నదేదో చెప్పడానికి
మన ప్రముఖ వక్తలెవరూముందుకు రావడం లేదెందుకు?

ఎందుకంటే, ఇవాళ ఆటనికులు వస్తున్నారు కాబట్టి.
వాళ్ళు ఉపన్యాసాలన్నా, మాట్లాడడమన్నా విసుగెత్తిపోయారు.

***

అకస్మాత్తుగా ఎందుకింత గందరగోళం, అసంతృప్తి?
(చూసారా ప్రజలముఖాలెలా గంభీరంగా అయిపోయాయో!)
వీధులూ, పేటలూ ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి?
ప్రజలందరూ ఎందుకు ఆలోచనల్లోపడి
ఇంటిముఖం పడుతున్నారు?

ఎందుకంటే, చీకటిపడిపోయింది, కానీ ఆటవికులు రాలేదు.
పొలిమేరలనుంచి ఇప్పుడే తిరిగి వచ్చినవాళ్ళు చెబుతున్నారు
అసలు ఆటవికులన్నవాళ్ళెవరూ ఇంక లేరుట.

అలా అయితే, ఆటవికులు లేకుండా ఇప్పుడు మనకెలా?
ఆ ఆటవికులు మనసమస్యలకి ఒకరకమైన సమాధానమేనే?

*

(ఎడ్మండ్ కీలీ అనువాదం)

*

కన్స్టాంటిన్ కవాఫిజ్

(29 ఏప్రిల్ 1863 – 29 ఏప్రిల్ 1933)

గ్రీకు కవి, పాత్రికేయుడు, ప్రభుత్వోద్యోగి

Waiting for the Barbarians

.

What are we waiting for, assembled in the forum?

The barbarians are due here today.

Why isn’t anything happening in the senate?
Why do the senators sit there without legislating?

Because the barbarians are coming today.
What laws can the senators make now?
Once the barbarians are here, they’ll do the legislating.

Why did our emperor get up so early,
and why is he sitting at the city’s main gate
on his throne, in state, wearing the crown?

Because the barbarians are coming today
and the emperor is waiting to receive their leader.
He has even prepared a scroll to give him,
replete with titles, with imposing names.

Why have our two consuls and praetors come out today
wearing their embroidered, their scarlet togas?
Why have they put on bracelets with so many amethysts,
and rings sparkling with magnificent emeralds?
Why are they carrying elegant canes
beautifully worked in silver and gold?

Because the barbarians are coming today
and things like that dazzle the barbarians.

Why don’t our distinguished orators come forward as usual
to make their speeches, say what they have to say?

Because the barbarians are coming today
and they’re bored by rhetoric and public speaking.

Why this sudden restlessness, this confusion?
(How serious people’s faces have become.)
Why are the streets and squares emptying so rapidly,
everyone going home so lost in thought?

Because night has fallen and the barbarians have not come.
And some who have just returned from the border say
there are no barbarians any longer.

And now, what’s going to happen to us without barbarians?
They were, those people, a kind of solution.

.

(1904)

(translated by Edmund Keeley)

.

Image Courtesy: http://www.poemhunter.com

Constantine Cavafy

Greek Poet, Journalist and a Civil  Servant.

(29 April 1863 – 29 April , 1933)

Cavafy was largely responsible for the revival of interest in Greek poetry at home and abroad, but unfortunately, not until after his death and till EM Forster,Arnold Toynbee and TS Eliot promoted him in the english speaking world, his work remained unknown. His skill and craftsmanship in his native language are such that most of it is lost in translation. His poems are noted for their unconventional themes and for the absence of rhyme and for the irony, wherever  it was. Uncertainty about the future, sensual pleasures, the moral character and psychology of individuals, homosexuality, are some of his defining themes, which he drew from his own experience and from his knowledge of history. He was a perfectionist to the point of obsession.

“Waiting for the Barbarians” written in 1904, is one of his most famous poems along with Ithaca written in 1911. Almost all of his work was in Greek but all of it was widely translated. He never published his poems, and the first anthology of his 154 poems appeared posthumously.  He left behind a large volume of work unfinished.


“ఆటవికులకోసం … కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి” కి 3 స్పందనలు

  1. శర్మగారూ,
   ఈ కవితని చాలారకాలుగా వ్యాఖ్యానించుకోవచ్చు. నేను అర్థం చేసుకున్నది చెప్తాను. కవితలో because the barbarians are coming today అన్నది మాటిమాటికి పునరావృతమౌతున్న మాట. దీన్ని refrain అంటారు. ఈ బార్బేరియన్ అన్నమాట మనం ఓరి అప్రాచ్యుడా అన్న తిట్టులాంటిది. ముందుగా గ్రీకులు గ్రీకులు కానివాళ్ళనందరికీ వాడే వారుట; తర్వాత యూరోపియనులు నాన్ యూరోపియనులకి వాడేవాళ్ళు. అలా ప్రతి భాషలోనూ దాని పర్యాయపదాలుండవచ్చు. తమ మతవిశ్వాసాలకి భిన్నమైన విశ్వాసం ఉన్నవాళ్ళని కూడా బార్బేరియన్స్ అనీ, పాగన్స్ అనీ పిలిచేవాళ్ళు. బార్బేరియన్ అంటే, ఆటవికులు, అనాగరికులు, సంస్కారం లేనివాళ్ళు. వాళ్ళు మూర్ఖులూ బలవంతులూ అయి ఉండొచ్చు.
   ఇంతకీ వీళ్ళందరూ ఎందుకు వాళ్ళకోసం ఎదురుచూస్తున్నట్టు? వీళ్ళు బలవంతులైతే బలాల్ని మోహరించి వాళ్ళని ఎదుర్కోవడానికి సన్నాహాలు చెయ్యాలి తప్ప స్వాగతించడానికి సన్నాహాలు చెయ్యకూడదు. అంటే వచ్చేవాళ్ళు వీళ్ళకంటే బలమైన వాళ్ళు అని అర్థం అవుతోంది. అంతేకాదు, వీళ్ళు స్వాగతించడానికీ, చక్రవర్తి బిరుదులూ మాన్యాలూ ఇవ్వడానికి సంసిధ్ధులై ఉన్నారంటే, వాళ్లతో సంధిచేసుకునే ప్రయత్నంలో ఉన్నారని అర్థం అవుతుంది. ఎంతో ఉత్సాహంగా వచ్చిన ప్రజలు, నీరసంగా, దిగులుతో ఇంటిముఖం పట్టే రంటే, వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితికంటే మంచి మార్పు వస్తుందేమో నన్న ఆశతో వచ్చేవారిని చూడడానికి వచ్చేరనీ, వాళ్ళు రాకపోవడం నిరాశ కలిగించిందనీ అర్థం చేసుకో వచ్చు. బలహీనుడైన రాజు (ఇప్పటి మన కేంద్రప్రభుత్వం లాగ) ఎప్పుడూ తన సుఖాలకి తక్కువలేనంతవరకూ (అధికారానికి ఢోకాలేనంతవరకు) ఎవరితోనైనా సంధికి సిధ్ధంగా ఉంటాడు. అధికారులు కూడా (మనం రోజూ పేపర్లలో చదివేIAS, IPS అధికారులవంటివాళ్ళు) తమపదవులకి హామీ ఉన్నంతవరకు ఏ అరాజకానికైనా వత్తాసుపలుకుతుంటారు. ఎటొచ్చీ ప్రజలే, రక్తపాతాలేవీ లేకుండా ఎప్పుడైనా మంచి మార్పు వస్తుందేమోనని ఎదురు చూస్తుంటారు. హిట్లరు యూరోపును ఆక్రమించుకుందికి వచ్చినపుడు చాలా దేశాలు పోరాటం చెయ్యకుండ దాసోహమన్నాయి. అలెగ్జాండరు దండెత్తి వచ్చినప్పుడు హిందూ దేశంలో చాలామంది రాజులు దాసోహం అన్నారు.

   ఇక్కడ ఎవరూ రాలేదని చెప్పడం, పై వర్గాలవాళ్లకి వాళ్లు తెలిసి చేస్తున్న తప్పుడు పనులకి వాళ్ల అంతరాత్మ కలిగించే భయానికి చిహ్నమైతే, సామాన్యప్రజలకి, మార్పు వాళ్లు తీసుకుని వచ్చే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఎక్కడనుండో రాదని చెప్పే ప్రయత్నం గా నేను అర్థం చేసుకున్నాను. ఇది సరియైనది కాకపోవచ్చు.
   అభివాదములతో,

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: