అనువాదలహరి

గొల్లపదం … జాన్ బన్యన్

[జాన్ బన్యన్ ఒక అతిపేద కుటుంబం నుండి వచ్చి (అతని తండ్రి పాత్రలకు మాట్లు వేస్తూ బతికేవాడట. తనుకూడ అదేవృత్తికొంతకాలం కొనసాగించేడు). అతని  సవతితల్లి పోరు భరించలేక 16వ ఏట ఇల్లు వదలి వెళ్ళిపోయి అన్ని రకాల చెడు అలవాట్లకు బానిసై, తన జీవితాన్ని చేజేతులా పాడుచేసుకున్నా, తను పెళ్ళిచేసుకున్న ఒక అనాధ స్త్రీ తండ్రి ఆమెకు వారసత్వంగా ఇచ్చిన రెండే రెండు పుస్తకాలు Plain Man’s Pathway to Heaven by  Arthur Dent; Practice of Piety by Lewis Bayly… అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసాయి.  మనిషి  ఎంతచెడ్డవాడైనా, ఏ ఒక్క రోజైనా  తనని తాను ఆత్మపరీక్షచేసుకుని జీవితాన్ని సరిదిద్దుకుందామనుకుంటే, ఆరోజు నుండీ అతనికి తిరుగు ఉండదు అని జాన్ బన్యన్ తన జీవితం ద్వారా నిరూపించేడు. ప్రొటెస్టెంటుగా అతనికి ఉపన్యాసాలిచ్చే తగిన అనుమతి / అధికారం లేనందుకు జైలు శిక్షవిధించినా, అక్కడే ఖైదీలకి బోధిస్తూ గడపడమేగాక, బహుశ అతని “Pilgrim’s Progress” కావ్యానికి బీజం అక్కడే పడి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. ఆంగ్ల సాహిత్యంలో అద్భుతమైన పదవిన్యాసంతో వ్రాయబడిన కావ్యం అది. అవడానికి అది క్రైస్తవ మత గ్రంధమైనా, నమ్మకమున్న ఇతర మతాలకుకూడా వర్తిస్తుంది. అందులో  బన్యన్ జీవుడి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎన్ని అడ్డంకులు వస్తాయో, వాటిని నమ్మకం ద్వారా ఎట్లా ఎదుర్కోవచ్చునో చూపించే ప్రయత్నం చేసేడు.]

.

నేలమీదనుండేవాడికెన్నడూ పడిపోతాననిగానీ,
ఒదిగి ఉండేవాడికి గర్వం వల్లగానీ భయం ఉండదు.
వినయంగా ఉండేవాడికి భగవంతుడు
ఎప్పుడూతోడుగా ఉండి నడిపిస్తాడు

అది ఎక్కువా తక్కువా అన్న చింతలేకుండా,
నాకు ఉన్నదానితో సంతృప్తి ఉంది.
హే భగవాన్! నేను ఎల్లప్పుడూ సంతృప్తినే కోరుకుంటున్నాను,
ఎందుకంటే అలాంటి వాళ్ళని నువ్వెప్పుడూ రక్షిస్తావు గనుక

ఈ పల్లవికి పరిపూర్ణత
ఈ చింతనతో జీవనయాత్ర కొనసాగించినప్పుడే.
ఇహంలో కొంచెమనిపించినా, పరంలో పరమసుఖందొరుకుతుంది.
ఇది వయసుతో నిమిత్తం లేకుండా సర్వకాలాలకూ వర్తిస్తుంది.

.

(Pilgrim’s Progress కావ్యం నుండి)

జాన్ బన్యన్ 

.

[ఈ పద్యాన్ని బమ్మెర పోతనగారి భాగవతం అష్టమస్కందం వామనావతార ఘట్టంలోని ఈ పద్యపాదాలతో సరిపోల్చి చూడండి.
“సంతుష్టుడీ మూడుజగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము,
సంతోషిగాకుంట సంసారహేతువు, సంతసంబున ముక్తి సతియు దొరకు”]

.

The Shepherd Boy sings in the Valley of Humiliation.

.

He that is down needs fear no fall,
He that is low no pride;
He that is humble ever shall
Have God to be his guide. 

I am content with what I have,
Little be it or much;
And, Lord, contentment still I crave
Because Thou savest such.

Fulness to such a burden is
That go in pilgrimage;
Here little and hereafter bliss
Is best from age to age…

.

(From Pilgrim’s Progress)

John Bunyan

(28 November 1628 – 31 August 1688)

%d bloggers like this: