అనువాదలహరి

నిర్మల నిశీధి… వాల్ట్ వ్హిట్మన్

[ఈ కవితలో చమత్కారాన్ని గమనించండి. ఏదో శలవులువచ్చి ఉపాధ్యాయుడు ‘హమ్మయ్య ‘ అని ఊపిరిపీల్చుకుని ఏ వేసవి శలవులకో మనసును సిధ్ధపడమని కోరుతున్నట్లు ఒక ప్రక్క కనిపిస్తూనే, కవి రెండోప్రక్క, జీవితచరమాంకంలో మృత్యువుకి సిధ్ధపడమని మనసుని హెచ్చరిస్తున్నాడు.]

.

ఓ నా ప్రాణమా!

రోజు చెరిగిపోయింది.

పాఠం పూర్తయిపోయింది.

పుస్తకాలకి దూరంగా…

కళాభినివేశాలకి దూరంగా…

మాటలు లేని ప్రపంచంలోకి

ఇక స్వేచ్ఛగా ఎగిరిపోయే సమయమాసన్నమైంది…

ఇక నువ్వమితంగా ప్రేమించే విషయాలైన

రాత్రినీ, నిద్రనీ, నక్షత్రాలనీ

నిశ్శబ్దంగా

పరిశీలిస్తూ

ఆలోచిస్తూ

పై పైకి తేలిపో!

.

వాల్ట్ వ్హిట్మన్

.

A Clear Midnight

.

This is thy hour O Soul, thy free flight into the wordless,
Away from books, away from art, the day erased, the lesson done,
Thee fully forth emerging, silent, gazing, pondering the themes thou
lovest best.
Night, sleep, and the stars.

.

Walt Whitman

May 31, 1819 – March 26, 1892

An American Poet, Essayist, Journalist and Humanist.


%d bloggers like this: