అనువాదలహరి

మరణదూతలు… సిజార్ వలేహో … పెరూవియన్ కవి

చే గెవాడా ని 1967లో  CBI బొలీవియాలోని ఒక మారుమూల పల్లెలో కాల్చి చంపిన తర్వాత, అతని దగ్గర దొరికిన వస్తువుల్లో, అంచులు బాగా నలిగిన నోట్సుపుస్తకం దొరికింది. అందులో పావ్లో నెరూడా (చిలీ), నికొలాస్ గిగేన్ (క్యూబా), సిజార్ వలేహో (Peru),  లేయాన్ ఫెలీపె(స్పెయిన్)ల 69 కవితలు ‘చే’ స్వదస్తూరీతో వ్రాసినవి ఉన్నాయి. అందులోనిది ఈ కవిత. తక్కిన వివరాలకు: http://www.guardian.co.uk/world/2007/sep/09/books.booksnews చూడండి)

ఈ కవితలో అనుకోకుండా ఎదురైన ఒక భయంకర సంఘటనని, ప్రాణాంతకమయిన సందర్భాన్ని తెలుపుతున్నాడు. ఆ సందర్భం ఎంత అమాయకంగా, తెలియకుండా ఎదురవుతుందంటే, మనం దానికి తయారీగా ఉండలేము. ఒక్కో సారి మనం చేసిన పనులకి విచారణ జరపకుండా, సంజాయిషీ చెప్పుకునే అవకాశం లేకుండా కేవలం నేరారోపణా, శిక్షా వెంటవెంటనే అమలుజరపబడిపోతుంది. యుధ్ధంలోనూ, గెరిల్లా పోరాటాలు చేసేవారికి ఈ సందర్భం మృత్యువుతో Tryst లాంటిది. కవి ఆ  సంఘటనని చెబుతున్నాడు.

.

అంత బలమైన దెబ్బలు జీవితంలో తగులుతాయా…

ఏమో! నాకు తెలియదు

అవి ఎలాంటి వంటే, దేముని ఆగ్రహం వల్ల కలిగేటటువంటివి

అవి ఎదుర్కుంటున్నప్పుడు, జీవితంలో అనుభవించిన వేదనంతా

ఒక్కసారి పెల్లుబుకుతుంది…

ఏమో! నేను సరిగా చెప్పలేను.

.

అలాంటి సందర్భాలు అరుదుగా ఉండొచ్చు…  కాని

ఎంత భీకరాకారుడికైనా, ధైర్యవంతుడికైనా, వెన్నులో వణుకుపుట్టిస్తాయి…

అవి ‘ఆతిల‘ వంటి ఆటవికుడి కాలాశ్వాలు కావచ్చు…

లేదా, మృత్యువు పంపిన మరణదూతలు కావచ్చు.

.

అవి క్రీస్తువంటి పవిత్రాత్మల పతనాలు

విధి దూషించిన ఒక ఆరాధించవలసిన నమ్మకం

రక్తాలోడుతున్న ఆ ప్రహారాలు

పొయ్యిమీద వ్రేలుతున్న రొట్టెల చప్పుళ్ళు

.

పాపం! ఆ వెర్రిబాగుల మనిషి కళ్ళుతిప్పి అటుచూస్తాడు,

భుజంమీద చరిచి ఎవరో మనల్ని పిలిచినట్టు;

అమాయకంగా అటుచూడగానే, ఆ చూపులో, ఒక్కసారి

జీవితమంతా అపరాధంలా పెల్లుబుకుతుంది.

.

అంత బలమైన దెబ్బలు జీవితంలో తగులుతాయా…

ఏమో! నాకు తెలియదు

.

[ఆతిల: ‘ఆతిల ది హూణ్‘(? … 453) అనబడే హూణ రాజు, పరమ భయంకరుడు, రోమను సామ్రాజ్యానికి పక్కలో బల్లెంలా నిలిచిన వాడు.]

.

Image Courtesy: http://www.poetryfoundation.org

సిజార్ వలేహో

(మార్చి 16, 1892 – ఏప్రిల్ 15, 1938)

పెరూవియన్ కవి సిజార్ వెలేహో, 11 మంది సంతానం లో ఆఖరివాడు. పెరూ లోని ఒక మారుమూల కుగ్రామంలో పుట్టిన అతను సాహిత్యం లో 1915 లొ స్నాతకోత్తర విద్య పూర్తిచేశాడు. మధ్యలో ఎన్నో సార్లు చదువుకి ఆటంకం కలిగింది. అతను మొదటిసారి చెరుకుతోటల్లో పనిచేస్తున్నప్పుడు వ్యవసాయ కూలీల శ్రమదోపిడీ ప్రత్యక్షంగా గమనించేడు. అతను Los Heraldos Negros(1915); Trilce (1923), Poemas humanos (1939) లో  ప్రచురించేడు. అతను మూడే కవితా సంకలనాలు ప్రచురించినా, 20వశతాబ్దపు అత్యంత ప్రతిభావంతమైన కవులలో ఒకడిగా గుర్తింపుపొందాడు. అవి సమకాలీన కవులకంటే అతనెంత ముందుచూపుగలవాడో చెప్పడమే కాకుండా,  సాహిత్య విప్లవాలకు ఒక అడుగు ముందుండి, ప్రతి పుస్తకమూ దేనికది భిన్నంగా విప్లవాత్మకంగా ఉంటాయి.

ప్రస్తుతం తీసుకున్న కవిత Los Heraldos Negros లోనిది. ఇందులో కవితలు అస్తిత్వ వేదననీ, వ్యక్తిగత అపరాధాల్నీ, బాధనీ, ఎత్తిచూపిస్తే, Trilce సర్రియలిస్టిక్ కవిత్వానికి ప్రేరకమని అనవచ్చు. అందులో ఇప్పుడు అధివాస్తవిక ధోరణిగా పిలవబడే …. భాషలో మౌలిక మైన మార్పులు, కొత్త పదాలను సృష్టించడం, వాక్యనిర్మాణాన్ని సాగదీయడం, యధేచ్ఛగా వ్రాయడం వంటి … కొత్త ప్రయోగాలు చేసేడు. అతని మరణానంతరం ప్రచురితమైన Poemas humanos,  వామపక్షభావాల రాజకీయ, సామాజిక కవిత్వం

.

(When CIA captured and shot dead Che Guevara in 1967 in a remote Bolivian village, they found among his possessions a dog-eared notebook containing 69 poems … of Pablo Neruda (Chile), Nicolás Guillén (Cuba), César Vallejo (Peru) and León Felipe (Spain)… and these poems were written in his own hand. This is one of those poems.  For further details read: http://www.guardian.co.uk/world/2007/sep/09/books.booksnews )

The Black Heralds

There are blows in life, so powerful . . . I don’t know!
Blows as from the hatred of God; as if, facing them,
the undertow of everything suffered
welled up in the soul . . . I don’t know!

They are few; but they are . . . They open dark trenches
in the fiercest face and in the strongest back.
Perhaps they are the colts of barbaric Attilas;
or the black heralds sent to us by Death.

They are the deep falls of the Christs of the soul,
of some adored faith blasphemed by Destiny.
Those bloodstained blows are the crackling of
bread burning up at the oven door.

And man . . . Poor . . . poor! He turns his eyes, as
when a slap on the shoulder summons us;
turns his crazed eyes, and everything lived
wells up, like a pool of guilt, in his look.

There are blows in life, so powerful . . . I don’t know!

[Another Version: The Black Messengers

There are in life such hard blows . . . I don’t know!
Blows seemingly from God’s wrath; as if before them
the undertow of all our sufferings
is embedded in our souls . . . I don’t know!

There are few; but are . . . opening dark furrows
in the fiercest of faces and the strongest of loins,
They are perhaps the colts of barbaric Attilas
or the dark heralds Death sends us.

They are the deep falls of the Christ of the soul,
of some adorable one that Destiny Blasphemes.
Those bloody blows are the crepitation
of some bread getting burned on us by the oven’s door

And the man . . . poor . . . poor!
He turns his eyes around, like
when patting calls us upon our shoulder;
he turns his crazed maddened eyes,
and all of life’s experiences become stagnant,
like a puddle of guilt, in a daze.

There are such hard blows in life. I don’t know ]

.

César Vallejo,

(March 16, 1892 – April 15, 1938)

Peruvian Poet

Born as the youngest of 11 children in a remote village in Peru, Vellejo completed post graduation in literature in 1915.  He had to drop out from the university to work in sugarcane plantations and he had the firsthand experience of exploitation of agricultural labour there. Though he published only 3 volumes of poetry in his life time, each of his books was different from the other and revolutionary in its own right. He was recognised as one of the brilliant 20th century minds in the field of poetry. He was always ahead of his times and the literary movements. While Los Heraldos Negros(1915), from which the current poem was taken, reflects “existential angst and personal guilt”,  Trilce (1923) is an avant-garde of surrealistic poetry with his experiments with language, syntax and coining of words and the introduction of technique of “writing as-it-is” (in the stream of consciousness) and Poemas Humanos (1939) was a posthumous publication reflecting his leftist ideas.

(Part of the text is abstracted from Biography Base),

%d bloggers like this: