అనువాదలహరి

బహుమతి … ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి

Image Courtesy: http://4.bp.blogspot.com

నేను నిగాఢ నిశిలోంచి మాటాడుతున్నాను…

కాలబిలం లాంటి చిమ్మ చీకటి లోంచి …

అనంతాంధకారపు అంతరాలలోంచి మాటాడుతున్నాను…

.

మిత్రమా! నువ్వు మా ఇంటికి వస్తే,

చూడడానికి వీలుగా ఒక దీపాన్నీ, కిటికీనీ వెంట తీసుకు రా!

వీధిలో ఆనందంతో ఆడుకుంటున్న జనాల్ని చూడాలి.

.

Image Courtesy: http://upload.wikimedia.org

ఫరూవే  ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి

20వ శతాబ్దపు ఇరానియన్ కవయిత్రులలో అతిప్రతిభావంతమైన, శక్తివంతమైన గొంతుకలలో ఫరూవే ఫరక్జాద్ ఒకరు. విడాకులు తీసుకున్న స్త్రీగా, ఛాందస భావాలను తొసిరాజంటూ శక్తివంతంగా చెప్పిన ఆమె కవిత్వం అనేక వ్యతిరేకతలని ఎదుర్కొని బహిరంగంగా గర్హించబడింది కూడ.

కవులు ఆమె జీవితం నుండి నేర్చుకోవలసినదీ, అనుకరించవలసినదీ ఎంతైనా ఉంది. కవిత్వాన్ని జీవితంలో ఒక భాగంగా చూసిన ఆమె జీవితంలో రెండు చక్కని ఉదాహరణలు: ఒకటి కుష్టువ్యాధితో బాధపడుతున్న ఇరానియన్లపై ఆమె 1962 లో  The House is Black అన్న పేరుతో తీసిన డాక్యుమెంటరీ 12 రోజుల చిత్రీకరణలో ఇద్దరు కుష్టురోగుల పిల్లడికి చేరువై అతణ్ణి దత్తత తీసుకోవడం; రెండు:  పిల్లల స్కూలుబస్సును ఢీకొనకుండా ఉండేందుకు తనజీపును పక్కకితప్పిస్తూ రాతిగోడను గుద్దుకుని ప్రాణాలు విడవడం.

The Captive (1955), The Wall, The Rebellion,  Another Birth (1963) అన్న కవితా సంకలనాలు వెలువరించింది. ఆమె మరణానంతరం ప్రచురితమైన Let us believe in the beginning of the cold season  పెర్షియన్ భాషలో అత్యుత్తమ ఆధునిక కవితగా కొందరు కొనియాడేరు. ఆమె కవిత్వం ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, తుర్కిష్, మొదలైన అనేక భాషలలోకి అనువదించబడింది.

.

Gift
.

I speak out of the deep of night
out of the deep of darkness
and out of the deep of night I speak.

if you come to my house, friend
bring me a lamp and a window I can look through
at the crowd in the happy alley.

.

Forugh Farrokhzad

(January 5, 1935 — February 13, 1967)

Persian Poetess

Translated by Ahmad Karimi Hakkkak
The Persian Book Review VOLUME III, NO 12 Page 1337

(Text Courtesy: http://www.forughfarrokhzad.org/selectedworks/selectedworks1.asp)

%d bloggers like this: