అనువాదలహరి

ఎర్రగులాబీతగిలించిన కోటు … S I Kishor

Image Courtesy: http://lh5.ggpht.com

(శీల పరీక్ష (Test of Character) అంటారు దీన్నే. మనం కోరికకీ, విలువలకీ మధ్య సందిగ్ధంలో చిక్కుకున్నప్పుడు విలువలకి కట్టుబడుతూనో, లేక కోరికకి లొంగిపోయో మనం అమలుపరిచే నిర్ణయమే మన శీలాన్ని ఋజువుచేస్తుంది. అటువంటి అద్భుతమైన సమస్యని చిన్న ఇతివృత్తంలో ఆవిష్కరించాడీ కథానిక రచయిత. దురదృష్టవశాత్తూ ఈ రచయితగురించి ఏ సమాచారమూ నేను సంపాదించలేకపోయాను. ఎవరైనా అందించగలిగితే ఎంతో ఋణపడి ఉంటాను. )

.

జాన్ బ్లాం షార్డ్ బెంచీమీంచి లేచి నిలుచున్నాడు. తన యూనిపారం ఒకసారి సద్దుకుని, గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ గుండా వెళ్తున్న ప్రయాణీకుల్ని ఒకసారి పరిశీలించాడు. అతనొక అమ్మాయికోసం వెతుకుతున్నాడు… ఆమె హృదయం అతనికి తెలుసు కాని ఎన్నడూ ఆమెని తను చూడలేదు… కోటుకి గులాబీ పువ్వు పెట్టుకుని తనకోసం ఎదురుచూస్తున్న అమ్మాయి.

ఆమె మీద అతనికి కుతూహలం 13 నెలలక్రింద ప్రారంభమయింది. ఫ్లారిడా లైబ్రరీలో ఒకసారి బీరువాలోంచి ఒక పుస్తకం తీసుకుని చదువుతుంటే, అతనికి పుస్తకంలోని మాటలకంటే, పుస్తకం మార్జినులో పెన్సిలుతో వ్రాసుకున్న వ్యాఖ్యానాలు చాలా చమత్కారంగా కనిపించేయి. ఆ సరళమైన దస్తూరీలో తనకి ఒక ఆలోచనాపూర్ణమైన మనస్తత్త్వమూ, విషయాన్నిలోతుగా పరిశీలించగల సూక్ష్మబుద్ధీ ప్రతిబింబించాయి. వెంటనే ఆ పుస్తకం తనకంటే ముందు ఎవరు ఇంటికి తీసుకెళ్ళేరో వాళ్ల పేరు చూసాడు. పేరు మిస్ హోలిస్ మేనెల్.  కొంత సమయం వెచ్చించి ప్రయత్నించగా ప్రయత్నించగా ఆమె చిరునామా సంపాదించగలిగేడు.

ఆమె న్యూయార్క్ నగరంలో ఉంటోంది.  అతనామెకి ఒక ఉత్తరం రాసేడు తనని పరిచయచేసుకుంటూ,  ఉత్తర ప్రత్యుత్తరాలు జరపమంటూ. మరుచటిరోజే ప్రభుత్వం అతన్ని రెండవప్రపంచసంగ్రామంలోకి బలవంతంగా ఓడమీద తరలించింది. ఈ పదమూడు నెలలుగా ఒకరినొకరు ఉత్తరాలద్వారా తెలుసుకోగలిగేరు.  ప్రతి  ఉత్తరమూ ఒక సారవంతమైన నేలమీద పడిన బీజం అయింది. ఇద్దరి మధ్య ప్రేమ అంకురిస్తోంది. బ్లాం షార్డ్ అమెని ఫొటో పంపించమని కోరాడుగాని ఆమె తిరస్కరించింది. అతనికి నిజంగా తనపట్ల అభిమానం ఉంటే తనెలా ఉన్నదన్నదానితో దానికి సంబంధంలేదని భావించింది. చివరకు ఎలాగైతేనేం, తను యుధ్ధం నుండి విడుదలయే రోజు రానే వచ్చింది. వాళ్ళు తమ తొలికలయిక గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లో సాయంత్రం 7 గంటలకి నిర్ణయించుకున్నారు. “నువ్వు నన్ను నా కోటుకున్న ఎర్రగులాబీ ద్వారా గుర్తు పట్టగలవు” అని తను వ్రాసింది ఉత్తరంలో.  అందుకని తను సరిగ్గా 7 గంటలకి స్టేషనులో ఉన్నాడు … తన మనసు తెలిసీ, ఎన్నడూ చూడని అమ్మాయి కోసం.

బ్లాం షార్డ్ మాటల్లోనే చదవండి తర్వాత ఏమయిందో…

“ఒక యువతి నా వైపు నడుచుకుంటూ వస్తోంది … సన్నగా పొడుగ్గా ఉంది. ఆమె సొగసైనజుత్తు రింగులుతిరిగి నాజూకైన చెవులమీదనుండి వెనక్కి పడుతోంది; ఆమె కళ్ళు పువ్వుల్లా నీలంగా ఉన్నాయి. ఆమె  పెదాలలోనూ, చిబుకంలోనూ, మృదుత్వంతో పాటు ధృడత్వం కనిపిస్తోంది; తను ధరించిన లేతాకుపచ్చరంగు సూటులో వసంతానికి ప్రతిరూపంలా అనిపించింది. నేనామె వైపు వెళ్ళబోయాను, ఆమె కోటుకి గులాబీపువ్వులేదన్న సంగతి పూర్తిగా మరిచిపోయి. నేను అటు కదలగానే, ఆమె పెదాలమీద ఒక సన్నని చిరునవ్వు, కవ్విస్తూ తారాడింది. “నా దారిలోకి వచ్చెస్తున్నావు, నావికుడా” అని మెత్తగా హెచ్చరించింది. ఇక నిగ్రహించుకోలేక ఆమె వైపు ఒక అడుగువేశాను. అంతే! సరిగ్గా అప్పుడు నాకు కనిపించింది… హోలిస్ మే నెల్!! ఆమె ఈ అమ్మాయికి వెనకే నిలుచుంది. మేనెల్ కి నలభై ఏళ్ళు దాటే ఉంటాయి. తెల్లబడుతున్న ఆమె జుట్టుని, తన మాసిపోయిన టోపీక్రింద అదిమిఉంచింది. ఆమెది స్థూలకాయమనే చెప్పాలి. బలిష్ఠంగాఉన్న ఆమెపాదాలు మడమలేనిజోళ్ళలోకి దూర్చిఉన్నాయి. ఆ ఆకుపచ్చరంగు సూటు తొడుక్కున్న అమ్మాయి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. నన్నెవరో రెండుగా చీల్చినట్లనిపించింది. ఒకప్రక్క ఆ అమ్మాయి వెనక వెళదామా అని ఎంత గాఢంగా అనిపించిందో, రెండోప్రక్క తనస్ఫూర్తితో నన్నునిలిపి నాకు తోడుగానిలిచిన ఆమెతో ఉండాలని అంతగాఢంగానూ అనిపించింది. అమె అక్కడే నిలబడి ఉంది. ఆరోగ్యవంతమైన ఆమె ముఖం వాడినట్లున్నా, ఆమె ముఖంలో ఏదో ప్రశాంతత, ఆవేదన కనిపిస్తున్నాయి;  తెల్లని ఆ కళ్ళు ఆర్ద్రతతో, అనురాగంతో మెరుస్తున్నాయి.

“నేనింక సంకోచించలేదు. ఆమె నన్నుగుర్తుపట్టడానికి వీలుగా పాలిపోయిన నీలిరంగుఅట్టవేసినపుస్తకాన్ని చేతుల్లో గట్టిగా పట్టుకున్నాను. ఇదిప్రేమ కాకపోవచ్చు… కాని అంతకంటే అమూల్యమైనది, బహుశా, ప్రేమకంటేకూడా గొప్పదైన ఒక స్నేహం… దానికి నేను ఎల్లప్పుడూ ఋణపడిఉంటాను. నేను నిటారుగా నిలుచుని, ఆమెకు అభివాదంచేసి, గుర్తుగా ఆమెకి పుస్తకం చూపిస్తూ, అమెతో మాట్లాడుతున్నప్పుడు కొంత అసంతృప్తితో నా గొంతుబొంగురుపోయినా, “నా పేరు బ్లాం షార్డ్. మీరు తప్పకుండ మిస్ హోలిస్ మేనెల్ అయి ఉంటారు. మిమ్మల్ని కలిసినందుకు నాకు మహదానందంగా ఉంది.  మిమ్మల్ని నాతో డిన్నర్ కి తీసుకి వెళ్ళొచ్చా?” అన్నాను. శాంతమైన నవ్వుతో ఆమె ముఖం విప్పారింది. “ఈ వ్యవహారం ఏమిటో నాకు తెలియదు, నాయనా! అదిగో, ఆ వెళ్ళిపోతున్న లేత ఆకుపచ్చ రంగు కోటువేసుకున్న అమ్మాయి,” అమె చెబుతోంది, “నన్ను ఈ గులాబీని నాకోటుకి తగిలించుకోమని చెప్పింది. నువ్వుగాని నన్ను డిన్నరుకి ఆహ్వానిస్తే, అదిగో రోడ్డుకి అవతలపక్కనున్న పెద్ద రెస్టరాంట్ లో నీ కోసం నిరీక్షిస్తున్నట్టు చెప్పమంది.  ఇది ఒక రకమైన పరీక్ష అని మాత్రం చెప్పింది.””

S I Kishor, 1943

.

The Rose Lapel

John Blanchard stood up from the bench, straightened his Army uniform, and studied the crowd of people making their way through Grand Central Station. He looked for the girl whose heart he knew, but whose face he didn’t, the girl with the rose.

His interest in her had begun thirteen months before in a Florida library. Taking a book off the shelf he found himself intrigued, not with the words of the book, but with the notes penciled in the margin. The soft handwriting reflected a thoughtful soul and insightful mind. In the front of the book, he discovered the previous owner’s name, Miss Hollis Maynell. With time and effort he located her address.

She lived in New York City. He wrote her a letter introducing himself and inviting her to correspond. The next day he was shipped overseas for service in World War II. During the next year and one month the two grew to know each other through the mail. Each letter was a seed falling on a fertile heart. A romance was budding. Blanchard requested a photograph, but she refused. She felt that if he really cared, it wouldn’t matter what she looked like. When the day finally came for him to return from Europe, they scheduled their first meeting – 7:00 PM at the Grand Central Station in New York. “You’ll recognize me,” she wrote, “by the red rose I’ll be wearing on my lapel.” So at 7:00 he was in the station looking for a girl whose heart he loved, but whose face he’d never seen. I’ll let Mr. Blanchard tell you what happened:

A young woman was coming toward me, her figure long and slim. Her blonde hair lay back in curls from her delicate ears; her eyes were blue as flowers. Her lips and chin had a gentle firmness, and in her pale green suit she was like springtime come alive. I started toward her, entirely forgetting to notice that she was not wearing a rose. As I moved, a small, provocative smile curved her lips. “Going my way, sailor?” she murmured. Almost uncontrollably I made one step closer to her, and then I saw Hollis Maynell. She was standing almost directly behind the girl. A woman well past 40, she had graying hair tucked under a worn hat. She was more than plump, her thick-ankled feet thrust into low-heeled shoes. The girl in the green suit was walking quickly away. I felt as though I was split in two, so keen was my desire to follow her, and yet so deep was my longing for the woman whose spirit had truly companioned me and upheld my own. And there she stood. Her pale, plump face was gentle and sensible, her gray eyes had a warm and kindly twinkle.

I did not hesitate. My fingers gripped the small worn blue leather copy of the book that was to identify me to her. This would not be love, but it would be something precious, something perhaps even better than love, a friendship for which I had been and must ever be grateful. I squared my shoulders and saluted and held out the book to the woman, even though while I spoke I felt choked by the bitterness of my disappointment. “I’m Lieutenant John Blanchard, and you must be Miss Maynell. I am so glad you could meet me; may I take you to dinner?” The woman’s face broadened into a tolerant smile. “I don’t know what this is about, son,” she answered, “but the young lady in the green suit who just went by, she begged me to wear this rose on my coat. And she said if you were to ask me out to dinner, I should go and tell you that she is waiting for you in the big restaurant across the street. She said it was some kind of test!”

SI Kishor, 1943

(Story Courtesy: http://www.jcsnotebook.org/the-true-nature-of-a-heart/)

%d bloggers like this: