అనువాదలహరి

పాత రాగాలు … సారా టీజ్డేల్

Image Courtesy: http://www.all-hd-wallpapers.com

నా బ్లాగు దర్శకులకు

ఇది నా 300 వ టపా. నేను నా బ్లాగు ప్రారంభించినపుడు (29.8.2010) ఇంతదూరం వస్తానని ఊహించలేదు. మీ  అందరి ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యపడింది. మీ కందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

ఈ సందర్భగా నా అభిమాన ఆంగ్ల కవయిత్రి సారా టీజ్డేల్ కవిత అందిస్తున్నాను.

(సారా టీజ్డేల్ అసాధారణ ప్రజ్ఞావంతురాలయిన కవయిత్రి.  ఒక సామాన్యమైన అనుభవాన్ని తీసుకుని, అందులో ఎంత తాత్త్విక భావనని కలగలిపిందో చూడండి.)

..

తోటలో గాలి పెద్దగా వీచనప్పుడు

గులాబులు, సూర్యకమలాలనుండీ వచ్చే పరిమళపు తెమ్మెరలు

మనమీద తేలియాడి ఎక్కడికి సాగిపోతాయో తెలీదు

.

అలాగే, ఒక పాతరాగంకూడా గుండెలో గుసగుసలాడి

జాడ తెలుపకుండా నా నుండి చల్లగా ఎక్కడికో జారుకుంటుంది

మంద పవనాలు చడీచప్పుడులేకుండా మోసుకుపోయే సుగంధంలా.

.

కానీ, ఆ పరిమళాలు నా మీద వీస్తున్న క్షణంలో

నాకు తెలుస్తునే ఉంటుంది, ఆ క్షణంలో అనుభవించే

ఆనందమూ, విషాదమూ మరి తిరిగి రావని.

.

అందుకే, చీకటి మడుగుపై

‘రాక’ నుండి రాలి పడి విరిగిన వెలుగురేకలు ఏరుకున్నట్టు

దొరికినన్ని రాగాలు చేజిక్కించుకుందికి ప్రయత్నిస్తాను

.

కానీ అవి తేలి వెళ్లిపోతాయి… అయినా, అసలు  ఎవ్వడాపగలడు

యవ్వనాన్నీ, సుగంధాన్నీ, వెన్నెల వెలుగునీ?

.

సారా టీజ్డేల్.

.

Old Tunes…

.

As the waves of perfume, heliotrope, rose,
Float in the garden when no wind blows,
Come to us, go from us, whence no one knows;

So the old tunes float in my mind,
And go from me leaving no trace behind,
Like fragrance borne on the hush of the wind.

But in the instant the airs remain
I know the laughter and the pain
Of times that will not come again.

I try to catch at many a tune
Like petals of light fallen from the moon,
Broken and bright on a dark lagoon,

But they float away — for who can hold
Youth, or perfume or the moon’s gold?

.

Sara Teasdale

%d bloggers like this: