అనువాదలహరి

నాకు శాంతి లభించలేదు … Sir Thomas Wyatt

[చిత్రంగా ఈ కవిత ప్రేమ కవిత్వమైనా, ఇది జీవుడి ఆత్మవేదనకి కూడ సరిగా సరిపోతుంది. మన జీవితం లో ఎన్నో సందర్భాలలో మనం అచ్చం ఇలాగే ఫీల్ అవుతాం.  మనకి ఇష్టమైన వస్తువులూ, వ్యక్తులే ఒక్కోసారి మన కష్టాలకీ/ మనోవ్యధకీ కారణం కావడం విధి చిత్రంలా అగుపించక మానదు.]

.

నాకు శాంతిలభించలేదు… నా పోరాటాలు సమసిపోయాయి

భయంతోనే ఆశా ఉంది;జ్వలిస్తూనే మంచులా  ఘనీభవిస్తున్నా

ఎంతో ఎత్తులకిఎగురుతున్నా, నా అంత నేను లేవలేకపోతున్నా

నా దగ్గర ఏమీ లేదు, ప్రపంచాన్ని జయించినా;

దాచవలసినదీలేదు, పోగొట్టుకునేదీ లేదు; జైలులో నిర్బంధించి

నన్నేదీ ఆపలేదు, అయినా నేను పారిపోలేను;

నా ఇష్టప్రకారం నన్ను బ్రతకనీదు, చావనీయదు…

కాని,  చావడానికి తగిన కారణం కల్పిస్తుంది

కళ్ళు మూసుకుని చూడగలను, మాటాడకుండా  మాటాడగలను

చచ్చిపోదామని అనిపిస్తుంది, కానీ బతకాలనీ కొరుకుంటాను

నేనింకొకరిని ప్రేమిస్తూ, నన్ను నేను ద్వేషించుకుంటున్నా

విషాదంతో బ్రతుకుతున్నాను, అంత బాధలోనూ నవ్వగలను

ఆశ్చర్యం! చావూ బ్రతుకూ రెండూ బాధిస్తున్నాయి

దీనికంతటికీ కారణం…  నాకు ఆనందం కల్గించే వ్యక్తే.

.

Image Courtesy: http://t0.gstatic.com

సర్ థామస్ వైయట్

(1502 – 1542)

ఆంగ్ల కవీ, హెన్రీ VIII మహారాజు దర్బారు  ప్రముఖుడూ, రాయబారి.

.

I Find No Peace.

I find no peace, and all my war is done ;

I fear and hope, I burn, and freeze like
ice ;

I fly aloft, yet can I not arise ;


And nought I have, and all the world I seize on,


That locks nor loseth, holdeth me in prison,


And holds me not, yet can I scape no wise :

Nor lets me live, nor die, at my devise,

And yet of death it giveth me occasion.

Without eye I see ; without tongue I plain :

I wish to perish, yet I ask for health ;

I love another, and thus I hate myself ;


I feed me in sorrow, and laugh in all my pain.


Lo, thus displeaseth me both death and life,


And my delight is causer of this strife.

.

Sir Thomas Wyatt

(1503 – 1542)

English Poet and Courtier and Ambassador of  King Henry VIII

You can find the greatest tribute paid to him by his contemporary Henry Howard, Earl of Surry, the man credited with the epithet Father of Sonnet, along with Sir Thomas Wyatt, for introducing Sonnet to English:

A hand, that taught what might be said in rhyme;

That reft Chaucer the glory of his wit,.

A mark, (unperfected for time)

Some may approach, but none shall never hit.

(A hand that had written everything that could be written in rhyme; who took away the ‘glory of wit’ from Chaucer who was enjoying it till then; and a mark of intelligence that could never be perfected in time and nobody could ever touch it but few may come close to it)

(Text Courtesy: http://www.luminarium.org/renlit/ifindno.htm)

%d bloggers like this: