నెల: మే 2012
-
మనసులో మాట … ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ
. పక్కమీదకి గెంతే చావు-పిల్లి కోసం ఎదురుచూస్తూ, నా భార్యను తలుచుకుంటుంటే నాకు బాధ వేస్తోంది . రేపు కొయ్యలా బిర్రబిగుసుకుపోయి తెల్లగా పాలిపోయిన ఈ శరీరాన్ని చూసి ఒక సారి కదిపి, “ఏమండీ” అని ఏడుస్తుంది. కానీ, ఈ “ఏమండీ” పలకడు . నన్ను బాధించేది నా చావు కాదు. అయ్యో, ఈ పనికిమాలిన శరీరపుకుప్పతో నా భార్య మిగిలిపోతుందే అని! నాకు ఆమెతో చెప్పాలని ఉంది ఆమెపక్కని ఎన్ని రాత్రుళ్ళు పడుకున్నా ఆమెతో ఎన్ని […]
-
Kapardi … Viswanatha Satyanarayana
Kapardi (A dream turned into a story ) Andhra Patrika Ugadi Special 1949. *** I knew Kapardi for the last two years. And that acquaintance developed into some kind of friendship. My respect for him was waxing by the day. He might be around thirty. He was a lawyer by profession. Though there was not […]
-
తేలికగా నడవండి … ఆస్కార్ వైల్డ్ (తన చెల్లెలి స్మృతిలో)
. అడుగులు తేలికగా వేసి నడవండి, ఆమె ఈ మంచుపొరకిందే ఉంది ష్! నెమ్మదిగా మాటాడండి, ఆమె విరులు విరియడాన్ని వినగలదు మేలిమి బంగారంలాంటి ఆమె జుత్తు, తుప్పుతో కళంకితమైపోయింది పాపం, చిన్నపిల్ల, ఎంతో అందమైనది, మట్టిలో కలిసిపోయింది తెల్లకలువలాంటిది, హిమమంత తెల్లనిది తను స్త్రీనన్న విషయంకూడ తెలియనంత అమాయకంగా పెరిగింది ఇప్పుడు శవపేటిక, బరువైన రాతిపలకా ఆమెగుండెమీద కూర్చున్నాయి నేను ఏకాంతంలో శోకిస్తున్నాను, తను మాత్రం ప్రశాంతంగా నిద్రిస్తోంది చాలు. ఆపండి. మీ వీణా నాదాల్నీ, […]
-
నన్ను మరిచిపో వద్దు … అజ్ఞాత కవి
. మీరు రోజు గడుపుతూ ఆలోచనలో ములిగిపోయినా నన్ను మరిచిపో వద్దు. నేను యుధ్ధం చేసేను. చేస్తూ గాయపడ్డాను. నన్ను మరిచిపోవద్దు. ఋణం తీర్చుకోలేని ప్రాణత్యాగాలవల్ల స్వాతంత్ర్యం వచ్చింది. నన్ను మరిచిపోవద్దు. మీ పిల్లలకి బోధించినపుడల్లా గతాన్ని గుర్తుంచుకోమనండి. నన్ను మరిచిపోవద్దు. మీరు బాధలో ఉన్నా, ప్రార్థనలో ఉన్నా నన్ను మరిచిపోవద్దు. నేను తూటా పేలడం విన్నాను. అయినా, వెన్నిచ్చి పారిపోలేదు. నన్ను మరిచిపోవద్దు. నేనొక దేశభక్తుడిని ఈ రోజు మీ సాయం నాకు కావాలి. నన్ను […]
-
కొడుక్కి అమ్మ ఉత్తరం … లాంగ్స్టన్ హ్యూజ్
. ఒరే, నాన్నా! నీకో విషయం చెప్పాలి: నా జీవితం ఏమీ బంగారు మెట్లెక్కినంత సాఫీగా గడిచిపోవడంలేదు. అన్నీ కర్రమెట్లే. చాలాచోట్ల మేకులు దిగి ఉన్నాయి. మెట్లకి పెచ్చులూడిపోయాయి. చెక్కలు అక్కడక్కడ కన్నాలు కూడపడ్డాయి. దానిమీద తివాచీ చిరిగిపోయి కొన్ని చోట్ల బోసిగా కూడా ఉంది అయినా, ఆగకుండా ఎక్కుతూనే ఉన్నాను. మధ్యలో మార్గాయాసం తీర్చుకుంటున్నాను. అవరోధాలొచ్చినపుడు దిశమార్చుకుంటున్నాను, ఒక్కోసారి ఎక్కడా వెలుతురుకనరానప్పుడు, చీకట్లోనే గుడ్డిగా ప్రయాణిస్తున్నాను. కాబట్టి, నాన్నా, నువ్వెన్నడూ వెనకడుగెయ్యడానికి ప్రయత్నించకు. మెట్లమీదే చతికిలబడిపోకు […]
-
అమర సైనికుడు … రాబర్ట్ ఫ్రాస్ట్
. మంచుకురిసినా, తుప్పు పట్టినా, నేలలోకి దిగింది దిగినట్టుగా మట్టిలో దూసుకెళ్ళిన పదునుతోనే ఉండిపోయిన పైకితియ్యని కత్తిలాంటి వాడు అతను. మనం ప్రపంచాన్ని ఎంత పరికించి చూచినా అతను ప్రాణాలర్పించడానికి తగ్గ ఉదాత్తలక్ష్యం కనిపించదు కారణం, సామాన్యజనం లాగ, మనమూ హ్రస్వదృష్టులమే భూమికి పరిమితమైన మన ఆలోచనల్లాగే మన అస్త్రాలు కూడా ఎంతో ఎత్తుకు ఎగరలేవని మరిచిపోతాం. అవి రాలిపోయి, పచ్చికను చీల్చుకుని భూతలాన్ని తాకి, ధ్వంశమైపోతాయి. మనం శిలాఫలకాలపై శాశ్వతమైన కీర్తిప్రతిష్ఠలకోసం అల్లాడేట్టు చేస్తాయి. కానీ, […]
-
అక్కసు … ఫ్రాంక్ ఒహారా
. నాకు చాలా విషయాల గురించి తెలుసు. ఇంకా తెలుసుకుంటూనే ఉంటాను. ఎంత ఎక్కువంటే, ఇక నా బుర్రపట్టనంత. ఇవతలవాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవడం, వాళ్ళు ఏమిటి చేస్తుంటున్నారో తెలుసుకోవాలనే బలహీనతే నన్ను నిలబెడుతోంది. దాని విలువేమిటో నాకు తెలియదంటే గొప్ప చికాకు తెప్పిస్తుంది. వాళ్ళకి దాని విలువేమిటో నాకు తెలుసు. అందుకే నాకు అసహ్యం . ఫ్రాంక్ ఒహారా (మార్చి 27, 1926 – జులై 25, 1966 ) అమెరికను రచయితా, కవీ, విమర్శకుడూ […]
-
సగటు మనిషి … రాబర్ట్ విలియం సర్విస్
మేధావిననే అపోహలు లేని అతి సాధారణ…. సగటు మనిషిని నేను జాగ్రత్తగా, ఉన్న కొద్దిపాటి లోకజ్ఞానంతో, ఒక సుఖప్రదమైన జీవితానికి ప్రణాళిక వేసుకుంటాను అందరూ చేసే పనులూ నేను చేస్తాను అందరూ మాటాడే మాటలే నేనూ మాటాడుతుంటాను; పొద్దున్న వార్తాపత్రిక చదువుతూ ఈ రోజు సమస్యలేమిటో తెలుసుకుంటాను నా జీవితం నిస్సారమనీ, మరీ సామాన్యమనీ నువ్వనుకోవడం సహజం. అయితే నేం? నా దృష్టిలో, నేను నా జాతికి ప్రతినిధిని. నా పేరు అందరికీ సర్వనామంగా […]
-
ఔష్విజ్ … లేయాన్ ఫెలిపె స్పానిష్ కవి.
. ప్రపంచంలోని యూదులందరికీ… నా స్నేహితులారా (నా తోబుట్టువులారా), నరకాన్ని వర్ణించిన కవులు దాంతే, బ్లేక్, రింబో లని నెమ్మదిగా మాటాడనీండి… మౌనంగా ఉండనీండి! ఇవాళ, ఈ భూమ్మీద నివసిస్తున్న వాడెవడికైనా, నరకం అంటే ఏమిటో వాళ్ళముగ్గురి కంటే ఎక్కువ తెలుసు. దాంతే ఒక భగవద్దత్తమైన ప్రతిభకల వాయులీన విద్వాంసుడని నాకు తెలుసు. ఓహ్! అతనొక గొప్ప కళాప్రపూర్ణుడు. . కానీ, ఇప్పుడు తల్లి దండ్రులనుండి దూరం చెయ్యబడి అక్కడ ఔష్విజ్ శ్మశానవాటికలో ఒక్కడూ, ఒంటరిగా నిలబడి, […]
-
ఆవేదన … ఆస్కార్ వైల్డ్
. విశాలమైన బంగారపు పాతరలు సంపాదించి తుఫానుల వలన భయం గాని అడవిలో చెట్లు కూలుతున్న చింతగానీ లేని ఎవరికైనా జీవితం సాఫీగా సాగితే సాగనీ . ఆకలితో అలమటించిన రోజుల వేదనగాని బాధలూ కన్నీళ్లతో తలపండిన తండ్రిగాని ఏకాంతంలో దుఃఖాశృవులు రాల్చే తల్లిగాని ఎరుగక ఎవరికైనా జీవితం సాఫీగా సాగితే సాగనీ. . కానీ, అలయించే కష్టాల,పోరాటాల బాటలో కాళ్ళరిగినా, ఎంత జీవనవిషాదంలోనైనా దేవునికి చేరువగా నిచ్చెనలు వేసేవారికి మాత్రం జీవితం సాఫీగా సాగిపోవాలి . ఆస్కార్ […]