Television … రోవాల్ డాల్

(ఈ కవిత టెలివిజను పిల్లలమీద ఎంత దుష్ప్రభావాలు చూపుతుందో వ్రాసింది. ఇది ప్రపంచ ఆంగ్లసాహిత్యంలో One Website ఎంపికచేసిన 500 ఉత్తమమైన కవితల్లో చాలా కాలం నుండి 15వస్థానంలోపునే ఉంది.)

.

పిల్లలకు సంబంధించినంతవరకు

మనం నేర్చుకున్న అతిముఖ్యమైన విషయం ఏమిటంటే

వాళ్ళని TV దరిదాపుల్లోకి ఎన్నడూ, ఎన్నడూ రానియ్యకూడదని…

అంతకంటే మంచిది…

వీలయితే ఇంట్లో ఆ బుధ్ధితక్కువ దాన్ని కొనిపెట్టకపోవడం.

సుమారు ప్రతి ఇంట్లో పిల్లలు నోరువెళ్ళబెట్టుకుని TV చూడ్డం గమనిస్తూనే ఉన్నాం.

వాళ్ళు అక్కడే కదలకుండ కూర్చుని,

అక్కడే తింటూ తాగుతూ ఒంటిమీద ఒంపేసుకుంటూ,

కనుగుడ్లు బయటకి వచ్చేసేదాకా చూసి అక్కడే పడుక్కుంటుంటారు;

(క్రిందటివారం  ఎవరింట్లోనో నేల మీద ఒక డజను కంటిగుడ్లు దొరికాయట)

వాళ్ళు దానికి వశం అయిపోయేదాకా,

అందులో వచ్చే దారుణమైన చెత్తంతా  వాళ్ళ బుర్రలో కెక్కేదాకా

చూస్తూ కూర్చుంటూ, కూర్చుంటూ చూస్తుంటారు.

 .

నిజమే! మీరు చెప్పేది ఒప్పుకుంటా:

అదివాళ్ళని కదలకుండా కూచోబెడుతుంది,

గోడలూ కిటికీలూ ఎక్కరు,

ఒకరినొకరు తన్నుకోడం కొట్టుకోడం చెయ్యరు,

మిమ్మల్ని వంటింట్లో ప్రశాంతంగా వండుకోనిస్తారు,

బట్టలుతుక్కోడం, గిన్నెలుకడుక్కోవడం చెయ్యనిస్తారు వగైరా వగైరా.

కాని,  అది మీ బంగారు కొండలపై చూపించే పరిణామాలపై ఆలోచించడానికి

ఎప్పుడైనా ఒక్క క్షణం ప్రయత్నించేరా?

వాళ్ళ మెదడు మొద్దుబారిపోతుంది,

వాళ్ళ ఊహాశక్తి మందగిస్తుంది,

వాళ్ల మెదళ్ళో చెత్తపోగై సందేహాలతో నింపుతుంది,

వాళ్ళని ఎంత మందమతులుగా, గుడ్డివాళ్లగా మారుస్తుందంటే,

వాళ్ళకి ఊహలలోని అనుభూతులూ, కాల్పనిక లోకాలూ అర్థం కావు.

వాళ్ళ మెదడు మట్టిముద్దలా తయారై,

వాళ్ళ ఆలోచనా శక్తి తుప్పుపట్టి ఎదుగుదల నిలిచిపోయి,

ఇకనుండి వాళ్ళు చూడడమే తప్ప ఆలోచించగల శక్తి కోల్పోతారు

.

“సరే!”, ” సరే!”, అని మీరు అసహనంగా అరవొచ్చు.

“అది తీసెస్తే మా చిన్నారులకి వినోదం కలిగించే దెలా? చెప్ప”మని  నిలదియ్య వచ్చు.

దానికి సమాధానం ఈ భూతాన్ని కనుక్కోక ముందు మీ చిన్నారులు

వాళ్ళని వాళ్ళు సంతృప్తిపరుచుకుందికి ఏం చేసేవారని?

గుర్తులేదా? మరిచిపోయారా? చెప్పనా?

సరే. అయితే నెమ్మదిగానైనా  గట్టిగా చెబుతా వినండి.

వాళ్ళు  చ …దు… వు …కు… నే… వా …ళ్ళు.

వాళ్ళు చదివి చదివి చదివి … మరిన్ని చదవడానికి ప్రయత్నించే వాళ్ళు.

వాళ్ళ దుంపదెగ! ఎంత చదివే వారంటే

వాళ్ళ జీవితంలో సగం చదువుతోనే గడిచిపోయేది!

పిల్లలపుస్తకాల సొరుగులనిండా రకరకాల పుస్తకాలుండేవి.

పిల్లల గదుల్లో పుస్తకాలు విచ్చలవిడిగా పడి ఉండేవి.

పడకగదిలో, పక్క మీద, చదవడానికి పుస్తకాలు ఎదురుచూస్తూండేవి.

ఏలాంటి పుస్తకాలు! చక్కని చిత్ర విచిత్ర కథలు,

ఆది శేషుడూ, కాళీయుడూ, దయ్యాలూ, భూతాలూ,

రాణులూ మహారాణులూ, తిమింగలాలూ,

అపురూప శక్తులకోసం, గుప్తనిధుల కోసం వేటలూ,

సప్తసముద్రాలు దాటడం, దొంగలతో, దోపిడీ దారులతో యుధ్ధాలూ,

లిల్లిపుట్ ప్రపంచాలూ, తుఫానుల్లో నౌకాయానాలూ, ఏనుగులమీద ప్రయాణాలూ,

నరభక్షకులు పొయ్యిచుట్టూ చేరి సలసల మరుగుతున్నది కలపడాలూ,

(ఇంత కమ్మని సుగంధం వస్తోంది. ఎక్కడనుండి చెప్మా? ఓహ్! అది పెనెలోప్!)

పిల్లలైతే బీట్రిక్స్ పోటర్ (Beatrix Potter) కథలు…

దుర్మార్గపు నక్క టాడ్*, పొగరుబోతు ఉడత నట్కిన్*,

అల్లరి పంది పిగ్లింగ్ బ్లాండ్*, ముళ్ళపంది టిగ్గీ వింకిల్* గురించీ,

ఒంటెకు దాని వీపుమీద మూపురం ఎలా వచ్చిందో,

కోతికి దాని పిర్రలు ఎలా అరిగిపోయాయో,

అహంకారి కప్ప గురించీ, పంచతంత్ర కథలూ,

చందమామలూ, బాలమిత్రలూ అబ్బ ఏం పుస్తకాలవి!

నిన్న మొన్నటిదాకా పిల్లలు చదువుతూ ఉండేవాళ్ళు.

.

కాబట్టి, దయచేసి, మిమ్మల్ని అర్ధిస్తున్నా,  వేడుకుంటున్నా,

వెళ్ళి ఆ TVని పారేయండి. దాని జాగాలో

గోడకి ఒక పుస్తకాల బీరువా ఒకటి తగిలించండి.

దాన్ని పుస్తకాలతో నింపండి.

మీ పిల్లల అలకచూపులూ, అరుపులూ, కేకలూ,

మిమ్మల్ని విసుగుతో కొరకడాలూ, తన్నడాలూ, కొట్టడాలూ పట్టించుకోకుండా.

భయం లేదు. నేను హామీ ఇస్తున్నా.

వారం రెండువారాలు  తిరక్కుండా  చెయ్యడానికి వేరే ఏమీలేక,

వాళ్ళమట్టుకు వాళ్ళకే చదవాలనిపిస్తుంది.

ఒక సారి వాళ్ళు చదవడం ప్రారంభిస్తే,

బాబోయ్, చెప్పడం నా తరం కాదు.  మీరే చూద్దురుగాని.

క్రమంగా వాళ్ళ మనసుల్లో పెరిగే  ఆనందం.

వాళ్ళకే ఆశ్చర్యం వేస్తుంది ఆ కంపుగొట్టు,

అసహ్యకరమైన రోతపుట్టించే టెలివిజన్ తెరమీద ఇన్నాళ్ళూ ఏమిచూసేమా అని.

అంతే కాదు,

మీరు చేసినపనికి, పిల్లలందరూ  మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు.

.

(Penelope: పెనెలోప్  ఒడిస్సస్ (రోమనుల ప్రకారం యులిస్సిస్) భార్య. ఆమె మన రామాయణం లోని సీతలా పాతివ్రత్యానికి ప్రతీక.

* ఈ జంతువులన్నీ, బీట్రిక్స్ పోటర్ వ్రాసిన పిల్ల కథలలోని పాత్రలు.  Beatrix Potter గత శతాబ్దం లో అత్యంత పేరుప్రఖ్యాతులు సంపాదించిన పిల్లల కథల రచయిత్రి, తనకథలకు తనే బొమ్మలు సమకూర్చిన చిత్రకారిణీ, ఇంకా ముఖ్యంగా Natural Scientist and a Conservationist.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Roald_Dahl

రోవాల్ డాల్

.

Television
.
The most important thing we’ve learned,
So far as children are concerned,
Is never, NEVER, NEVER let
Them near your television set —
Or better still, just don’t install
The idiotic thing at all.
In almost every house we’ve been,
We’ve watched them gaping at the screen.
They loll and slop and lounge about,
And stare until their eyes pop out.
(Last week in someone’s place we saw
A dozen eyeballs on the floor.)
They sit and stare and stare and sit
Until they’re hypnotised by it,
Until they’re absolutely drunk
With all that shocking ghastly junk.
Oh yes, we know it keeps them still,
They don’t climb out the window sill,
They never fight or kick or punch,
They leave you free to cook the lunch
And wash the dishes in the sink —
But did you ever stop to think,
To wonder just exactly what
This does to your beloved tot?
IT ROTS THE SENSE IN THE HEAD!
IT KILLS IMAGINATION DEAD!
IT CLOGS AND CLUTTERS UP THE MIND!
IT MAKES A CHILD SO DULL AND BLIND
HE CAN NO LONGER UNDERSTAND
A FANTASY, A FAIRYLAND!
HIS BRAIN BECOMES AS SOFT AS CHEESE!
HIS POWERS OF THINKING RUST AND FREEZE!
HE CANNOT THINK — HE ONLY SEES!
‘All right!’ you’ll cry. ‘All right!’ you’ll say,
‘But if we take the set away,
What shall we do to entertain
Our darling children? Please explain!’
We’ll answer this by asking you,
‘What used the darling ones to do?
‘How used they keep themselves contented
Before this monster was invented?’
Have you forgotten? Don’t you know?
We’ll say it very loud and slow:
THEY … USED … TO … READ! They’d READ and READ,
AND READ and READ, and then proceed
To READ some more. Great Scott! Gadzooks!
One half their lives was reading books!
The nursery shelves held books galore!
Books cluttered up the nursery floor!
And in the bedroom, by the bed,
More books were waiting to be read!
Such wondrous, fine, fantastic tales
Of dragons, gypsies, queens, and whales
And treasure isles, and distant shores
Where smugglers rowed with muffled oars,
And pirates wearing purple pants,
And sailing ships and elephants,
And cannibals crouching ’round the pot,
Stirring away at something hot.
(It smells so good, what can it be?
Good gracious, it’s Penelope.)
The younger ones had Beatrix Potter
With Mr. Tod, the dirty rotter,
And Squirrel Nutkin, Pigling Bland,
And Mrs. Tiggy-Winkle and
Just How The Camel Got His Hump,
And How the Monkey Lost His Rump,
And Mr. Toad, and bless my soul,
There’s Mr. Rat and Mr. Mole
Oh, books, what books they used to know,
Those children living long ago!
So please, oh please, we beg, we pray,
Go throw your TV set away,
And in its place you can install
A lovely bookshelf on the wall.
Then fill the shelves with lots of books,
Ignoring all the dirty looks,
The screams and yells, the bites and kicks,
And children hitting you with sticks –
Fear not, because we promise you
That, in about a week or two
Of having nothing else to do,
They’ll now begin to feel the need
Of having something to read.
And once they start — oh boy, oh boy!
You watch the slowly growing joy
That fills their hearts. They’ll grow so keen
They’ll wonder what they’d ever seen
In that ridiculous machine,
That nauseating, foul, unclean,
Repulsive television screen!
And later, each and every kid
Will love you more for what you did.
.

Roald Dahl 

(13 September 1916 – 23 November 1990)

English Poet.

Born in Wales to Norwegian parents, Dahl was a British novelist Short Story Writer, Poet, Fighter Pilot(W II) and a Screenwriter of repute. His best works are: James and the Giant Peach, Charlie and the Chocolate Factory, George’s Marvellous Medicine, Fantastic Mr Fox, Matilda, The Witches and The BFG.

“Television … రోవాల్ డాల్” కి 9 స్పందనలు

  1. vaasthavikata toNikisalaadutundi.chaalaa baagundi.Thank you very much.

    మెచ్చుకోండి

  2. అనువాదం చాలా బాగుంది సార్. ఈ కవితను నేను చాన్నాళ్ళ క్రితం చదివాను. మరలా ఇప్పుడు ఇలా.
    కానీ పరిస్థితి చేయిజారిపోయింది సార్. వెనక్కి తిరిగిపోలేని దారులలోకి మనం ప్రవహిస్తున్నామేమోననిపిస్తూంటుంది. ఇదంతా ఇప్పుడు ఒన్ వే ట్రాఫిక్.

    మెచ్చుకోండి

    1. Baba garu,

      You are right. The reason is that what were earlier child-addicts, have become adult-addicts. When I cannot live without TV how can I censure my child for addiction? Though this poem seems concerned more about children, it is equally applicable to old people. Actually, next to parents and teachers, children look to their grandparents for every kind of help and advice. TV has become a substitute for reading and thinking even for older generation. That is why every Tom Dick and Harry started giving his own interpretation of religion without any authority. Strangely, performance on TV has become an authority these days.

      Yet, it is never too late for any thing. Recent studies are showing that there is a reversal of trend and people’s perspective about TV has changed and they are now converting back to FM Radio transmissions. The reason is its availability and reach … always at hand through their mobile handsets. Let us hope it extends to study of books as well.

      Contemporary Poets are more inclined to write more about cliched subjects than anything that concerns the larger interests of the society. Those few people concerned should continue to play their role with awareness and determination.

      with best wishes

      మెచ్చుకోండి

    1. Thank you Sarma garu.
      with best regards

      మెచ్చుకోండి

      1. I am late in comment due to unavoidable reason spelt out in the blog.

        మెచ్చుకోండి

      2. Dear Sarmagaru,

        Your blessings are our guiding spirit. I know they are always there.

        with very best regards

        మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.