అనువాదలహరి

కిటికీ పక్క గొంతుకలు … సర్ ఫిలిప్ సిడ్నీ

(కవిత్వమన్నా, స్నేహానికిప్రాణంపెట్టడమన్నా, ఉత్తమమైనశీలాన్ని అలవరచుకోవడమన్నా, చనిపోతున్నపుడుకూడా మానవీయవిలువలకి జీవితాన్నిఅంకితంచేసి ఉదాత్తంగా వ్యవహరించడమన్నా,  సర్ ఫిలిప్ సిడ్నీ నుండి  ఈ కాలపు కవులు నేర్చుకోవగలిగినది చాలా ఉంది.

ఇంగ్లీషు కవీ, రాజసేవకుడూ, సైనికుడూ అయిన సర్ ఫిలిప్ సిడ్నీది ఉదాత్తమైన వ్యక్తిత్వం. అతని అపురూపమైన వ్యక్తిత్వానికి చిహ్నంగా ఒక కథ బహుళ ప్రచారం లో ఉంది. తన స్నేహితుడికోసం యుధ్ధానికి వెళ్ళిన సిడ్నీ, గాయపడి పడిపోయి, దాహ దాహం అంటుంటే, ఎవరో తాగడానికి నీళ్ళు తీసుకు వచ్చి అతనికి ఇస్తే, తనపక్కనే నీటికోసం అలమటిస్తున్న ఇంకొక సైనికుడిని చూసి “నా అవసరం కంటే నీ అవసరం ఎక్కువ (your necessity is more than mine)” అని చెప్పి అతనకి నీళ్ళందించి చనిపోయాడట.  అందుకే Edmund Spencer అతనిమీద అద్భుతమైన ఎలిజీ వ్రాసేడు. అంతేగాక తన “Shephard’s Calendar” అన్న కావ్యాన్ని అంకితమిచ్చాడు. సిడ్నీ రచనలలో The Defence of poesy (aka An apology to poetry), The Arcadia, Astrophel and Stella  చాలా ముఖ్యమైనవి. )

.

ఎవరది? ఇంత చీకటి రాత్రి
నా కిటికీ చెంత మొరపెట్టుకుంటున్నది?

ఎవడు నీ చూపులకు బహిష్కృతుడై,
మిగతా ఏ అల్పమైన వెలుగులనూ
చూడడానికీ ఇష్టపడడం లేదో వాడు.

ఓహ్! అతను నువ్వేనా?
ఏం, ఇంకా నీ తలపులలో మార్పు రాలేదా?

ఓ ప్రియతమా! నువ్వు నా నుండి దూరమైనా సరే,

నా తలపులలోనేగనక మార్పు వస్తే,
ఆ మార్పు నా వినాశన హేతువగుగాక!

కనుమరుగైతే ఇవన్నీ సమసిపోతాయి.
కనుక చూడ్డం మానెస్తే, స్మృతిలోంచి అదేపోతుంది.

నిజమే, కనుమరుగు మరుపు కలిగిస్తుంది.
ఎప్పుడు? నా మనసులో ఉన్నదానినుండి
నన్ను విడదీసుకోగలిగిన విద్య నాకు తెలిసినపుడు.

కాలమే ఈ ఆలోచనలన్నీ తుడిచేస్తుంది.
అదేం చెయ్యగలదో ఏ మనిషికీ అంతుచిక్కదు.

కాలం మనిషి ఏమిటో అదే ఋజువుచేస్తుంది.
కాలంతోపాటే మగపావురానికి
ఆడపావురం పై ప్రేమ ఇనుమడిస్తుంది

సరికొత్త అందాలు కంటబడితే?  
అవి నీ మదిలో కొత్త అలజడులు రేపవా?  

వాళ్ళు అప్సరలకు పోతపోసిన
ప్రతిరూపాలుగా ఊహించుకున్నా, నీకు
పేలవమైన అనుకరణలు మాత్రమే.

కానీ, నీ వివేకము ఇటువంటి ఆలోచనలు
కట్టిపెట్టమంటోంది అది పెంపొందడానికి.

ఓ ప్రియతమా!  వివేకాన్ని ద్వేషించకు!
నా వివేకవంతమైన చూపులకి
నీ అందానికి మించి ఏదీ కనిపించలేదు

.

సర్ ఫిలిప్ సిడ్నీ

.

Voices at the Window  

.

Who is it that, this dark night,
Underneath my window plaineth?

It is one who from thy sight
Being, ah, exiled, disdaineth
Every other vulgar light.

Why, alas, and are you he?  
Be not yet those fancies changeèd?

Dear, when you find change in me,
Though from me you be estrangèd,
Let my change to ruin be.

Well, in absence this will die:
Leave to see, and leave to wonder.

Absence sure will help,
if I Can learn how myself to sunder
From what in my heart doth lie.

But time will these thoughts remove;
Time doth work what no man knoweth.

Time doth as the subject prove:
With time still the affection groweth
In the faithful turtle-dove.

What if you new beauties see?
Will not they stir new affection?

I will think they pictures be
(Image-like, of saints’ perfection)
Poorly counterfeiting thee.

But your reason’s purest light
Bids you leave such minds to nourish.

Dear, do reason no such spite!
Never doth thy beauty flourish
More than in my reason’s sight.

[GLOSSARY:  leave = cease; plaineth: complains; ]


Sir Phillip Sidney

(30 November 1554 – 17 October 1586)

%d bloggers like this: