అనువాదలహరి

అస్తి-నాస్తి … రూమీ, సూఫీ తత్త్వవేత్త, పెర్షియన్ కవి.

(ఈ కవితలో అద్భుతమైన వ్యంగ్యంతో కూడిన మేల్కొలుపు ఉంది. మనకి కష్టాలు రాకముందే, ఏదో వస్తుందని ముందే ఊహించుకుని ఆ వరదలో కొట్టుకుపోతుంటాం.  మన ఆలోచనలలోనే బందీలం అయిపోతాం. ఆట ఓడిపోతామనే భయంతో ఆడకముందే ఓడిపోతాం. విజయాన్ని సంపాదించకముందే, విజయాన్ని ఊహించుకుని ఆ మత్తులో తేలుతుంటాం. మన గతస్మృతులు అనే రణరంగంలో ఎప్పుడో వధించబడ్డవాళ్ళమి. మనకి ప్రతిక్షణం పునర్జన్మ ప్రసాదిస్తున్నా, ఇంకా గతంలోనే బ్రతకడానికి, మంచైనా చెడైనా, వెంపర్లాడుతుంటాం. మనకి సత్యానికీ (ఈ క్షణం), మిధ్య లేదా ఊహకీ (గతమూ/ భవిష్యత్తూ)మధ్య లేడా తెలీదు. మనం ఈ క్షణంలో చైతన్యంతో ఉంటే మరుక్షణంలో నిరాశానిస్పృహలతో అస్తిత్వం కోల్పోతుంటాం.)

.

నేను
ఇంకా ముంచెత్తని వరదలో
కొట్టుకుపోతున్నాను

నేను
ఇంకా కట్టని బందిఖానాలో
బందీనై ఉన్నాను

నేను
భవిషత్తులో ఆడబోయే
చదరంగం ఆటలో ఓడిపోయాను

నేను
ఇంకా రుచిచూడని నీ మదిరలో
మత్తెక్కి ఉన్నాను

నేను
ఎప్పుడో జరిగిన యుధ్ధంలో
రణరంగంలో వధించబడ్డాను

నాకు
నిజానికీ, ఆలోచనకీ మధ్య
తేడా తెలియదు.
నీడలా
నేను ఉన్నాను
లేను.

రూమీ.  

.

I AM AND AM NOT

I’m swimming
in the flood
which has yet to come

I’m shackled
in the prison
which has yet to be built

I am the checkmate
in a future game of chess

I’m drunk with your wine
which remains untasted

I’m slain on a battlefield
of long ago

I don’t
know the difference
between idea and reality

Like a shadow
I am
and am not.

.

Rumi

Jalāl ad-Dīn Muḥammad Rūmī, simply known as Rumi for the english speaking world, was a 13th century Sufi mystic, Persian Poet, Theologian, and a Jurist who flourished in the Eastern Roman Empire and hailed from Balkh province which is presently under Tajikisthan. Persian mystic poet Attar of Nishapur,who presented a book about the entanglement of Soul in the material world to Rumi,  had great influence on him. Legend goes that his meeting with Shams-e Tabrizi on 15th November 1244 has metamorphosed him from an accomplished jurist and preacher to an ascetic. Masnavi, his magnum opus, in 6 volumes is a spiritual work of about 25 thousand couplets.  And his other major work is Diwan-e Shams-e Tabrizi, a work dedicated to his teacher containing couplets and Ghazals in Arabic, Turkish and Greek. Besides, he has 3 other prose works, his seventy-one talks (Fihi Ma Fihi), 7 Persian sermons / lectures (Majāles-e Sab’a) and his letters (Makatib).

%d bloggers like this: