అనువాదలహరి

కొరునా(స్పెయిన్) లో సర్ జాన్ మూర్ సమాధి … ఛార్ల్స్ వుల్ఫ్, ఐరిష్ కవి

Image Courtesy: http://1.bp.blogspot.com

[ఆంగ్ల సాహిత్యంలో గొప్పస్మృతిగీతాలలో(elegies) ఒకటిగా పేరుపడ్డ ఈ గీతం గమనించండి. కొందరు జీవించడం లోనే కాదు మరణం లో కూడా చాలా హుందాగా ఉంటారు. యుధ్ధరంగంలో శత్రువులకు చిక్కకుండ తమనాయకుడి దేహాన్ని సమాధి చెయ్యవలసివచ్చినపుడు, శత్రువులకు తమ ఉనికి తెలియకుండా ఈ పని రాత్రిపూట నిర్వర్తించవలసి వచ్చినపుడు, ఒక సైనికుడిగా, తమనాయకుడికి లాంఛనప్రాయమైన తుది వీడ్కోలు ఇవ్వలేకపోయామన్న బాధను ప్రకటించే ఈ గీతం కళ్ళు చెమరిస్తుంది. సర్ జాన్ మూర్ నెపోలియన్ బోనాపార్ట్ సైన్యాన్ని ఎదుర్కొని, స్పెయిన్ లో కొరునా అన్నచోట Marshal Soult సేనలపై విజయం సాధించినా,  అతను ఫిరంగి గుండు దెబ్బకి మరణిస్తాడు. అతని స్మృతిలో  ఛార్ల్స్ వుల్ఫ్ రాసిన గీతమిది.]

.

అతని పార్థివ శరీరం ప్రహారీకి దగ్గరగా మోసుకొస్తున్నప్పుడు
ఒక్క నగారా మోగలేదు, ఒక శోకగీతం ఆలపించలేదు,
మా నాయకుడిని సమాధిలోకి దించుతున్నప్పుడు
ఏ ఒక్క సైనికుడూ తన తుదివీడ్కోలు వందనం నినదించలేదు.

తుపాకి బాయ్ నెట్ లతో మట్టిని పెల్లగిస్తూ,
మసక మసకగా వెన్నెల పడుతుంటే,
లాంతరు సన సన్నగా వెలుగుతుంటే
అర్థరాత్రపుడు చీకటిలోనే సమాధిచేశాం

ఏ పనికిమాలిన శవపేటికా అతని గుండెల్ని మూయలేదు,
ఏ వస్త్రంగాని, ముసుగుగాని అతన్ని కప్పలేదు,
తనొక యుధ్ధవీరుడు విశ్రమిస్తున్నరీతిగానే
తన సైనిక దుస్తులలోనే నిద్రిస్తున్నాడు.

మేం తక్కువ ప్రార్థనలతో, అవీ క్లుప్తంగా, ముగించేం.
ఎవరిమూ ఒక విషాదశబ్దమూ పలకలేదు
అతని ముఖాన్ని అలాగే నిశితంగా పరీక్షిస్తూ,
మరుచటిరోజుగురించి తీవ్రంగా ఆలోచించాం.

సన్నని అతని సమాధి తవ్వుతున్నప్పుడు,
అతని తలక్రింది నేల చదునుచేస్తున్నప్పుడు అనుకున్నాం,
శత్రువులూ ఇతరులూ అతని సమాధిమీద నడవాలి,
మేము మాత్రం వాళ్ళకి దూరంగా … ఎక్కడో … అలలమీద ఉండాలి.

పోయినవాడి గురించి వాళ్ళు తేలికగా మాటాడొచ్చు,
అతని సమాధిమీదే కూర్చుని దూషించనూ వచ్చు.
అయినా అతనికేం ఖాతరు? ఈ బ్రిటను తవ్విన సమాధిలో
అతన్ని పరుండనిస్తే, అంతే చాలు!

.మా పని ఇంకా సగం కూడా పూర్తికాలేదు
అప్పుడే గంట మోగింది మేం వెనక్కి తిరిగి వెళ్ళడానికి.
దూరాన్నుండి ఉండీ ఉడిగీ తుపాకీ చప్పుడు వినిపిస్తోంది
శత్రువు అప్పుడే మూర్ఖంగా కాల్పులు ప్రారంభిస్తున్నాడు.

రక్తసిక్తమూ, అప్పుడేసంపాదించుకున్న అతనికీర్తికి నెలవైన
యుధ్ధభూమినుండి తీసుకువచ్చి, విచారంతో, నెమ్మదిగా సమాధిలోకి దించాం;
అతని గురించి ఒక ముక్క రాయలేదు, ఒక శిలాఫలకం నిలబెట్టలేదు,
అతన్ని ఒంటరిగా, అతని యశస్సుకి విడిచిపెట్టి వచ్చేశాం.

.

ఛార్ల్స్ వుల్ఫ్,

ఐరిష్ కవి

.

The Burial of Sir John Moore at Corunna

 
Not a drum was heard, nor a funeral note,

As his corse to the rampart we hurried;

Not a soldier discharged his farewell shot

O’er the grave where our hero we buried.

.

We buried him darkly at dead of night,

The sods with our bayonets turning;

By the struggling moonbeam’s misty light

And the lanthorn dimly burning.

.

No useless coffin enclosed his breast,

Nor in sheet nor in shroud we wound him;

But he lay like a warrior taking his rest

With his martial cloak around him.

.

Few and short were the prayers we said,

And we spoke not a word of sorrow;

But we steadfastly gazed on the face that was dead,

And we bitterly thought of the morrow.

.

We thought, as we hollowed his narrow bed

And smoothed down his lonely pillow,

That the foe and the stranger would tread o’er his head,

And we far away on the billow!

.

Lightly they’ll talk of the spirit that’s gone

And o’er his cold ashes upbraid him,–

But little he’ll reck, if they let him sleep on

In the grave where a Briton has laid him.

.

But half of our heavy task was done

When the clock struck the hour for retiring:

And we heard the distant and random gun

That the foe was sullenly firing.

.

Slowly and sadly we laid him down,

From the field of his fame fresh and gory;

We carved not a line, and we raised not a stone,

But left him alone with his glory.


.

Charles Wolfe

(Dec. 14, 1791 – Feb. 21, 1823)

Irish poet and clergyman.  The present poem commemorating the commander of the British forces at the Battle of Corunna (La Coruqa, Spain) during the Peninsular War (aka Spanish War of Independence), is one of the best-known funeral elegies in English.

Legend:

January 16, 1809: Sir John Moore, given command to support the rumoured Spanish uprising and relieve Madrid, took off with a small British army through Portugal and into Spain. The information turned out to be false. Pursued by Bonaparte himself with a massive army to prevent Moore from gaining his ships,  Moore had to retreat to Corunna and the ensuing sanguine battle strewed the snow covered roads with bodies of 6.000 British troops and as many horses. Though he could save Spain from full occupation and conquest by the French, he partially lost control of his army and scenes of drunkenness ensued. At Corunna harbour, he defeated the French pursuit led by Marshal Soult but was killed at the moment of victory.  He was hit by a cannon ball in the chest which nearly severed his left arm. He was carried from the battlefield in a blanket. Not long before he sustained that wound, he had reprimanded a soldier similarly stricken, saying “Come, we must bear these things better”, and indeed he followed his own precept. Moore’s dying was long and painful but he endured it all with great courage. Moore also fought in the American war of independence and in 1798 he was in Ireland fighting against the united Irishmen in Wexford. He refused to take part in the atrocities perpetrated against the Irish after the rebellion was put down. In this way Moore stood out from most other British commanders. A small memorial garden in the old city ramparts now has a stone over Moore’s grave, with a black marble bust of the hero atop it

(Text Courtesy: http://wonderingminstrels.blogspot.in/1999/06/burial-of-sir-john-moore-at-corunna.html)

%d bloggers like this: