అనువాదలహరి

మౌన ప్రేమికుడు … సర్ వాల్టర్ రాలీ (1552–1618)

.

ఓ నా హృదయ రాణీ! 

నీ ప్రేమను అర్థించపోయినంత మాత్రంచేత

గాయపడలేదనుకుని అచ్చమైన ప్రేమలోని మౌనాన్ని

తప్పుగా అర్థంచేసుకోకు….

.

ప్రేమలో మౌనం, 

మాటలు చెప్పగలిగినదానికంటే ఎక్కువ బాధని వ్యక్తపరుస్తుంది.

నీకు తెలుసుకదా, ముష్టివాడు మూగవాడుకూడ అయితే

వాడిమీద మరింత జాలి చూపించాలని.

.

నా మనోహరీ! నా నిజమైన ప్రేమని, చెప్పలేకున్నా,

తప్పుగా అర్థం చేసుకోకు;

ఎవడు తనగాయాన్ని దాచుకుని, కనికరంకోసం ప్రాకులాడడో,

వాడే ఎక్కువ బాధ అనుభవిస్తాడు.

.

సర్ వాల్టర్ రాలీ

(1552–1618)

ఎలిజబెత్ మహారాణి ఈ హయాం లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి సర్ వాల్టర్ రాలీ. ఆమెకి ప్రీతిపాత్రుడుగా, యుధ్ధతంత్ర నిపుణుడిగా, నావికుడిగా, అన్వేషకుడిగా, గూఢచారిగా, కవిగా అనేక పాత్రలు నిర్వహించి ఆమెవల్ల అనేకలాభాలు పొందిన వ్యక్తి. Eldorado కల్పితపట్టణానికి కారణం అతని సాహసయాత్రలను అతిశయోక్తులతో కూర్చి చెప్పిన కథనమే. అతను బ్రిటిషు గయానా, వెనిజులా తూర్పు ప్రాంతాలను కూడ బంగారంకోసం అన్వేషించాడు. ఎలిజబెత్ మహారాణి మరణం తర్వాత  జేమ్స్ I  మహరాజుపై కుట్రపన్నేడన్న అభియోగంతో 1618 లో అతను శిరచ్ఛేదానికి గురి అయ్యాడు.

.

The Silent Lover

.

Wrong not, sweet empress of my heart,
The merit of true passion,
With thinking that he feels no smart,
That sues for no compassion.

Silence in love bewrays more woe
Than words, though ne’er so witty:
A beggar that is dumb, you know,
May challenge double pity.

Then wrong not, dearest to my heart,
My true, though secret passion;
He smarteth most that hides his smart,
And sues for no compassion.

.

Sir Walter Raleigh.

1552–1618

Sir Walter raleigh was an English aristocrat, writer, poet, soldier, courtier, spy, and  an explorer.

He rose rapidly in the favour of Queen Elizabeth I, and was knighted in 1585. He was involved in the early English colonisation of Virginia (which includes part of present day North Carolina) under a royal patent. In 1594 Raleigh heard of a “City of Gold” in South America and sailed to find it. He published an exaggerated account of his experiences and the legend of “El Dorado” was a consequence of that. He did the same with the voyages to Guiana and eastern venezeula. After the death Queen Elizabeth, he fell out of favour with King James I and was beheaded on the charges of conspiracy against the King.

%d bloggers like this: