యుధ్ధాన్ని మొదట ఎవడు కనిపెట్టేడోగాని వాడు పరమ పాపిష్టివాడు…క్రిష్టఫర్ మార్లో.
[ఒక పిరికిపంద అయిన రాజు చేత ఈ మాటలు మాట్లాడించినా, ఇందులో సత్యం ఉంది. పాతరోజుల్లో రాజ్యాలకోసమే యుధ్ధాలూ అల్లకల్లోలాలూ జరిగితే, ఇప్పుడు ముఖ్యమంత్రిపదవినిలబెట్టుకుందికీ (లేదా పట్టుకుందికీ) ఒక పక్క, ప్రపంచస్థాయిలో భౌగోళికంగా, ఆర్థికంగా, తమ సామ్రాజ్యధిపత్యం, నిలబెట్టుకుందికి వేరొకపక్కా నిత్యమూ యుధ్ధాలూ, అల్లకల్లోలాలు జరుగుతున్నై. మధ్యలో ఎంతమంది అమాయకులు బలయిపోతున్నారో వాళ్ళకి తెలీదు. బుష్ జూనియర్ లాంటి వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే వీళ్ళందరూ Collateral Damages. అంటే తప్పించుకోలేని నష్టం ట. మూర్ఖులచేతిలో రాజ్యాధిపత్యం ఉంటే ఎలా ఉంటుందో మార్లో సూచించకనే సూచించాడు. ]
Accurs’d be he that first invented war!
In what a lamentable case where I,
“యుధ్ధాన్ని మొదట ఎవడు కనిపెట్టేడోగాని వాడు పరమ పాపిష్టివాడు…క్రిష్టఫర్ మార్లో.” కి 3 స్పందనలు
-
మీ ఈ post చదువుతుంటే మెహెర్ బాబా వారు అన్న మాట జ్ఞాపకం వస్తున్నది.
కత్తులు పోయినాయి తుపాకులు వచ్చాయి
శత్రువులు పోయారు కాని శత్రుత్వం ఇంకా అలానే ఉంది..
పోవలసినది శత్రుత్వం
యుద్ధం చేయవలసినది శత్రుత్వం మీద కాని శత్రువుల మీద కాదు. అని
some thing Related to this kind of statements
any way thanks for the post🙂
sir,
when can we expect Aristotle and other Greek philosophical theories in your valuable translations
మీ ఈ post చదువుతుంటే మెహెర్ బాబా వారు అన్న మాట జ్ఞాపకం వస్తున్నది.
కత్తులు పోయినాయి తుపాకులు వచ్చాయి
శత్రువులు పోయారు కాని శత్రుత్వం ఇంకా అలానే ఉంది..
పోవలసినది శత్రుత్వం
యుద్ధం చేయవలసినది శత్రుత్వం మీద కాని శత్రువుల మీద కాదు. అని
some thing Related to this kind of statements
any way thanks for the postనేను కూడా మీ మా అనువాద లహరి కి fan ని అండీ,
మా కోరిక మీకు తీర్చ గలిగేటంత అందుబాటులో ఉంటె మా wish నేరవేరుస్తారని ఆశిస్తూ ,,,,,🙂
Shiva
?!మెచ్చుకోండిమెచ్చుకోండి
-
శివగారూ,
ఎంతమాట అన్నారు. అరిస్టాటిల్ వంటి మేధావుల తాత్త్విక చింతన అనువాదం కవిత్వం లాంటిది కాదుగదా. కవిత్వానువాదాల్లో పదాలు ఒకటి రెండు తప్పుదొర్లినా పర్వాలేదు. కాని, తాత్త్విక విషయాల్లో precision చాలా అవసరం అవుతుంది. మాటలమీద ఇంకా పట్టురావడం లేదు. అయితే పూర్వ పశ్చిమ తాత్త్విక చింతనల గురించి వ్రాసే లక్ష్యం అయితే మాత్రం ఉంది. అది ఈ బ్లాగుద్వారానా, లేక వేరే బ్లాగు ప్రారంభిద్దామా అన్న ఆలోచన లేకపోలేదు. మీ మాటలు ఆ దిశలో కొంత ప్రోత్సాహాన్నిస్తున్నాయన్నమాట మాత్రం వాస్తవం. అందుకు ధన్యవాదాలు.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
sir మీ reply కి సహశ్రదా కృతజ్ఞుడను,
క్షమించాలి
మన అనుకుంటే చాలు ఏమాత్రం వెనక్కు చూడక
చొరవ తీసుకోవటం నా చిన్నప్పటి నుంచీ అలవాటు
అదే చనువు తో అడుగుతున్నాను
మీరు మొదట ప్రారభించండి
కొత్త బ్లాగులో మీరన్నట్లు తరువాత post చెయ్యొచ్చు సరిగ్గా వచ్చినవి.
ఇప్పుడు ఉన్నంతలో భాగం గా
ఇప్పుడు మీదైన కవితా పరమైనది ఏదో ఒకటి అందిస్తున్నారు కదా!
వాటితో పాటే philosophical వి కూడాను,
రవి కాంచని చొ కవి కాంచును
ఇది పాత మాట మరే నేటి మాటో?!
కవి కాన్చనిది దార్శనికుడు దర్శించును
ఆ తత్వ వేత్తలే అమృతస్య పుత్రులు.
మీకు సరస్వతి అనుగ్రహం తో పాటు సహనం సౌశీల్యం ఉన్నాయి
అవి సత్ ప్రయోజనం పొందాలి అంటే
మిథ్య జగత్తుకు ఊహలకు ప్రతి రూపాలైన
కవితలే ఇంత ఆనందం ఇస్తుంటే
సామాన్యత్వాన్ని ప్రాకృతిక సహజత్వాన్ని
nature laws ని క్షున్నం గా పరిశీలించిన
మహనీయులు ఆ మహత్తు పొందిన వారి
దార్శనికులై తాము తపములో దర్శించిన వాటిని
నోటి పల్కుల రూపంలో
దయాద్ర హృదయులై ఎంతో జ్ఞాన నిధిని అందించి వెళ్లారు
అది పర భాషలో ఉండుట చేత
అమిత జిజ్ఞాసువులే పొందుతున్నారు తప్ప అవి
నా లాంటి సామాన్యులకి అందుబాటులోకి రావటం లేదు
మీకు తెలుసా ఇప్పటి దాకా మీ అనువాదాలలో
రవీంద్రనాథ్ టాగూర్ గురించి తప్ప తక్కిన వారు ఎవరి గురించి
వారి పేరు కాదు కదా! వారి ఉనికి గురించి కూడా తెలియదు.
కాని సోక్రటీస్ అరిష్టాటిల్ ఇలాంటి మహనీయుల మాటలు కొన్ని
అప్పుడప్పుడు
పత్రికల లో పడుతుంటే చూసి ఆశ్చర్య పోతుంటాం
అంటే మొన్న ఈమధ్యన బాగా ప్రాచుర్యం పొందిన
బ్రూస్లీ కుడా !
ఈ అభిలాష కలిగి ఉన్నవాడే నంట!
so మీకు ఏమాత్రం అవకాశం చిక్కినా మా అభ్యర్ధన కాదనరని భావిస్తూ !
రావణా బ్రహ్మ నాకు ఒక విషయం లో ఆదర్శం
“మంచి పని వెంటనే చేయాలి, లేకుంటే నా గతే పడుతుందనే”
సందేశాన్ని జాతికి ఇచ్చి మరీ వెళ్ళాడు.
ఎవరో అన్నారు యుద్ధం (ఆట) లో గెలిచన వాడినుంచి ఎంత నేర్చుకోవచ్చో
ఓడిన వాడి నుండీ అంతే నేర్చు కోవచ్చంత (ఇది westren వాళ్ళే అన్నట్లు గుర్తు)మీరు ప్రయత్నించండి sir
వాళ్ళు ఏ లక్ష్యం తో చెప్పారో ఏమి చెప్పారో ఎవరికీ (ఏ స్థాయి లో వారికి)చెప్పారో
ఈ మూడు గమనిస్తే చాలు
ఇక పదాలు అవే పడతాయి
నా మాట నమ్మక్కర్లేదు
ఒకటి రెండు post లు వేసి చూశాక మీకే అర్థం అవుతుంది.
పోనీ అంతగా
సాహసం చేయలేక పోతుంటే వారి చరిత్ర ఎటు తిరిగి wiki లో ఉంటుంది కదా!
అదే మాకు తెలుగు లో మీదైన శైలిలో చెప్పండి.
చిన్న చిన్న సూక్తులు నుంచి మొదలు పెడితే నెమ్మదిగా !
పెద్ద స్థాయి philosophy ని
ఆశ్వాసన చేయ వచ్చును.
నా comment వాళ్ళ మీరు ఏమైనా తలనొప్పికి గురయ్యే అవకాశం ఉందేమో అని ముందుగానే sorry చెప్పాను.
we want Demand Best philosophical post sమెచ్చుకోండిమెచ్చుకోండి
-
స్పందించండి