అనువాదలహరి

An Exposition of Peace … Kavi Yakoob

The peace we long for
swings between
The point of a bayonet and the heart beat

Like a dying man’s last breath
The peace we long for
Lies on the bed.

The peace we long for is a temple, a masjid,
an explosion, a cease-fire, an ending, a continuance
An injured song, a thunder of lightning
dropped, snapped from heavens.
It’s like the foot of a banned poem
Buried in the gullet.

Amidst the sonorous expositions of peace
By the bearded Mullahs and Sadhus
The peace we long for gasps for breath.
.
The peace we long for
is lame like the gait
of a dog that broke his leg.
.
Pity!
We have to get on
With whatever amount of peace
The state rations us
Collecting it in our bags.

.

(From “eDategani prayANam”.)

Kavi Yakoob

Dr. Kavi Yakoob is working as Associate Professor at Anwarul – Uloom Degree College, University of Hyderabad, Hyderabad, Andhra Pradesh. He runs a blog: http://kaviyakoob.blogspot.in/

Apart from  eDategani prayAnam(2009) from which the present poem is taken, he has two more publications of poetry to his credit: PravahimcE jnApakam (1992) and Sarihaddu rEkha (2002).

.

శాంతి ప్రవచనం

.

మనం కోరుకునే శాంతి
గుండెచప్పుడుకూ, తుపాకీ మొనకూ మధ్య ఊగిసలాడుతుంది.

మనం కోరుకునేశాంతి
మరణించే మనిషి చివరిశ్వాసలాగా మంచం మీద ఉంది.

మనం కోరుకునే శాంతి ఒక మందిరం, ఒక మసీదు
ఒక ప్రేలుడు, ఒక కాల్పుల విరమణ, ముగింపు, కొనసాగింపు
గాయపడిన పాట, రాలిపడిన విద్యుత్ నినాదంలా ఉంది.
నిషేధింపబడి గొంతులోనే సమాధి అయ్యే కవితాపాదంలా ఉంది.

గడ్డాలు పెంచిన ముల్లాల, సాధువుల
శాంతిప్రవచనరాగాల మధ్య
మన శాంతి ఉక్కిరిబిక్కిరిగా ఉంది.

మన శాంతి
కాలువిరిగిన కుక్కపిల్ల నడకలా
కుంటికుంటిగా ఉంది.

రేషన్ లో శాంతిని ఈ రాజ్యం ఎంతకేటాయిస్తే
అంతే సంచిలో తెచ్చుకోవాలి.
అంతటితోనే సరిపుచ్చుకుని గడపాలి.
ప్చ్…
.
యాకూబ్
(ఎడతెగని ప్రయాణం నుండి)

కవి యాకూబ్ గారు ఈ కవిత తీసుకున్న ఎడతెగనిప్రయాణం(2009) కాకుండా, ప్రవహించే జ్ఞాపకం (1992) సరిహద్దు రేఖ (2002) అన్న రెండు కవితాసంకలనాలు వెలువరించారు.

%d bloggers like this: