The Cultivator … Duvvoori Ramireddy (Part 1)
The name of Kavikokila Duvvoori Ramireddy strikes a chord in the old generation recalling his translation of Omar Khayyam’s Rubaiyat as “Panasala”. Besides being prolific in Arabic, Sanskrit, Telugu and English, he had published 4 volumes of poetry and a number of articles on folklore.
In his book “Krishivaludu” (The Cultivator), Sri Reddy describes the village life so picturesquely, that it would be nostalgic to the old and a colourful dream to the young. The present day disappointing village scenario amply proves that the truth ‘that there is no future for this country without the farmer’, did not yet dawn on our rulers. It is unfortunate that the Cultivator continues to be cheated on Seed, Pesticide, and Fertilizer and the perpetrators continue to escape scot-free.
Here is a sample of poems for your perusal.
1)
Tinkling of the ankle bells of graceful country women on their way
To fetch drinking water from the pond, as sun’s beaming rays course thro’
The lush leafy labyrinths creeping up to the mounts of cots
At daybreak, sound sweet like the bubbly babbling of a darling babes.
2)
Dangling along the roof curbs for a while sun’s radiant beams,
Only which can dispel dense darkness, gold-coat your cozy cot,
Come! Wake up! Shed your sleep. It’s time to herd cattle to heath.
They graze heartily, feast on fodder and the dew-clad blades of grass.
3)
As the pearls of sweat ski down her cheeks
Collect behind that smooth veil of hers,
and fight (as the veil flirts impishly with mammilla)
And as Bangles jingle with each churn-of-curd
Can’t you listen to the sweet lays of your lady?
4)
Is it mean to attend to one’s own work? Can’t you watch
Your woman running around exhaust, attend menial chores they all?
Take that yoke and fetch lake water without demur, please her.
Believe me, such simple courtesies shall never ever go a waste.
5)
Don’t be a lazy laggard, or, while away your time with
Lackadaisical youth paying deaf ear to all wise says;
If farmers, who turn barren lands to green pastures with their sweat,
Turn idlers, who can save the people, feed them with fine food?
6)
As the sweet nascent fragrance of the newly blossomed chrysanthemum wafts around
As wild flowers on the meadow blow up as if a jewelled carpet was laid in welcome
As the fields of rice that bow humbly with full crop seem a home for the Goddess Lakshmi
As the clouds of mist rolling in the sheen of dawn waft like a veil of cloth dashed in gold.
So elegant looks, at the moment, the whole world
That it seems an oil on canvas, rendered
With his magical touch by the Heavenly hand,
Come, just have a peep, eastward.
.
Duvvoori Rami Reddy
.
[కవికోకిల దువ్వూరి రామిరెడ్డి పేరువినగానే, పాతతరం వారికి “అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల” పద్యంతోపాటు ఉమర్ ఖయ్యాం రుబాయీలు, “పానశాల”(1935) కావ్యం గుర్తుకు రాకమానవు. ఆయన అరబిక్, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషుభాషలలో ప్రావీణ్యం సంపాదించడమేగాక, వనకుమారి (1918), కృషీవలుడు(1919) , పలితకేశము(1944)
మొదలైన ఖండకావ్యాలు వెలయించారు.
మారుతున్న గ్రామీణ వాతావరణంలో, వ్యవసాయం గిట్టుబాటుకాకుండాపోతున్న నేపధ్యంలో గ్రామీణ జీవితం వయసుడిగినవారికి ఒక నాస్టాల్జియా; పిన్న వయస్సువాళ్ళకి ఒక రొమాంటిక్ కల. కానీ, రైతులేకపోతే రాజ్యమే లేదన్న కనీస జ్ఞానం మనపాలకులకు కలగకపోవడం, విత్తనాలూ, మందులూ, ఎరువులూ … మూడింట్లలోనూ రైతుని మోసంచేసే వాళ్ళు శిక్షవలని భయంలేకుండా బోరవిరుచుకు తిరగడం మన దురదృష్టం. ఒకప్పటి పల్లెసీమలెలా ఉండేవో, రామిరెడ్డిగారు చాలా హృద్యంగా చిత్రీకరించారు.
‘కృషీవలుడు’ కావ్యం నుండి మచ్చుకి కొన్ని పద్యాలు.]
కృషీవలుడు
అరుణమయూఖముల్ తరులతాంతరమార్గము దూరి గేహాగో
పురముల బ్రాకు పొద్దుపొడుపుం దరుణంబున నీటికోసమై
సరసులకేగు కాపు నెఱజాణల నూపుర మంజుటార్భటుల్
నెఱసె బ్రభాతమన్ శిశువునేర్చెడి ముద్దులమాటలో యనన్.
.
ఇరువులజూరులందు జరియించి తమోహరణైకదక్ష భా
స్కరకిరణాళి నీ మృదులశయ్య సువర్ణమయంబుజేసె, ని
ద్దుర నికనైనమాని, వెలిదోలుము బీళ్ళకు నాలమంద, ని
త్తఱి దమిదీర మేయు బులదంటులు గమ్మనిమంచుపచ్చికల్.
.
చెమరుముత్యాలు చెక్కిళ్ళ జెదరిజారి
పైట తెరవెన్క జమరి పోరాటమెసగ
(ముద్దుచన్నులు పయ్యెద మురిపమాడ)
గాజునీలాలు మధురనిక్వణము లొలయ
దధి మధించెడి కాంత గీతములు వినవొ?
.
మనపని జేసికొన్న నవమానమె? ప్రాచిపనుల్వొనర్చుచున్
వనిత యతిప్రయాసమున పర్వులిడన్ గనుగోవె? కావడిం
గొని సరసీజలంబులను గోపముసేయక తెచ్చియిచ్చికాం
తను పరితోషపెట్టుము; వృధా చనవెప్పుడు నట్టిసాయముల్.
.
సోమరిపోతవైజనకు జనకు, సూక్తులలక్ష్యముజేసి కొంటెపో
రాముల ప్రొద్దుపుచ్చకు, నిరర్థకభూములనైన చెమ్మటన్
శ్యామల సస్యవంతముగజేయు సల్పెడు కాపులు నోగులైన నిం
కోమెడువారలెవ్వరు జనోత్కరమున్ సరసాన్నదాతలై.
.
అప్పుడప్పుడెవిచ్చి అలరుజేమంతుల కమ్మనినెత్తావి గడలుకొనగ
రత్నకంబళమట్లురాణించుబీళుల బలువన్నెపూవులు బలిసివిరియ
వ్రాలబండిన రాజనాలకేదారంబు – పంటలక్ష్మికి నాటపట్టుగాగ
ప్రొద్దునిగ్గులుసోకి పొగమంచుమబ్బులు బంగారువలిపంబు బగిదివ్రేల
ఈ నిమేషమందు నిలయెల్ల నందమై
స్వర్గశిల్పి ఇంద్రజాలశక్తి
వ్రాసినట్టి చిత్రపటమన విలసిల్లె;
తొంగిచూడుమిపుడు తూర్పు దిక్కు
.
దువ్వూరి రామిరెడ్డి
(1895-1947)
నాకు శాంతి లభించలేదు … Sir Thomas Wyatt
[చిత్రంగా ఈ కవిత ప్రేమ కవిత్వమైనా, ఇది జీవుడి ఆత్మవేదనకి కూడ సరిగా సరిపోతుంది. మన జీవితం లో ఎన్నో సందర్భాలలో మనం అచ్చం ఇలాగే ఫీల్ అవుతాం. మనకి ఇష్టమైన వస్తువులూ, వ్యక్తులే ఒక్కోసారి మన కష్టాలకీ/ మనోవ్యధకీ కారణం కావడం విధి చిత్రంలా అగుపించక మానదు.]
.
నాకు శాంతిలభించలేదు… నా పోరాటాలు సమసిపోయాయి
భయంతోనే ఆశా ఉంది;జ్వలిస్తూనే మంచులా ఘనీభవిస్తున్నా
ఎంతో ఎత్తులకిఎగురుతున్నా, నా అంత నేను లేవలేకపోతున్నా
నా దగ్గర ఏమీ లేదు, ప్రపంచాన్ని జయించినా;
దాచవలసినదీలేదు, పోగొట్టుకునేదీ లేదు; జైలులో నిర్బంధించి
నన్నేదీ ఆపలేదు, అయినా నేను పారిపోలేను;
నా ఇష్టప్రకారం నన్ను బ్రతకనీదు, చావనీయదు…
కాని, చావడానికి తగిన కారణం కల్పిస్తుంది
కళ్ళు మూసుకుని చూడగలను, మాటాడకుండా మాటాడగలను
చచ్చిపోదామని అనిపిస్తుంది, కానీ బతకాలనీ కొరుకుంటాను
నేనింకొకరిని ప్రేమిస్తూ, నన్ను నేను ద్వేషించుకుంటున్నా
విషాదంతో బ్రతుకుతున్నాను, అంత బాధలోనూ నవ్వగలను
ఆశ్చర్యం! చావూ బ్రతుకూ రెండూ బాధిస్తున్నాయి
దీనికంతటికీ కారణం… నాకు ఆనందం కల్గించే వ్యక్తే.
.

సర్ థామస్ వైయట్
(1502 – 1542)
ఆంగ్ల కవీ, హెన్రీ VIII మహారాజు దర్బారు ప్రముఖుడూ, రాయబారి.
.
I Find No Peace.
I find no peace, and all my war is done ;
I fear and hope, I burn, and freeze like ice ;
I fly aloft, yet can I not arise ;
And nought I have, and all the world I seize on,
That locks nor loseth, holdeth me in prison,
And holds me not, yet can I scape no wise :
Nor lets me live, nor die, at my devise,
And yet of death it giveth me occasion.
Without eye I see ; without tongue I plain :
I wish to perish, yet I ask for health ;
I love another, and thus I hate myself ;
I feed me in sorrow, and laugh in all my pain.
Lo, thus displeaseth me both death and life,
And my delight is causer of this strife.
.
Sir Thomas Wyatt
(1503 – 1542)
English Poet and Courtier and Ambassador of King Henry VIII
You can find the greatest tribute paid to him by his contemporary Henry Howard, Earl of Surry, the man credited with the epithet Father of Sonnet, along with Sir Thomas Wyatt, for introducing Sonnet to English:
A hand, that taught what might be said in rhyme;
That reft Chaucer the glory of his wit,.
A mark, (unperfected for time)
Some may approach, but none shall never hit.
(A hand that had written everything that could be written in rhyme; who took away the ‘glory of wit’ from Chaucer who was enjoying it till then; and a mark of intelligence that could never be perfected in time and nobody could ever touch it but few may come close to it)
(Text Courtesy: http://www.luminarium.org/renlit/ifindno.htm)
మరణదూతలు… సిజార్ వలేహో … పెరూవియన్ కవి
చే గెవాడా ని 1967లో CBI బొలీవియాలోని ఒక మారుమూల పల్లెలో కాల్చి చంపిన తర్వాత, అతని దగ్గర దొరికిన వస్తువుల్లో, అంచులు బాగా నలిగిన నోట్సుపుస్తకం దొరికింది. అందులో పావ్లో నెరూడా (చిలీ), నికొలాస్ గిగేన్ (క్యూబా), సిజార్ వలేహో (Peru), లేయాన్ ఫెలీపె(స్పెయిన్)ల 69 కవితలు ‘చే’ స్వదస్తూరీతో వ్రాసినవి ఉన్నాయి. అందులోనిది ఈ కవిత. తక్కిన వివరాలకు: http://www.guardian.co.uk/world/2007/sep/09/books.booksnews చూడండి)
ఈ కవితలో అనుకోకుండా ఎదురైన ఒక భయంకర సంఘటనని, ప్రాణాంతకమయిన సందర్భాన్ని తెలుపుతున్నాడు. ఆ సందర్భం ఎంత అమాయకంగా, తెలియకుండా ఎదురవుతుందంటే, మనం దానికి తయారీగా ఉండలేము. ఒక్కో సారి మనం చేసిన పనులకి విచారణ జరపకుండా, సంజాయిషీ చెప్పుకునే అవకాశం లేకుండా కేవలం నేరారోపణా, శిక్షా వెంటవెంటనే అమలుజరపబడిపోతుంది. యుధ్ధంలోనూ, గెరిల్లా పోరాటాలు చేసేవారికి ఈ సందర్భం మృత్యువుతో Tryst లాంటిది. కవి ఆ సంఘటనని చెబుతున్నాడు.
.
అంత బలమైన దెబ్బలు జీవితంలో తగులుతాయా…
ఏమో! నాకు తెలియదు
అవి ఎలాంటి వంటే, దేముని ఆగ్రహం వల్ల కలిగేటటువంటివి
అవి ఎదుర్కుంటున్నప్పుడు, జీవితంలో అనుభవించిన వేదనంతా
ఒక్కసారి పెల్లుబుకుతుంది…
ఏమో! నేను సరిగా చెప్పలేను.
.
అలాంటి సందర్భాలు అరుదుగా ఉండొచ్చు… కాని
ఎంత భీకరాకారుడికైనా, ధైర్యవంతుడికైనా, వెన్నులో వణుకుపుట్టిస్తాయి…
అవి ‘ఆతిల‘ వంటి ఆటవికుడి కాలాశ్వాలు కావచ్చు…
లేదా, మృత్యువు పంపిన మరణదూతలు కావచ్చు.
.
అవి క్రీస్తువంటి పవిత్రాత్మల పతనాలు
విధి దూషించిన ఒక ఆరాధించవలసిన నమ్మకం
రక్తాలోడుతున్న ఆ ప్రహారాలు
పొయ్యిమీద వ్రేలుతున్న రొట్టెల చప్పుళ్ళు
.
పాపం! ఆ వెర్రిబాగుల మనిషి కళ్ళుతిప్పి అటుచూస్తాడు,
భుజంమీద చరిచి ఎవరో మనల్ని పిలిచినట్టు;
అమాయకంగా అటుచూడగానే, ఆ చూపులో, ఒక్కసారి
జీవితమంతా అపరాధంలా పెల్లుబుకుతుంది.
.
అంత బలమైన దెబ్బలు జీవితంలో తగులుతాయా…
ఏమో! నాకు తెలియదు
.
[ఆతిల: ‘ఆతిల ది హూణ్‘(? … 453) అనబడే హూణ రాజు, పరమ భయంకరుడు, రోమను సామ్రాజ్యానికి పక్కలో బల్లెంలా నిలిచిన వాడు.]
.

సిజార్ వలేహో
(మార్చి 16, 1892 – ఏప్రిల్ 15, 1938)
పెరూవియన్ కవి సిజార్ వెలేహో, 11 మంది సంతానం లో ఆఖరివాడు. పెరూ లోని ఒక మారుమూల కుగ్రామంలో పుట్టిన అతను సాహిత్యం లో 1915 లొ స్నాతకోత్తర విద్య పూర్తిచేశాడు. మధ్యలో ఎన్నో సార్లు చదువుకి ఆటంకం కలిగింది. అతను మొదటిసారి చెరుకుతోటల్లో పనిచేస్తున్నప్పుడు వ్యవసాయ కూలీల శ్రమదోపిడీ ప్రత్యక్షంగా గమనించేడు. అతను Los Heraldos Negros(1915); Trilce (1923), Poemas humanos (1939) లో ప్రచురించేడు. అతను మూడే కవితా సంకలనాలు ప్రచురించినా, 20వశతాబ్దపు అత్యంత ప్రతిభావంతమైన కవులలో ఒకడిగా గుర్తింపుపొందాడు. అవి సమకాలీన కవులకంటే అతనెంత ముందుచూపుగలవాడో చెప్పడమే కాకుండా, సాహిత్య విప్లవాలకు ఒక అడుగు ముందుండి, ప్రతి పుస్తకమూ దేనికది భిన్నంగా విప్లవాత్మకంగా ఉంటాయి.
ప్రస్తుతం తీసుకున్న కవిత Los Heraldos Negros లోనిది. ఇందులో కవితలు అస్తిత్వ వేదననీ, వ్యక్తిగత అపరాధాల్నీ, బాధనీ, ఎత్తిచూపిస్తే, Trilce సర్రియలిస్టిక్ కవిత్వానికి ప్రేరకమని అనవచ్చు. అందులో ఇప్పుడు అధివాస్తవిక ధోరణిగా పిలవబడే …. భాషలో మౌలిక మైన మార్పులు, కొత్త పదాలను సృష్టించడం, వాక్యనిర్మాణాన్ని సాగదీయడం, యధేచ్ఛగా వ్రాయడం వంటి … కొత్త ప్రయోగాలు చేసేడు. అతని మరణానంతరం ప్రచురితమైన Poemas humanos, వామపక్షభావాల రాజకీయ, సామాజిక కవిత్వం
.
(When CIA captured and shot dead Che Guevara in 1967 in a remote Bolivian village, they found among his possessions a dog-eared notebook containing 69 poems … of Pablo Neruda (Chile), Nicolás Guillén (Cuba), César Vallejo (Peru) and León Felipe (Spain)… and these poems were written in his own hand. This is one of those poems. For further details read: http://www.guardian.co.uk/world/2007/sep/09/books.booksnews )
The Black Heralds
There are blows in life, so powerful . . . I don’t know!
Blows as from the hatred of God; as if, facing them,
the undertow of everything suffered
welled up in the soul . . . I don’t know!
They are few; but they are . . . They open dark trenches
in the fiercest face and in the strongest back.
Perhaps they are the colts of barbaric Attilas;
or the black heralds sent to us by Death.
They are the deep falls of the Christs of the soul,
of some adored faith blasphemed by Destiny.
Those bloodstained blows are the crackling of
bread burning up at the oven door.
And man . . . Poor . . . poor! He turns his eyes, as
when a slap on the shoulder summons us;
turns his crazed eyes, and everything lived
wells up, like a pool of guilt, in his look.
There are blows in life, so powerful . . . I don’t know!
[Another Version: The Black Messengers
There are in life such hard blows . . . I don’t know!
Blows seemingly from God’s wrath; as if before them
the undertow of all our sufferings
is embedded in our souls . . . I don’t know!
There are few; but are . . . opening dark furrows
in the fiercest of faces and the strongest of loins,
They are perhaps the colts of barbaric Attilas
or the dark heralds Death sends us.
They are the deep falls of the Christ of the soul,
of some adorable one that Destiny Blasphemes.
Those bloody blows are the crepitation
of some bread getting burned on us by the oven’s door
And the man . . . poor . . . poor!
He turns his eyes around, like
when patting calls us upon our shoulder;
he turns his crazed maddened eyes,
and all of life’s experiences become stagnant,
like a puddle of guilt, in a daze.
There are such hard blows in life. I don’t know ]
.
César Vallejo,
(March 16, 1892 – April 15, 1938)
Peruvian Poet
Born as the youngest of 11 children in a remote village in Peru, Vellejo completed post graduation in literature in 1915. He had to drop out from the university to work in sugarcane plantations and he had the firsthand experience of exploitation of agricultural labour there. Though he published only 3 volumes of poetry in his life time, each of his books was different from the other and revolutionary in its own right. He was recognised as one of the brilliant 20th century minds in the field of poetry. He was always ahead of his times and the literary movements. While Los Heraldos Negros(1915), from which the current poem was taken, reflects “existential angst and personal guilt”, Trilce (1923) is an avant-garde of surrealistic poetry with his experiments with language, syntax and coining of words and the introduction of technique of “writing as-it-is” (in the stream of consciousness) and Poemas Humanos (1939) was a posthumous publication reflecting his leftist ideas.
(Part of the text is abstracted from Biography Base),
A Pondless Village … Dr. Yendluri Sudhakar

[The relevance of the poem: In the pre-independence/ early days of independence, there were few villages with no ponds, but with number of wells that catered to the drinking and irrigation needs of people. But, people in power and their stooges, of late, are going on a usurping spree appropriating village lands under tanks and pastures literally undoing what we read in history by great kings who cared for the well-being of people. Coupled with that, in urban areas, selling water by digging borewells has become a monopolistic trade of Municipal Councillors / Ward members. With all the canals and estuaries that feed these tanks and ponds occupied, and the area under the tanks and ponds shrinking with reckless occupations, it will be no wonder if tomorrow people depend on rains only for their primary needs. Bathing in a pond would literally become a dream for the urban and rural kids.]
.
Like a motherless orphan
Our village was pondless
I don’t have any wet childhood memories
Of going bonkers over kissing the cheeks of a pond;
Or, any strong impressions of
Running naked across its watery plains;
Or, the childy experiences of nestling
Like a tender fruit among the rippling leaves
Rising up the hydel tree.
How dearly had we dreamt
Of learning alphabet in our juvenility
Writing on the watery slate over and over!
Whenever we saw a procession of clouds
We joined our voice with thunders
Raising slogans for the rain.
Stretching our earthy tongues
To trap the first drops of rain
And smacking them like lollipops
was the only aqueous dream we had of a pond.
When in the fiery season the skies rained heat
We ran everywhere like refugees with blistered feet
In search of a pond,
In search of a spring.
For the dried up and breached lives of ours
We couldn’t find a mouthful of water to gulp.
Like the hollow eye-sockets of our old boy Gurayyatata
There were two ground-wells
Which always presented a gloomy look.
Raising our hands up to the sky
We prayed to bless us with a pond,
Protested angrily for water like Bhageeratha,
And even wanted to break the pots of clouds
Shooting arrows into the sky.
Such was the innocence of our childhood
As to believe that it would rain
If we prayed for water, tying frogs to a mortar.
On the few occasions that it had rained,
Our village celebrated a festival of water.
But, by the next morning, when water receded,
It showed up cracks in the resident mire.
But I remember,
One hurricane night, when
Our village had turned
Into a veritable pool of water
With huts submerged neck-deep
And we, floating in its cradle for survival
Wailing our tears out.
We became tortoises in that flood,
Became moony Carps,
And Korameenus.
And as the water receded gradually
Like a pond drying up.
We fell silent
Like when milk dried up with the mother.
Whenever I remember my village, and
The childhood memories are caressed on my back,
Whenever the dry plot of land
Of my ancestors flashed in my memory,
The pondless profile of my village
Appears before my eyes, sapping all my energy.
With its resonating earthly voice
It exhorts me to become a pond myself.
.

Dr. Yendluri Sudhakar
Dr. Sudhakar is a Professor of Telugu at the Potti Sreeramulu Telugu University, Rajahmundry, Andhra Pradesh.
.
చెరువు లేని ఊరు
.
అమ్మ లేని అనాధలా
మా ఊరికి చెరువు లేదు
చిన్నప్పుడు
చెరువు చెక్కిళ్ళని ముద్దు పెట్టుకున్న
నీటి జ్ఞాపకాలు కానీ
నీటి మైదానంలో దిసమొలతో
పరుగెత్తిన గాఢ స్మృతులు కానీ
జల వృక్షమెక్కి అలల ఆకుల నడుమ
పిందెలా కదిలిన బాల్య్యానుభూతులు కానీ లేవు.
చెరువు పలక మీద
జలాక్షరాలు దిద్దుకోవాలని
చిన్నప్పుడు ఎంత పలవరించామో
మబ్బుల ఊరేగింపు బయలుదేరినప్పుడల్లా
ఉరుములతో గొంతు కలిపి
ఆరు బయట నీటి నినాదాలు చేసేవాళ్ళం .
జలజలా రాలే తొలకరి చినుకుల్ని
మట్టి నాల్కలు చాపి
పిప్పరమెంటు బిళ్ళళ్లా చప్పరించే
చెరువు మా బాల్య జలస్వప్నం
ఆకాశం కొలిమిగా మారిన అగ్ని రుతువులో
ఒక చెరువు కోసం
ఒక చెలమ కోసం
బొబ్బలెక్కిన కాళ్ళతో కాందిశీకులమయ్యే వాళ్లం
బెత్తికలెత్తి దూపగొన్న మా బతుకులకు
గుక్కెడు మంచినీళ్ళు కూడాదొరికేవికావు
మా గురయ్య తాత కళ్ల గుంటల్లా
‘రెండు ‘ దిగుడుబావులు మాత్రం
దిగులు దిగులుగా కనబడుతుండేవి
ఆకాశం వైపు చేతులు మోడ్చి
మాకో చెరువునియ్యమని ప్రార్ధించాం .
భగీరధులమై జలాగ్రహం చేశాం .
ఆకాశం లోకి విల్లు సారించి
మేఘ భాండాల్ని బద్దలు చేయాలనుకున్నాం
రోళ్ళకి కప్పలు కట్టి నీటి పూజలు చేస్తే
వర్షం పడుతుందనుకునే వెర్రి బాల్యం మాది.
ఎప్పుడైనా వర్షమొచ్చిన పొద్దు
మా వూరు జల ప్రవాహపు జాతరవుతుంది .
మళ్లీ మరునాటికి బురద మొహంతో నెర్రలు తీస్తుంది.
ఒకే ఒక్క కుంభవర్షపు తుఫాను రాత్రి
నిజంగానే మా వూరు చెరువయ్యింది.
గుడిసెల మెడల దాకా వూరు మునిగినా
చెరువు ఉయ్యాల లో తేలుతూ
మా కడుపుల్ని చెరువు చేసుకున్నాం .
నిండు నీటిలో మేమంతా
తాబేళ్ళమయ్యాం
కొరమీనులమయ్యాం
చందమామ బేడిస చేపలమయ్యాం
నెమ్మది నెమ్మదిగా చెరువెండిపోతుంటే
అమ్మ దగ్గర పాలైపోయినట్టు మూగ వోయాం
మా వూరు గుర్తుకొచ్చి
నా బాల్యం వీపు నిమిరినప్పుడల్లా
నా తాతముత్తాతల నాటి
మెట్ట పొలం కళ్ళల్లో కదిలినప్పుడల్లా
చెరువు లేని నా పల్లె రూపం
నన్ను నిలువెల్లా నీరు గా మార్చేస్తుంది.
నన్ను చెరువుగా మారమని
మట్టి గొంతుతో నినదిస్తూ వుంటుంది.
ఎండ్లూరి సుధాకర్
(వర్తమానం నుంచి)
కుర్రాడి నవ్వు … స్విన్ బర్న్

.
స్వర్గంలోని ఘంటలన్నీ మ్రోగవచ్చు
అక్కడి పక్షులన్నీ కిలకిలరవా లాలపించవచ్చు
భూమిమీది నీటిబుగ్గలన్నీ చిమ్ముతూ పైకెగయవచ్చు
అవనిమీది గాలులన్నీమధురస్వరాలనొకచోట పోగుచెయ్యొచ్చు…
ఇంతవరకు విని, ఎరిగిన
మధుర స్వరాలన్నిటికంటే మధురమైనదీ,
వీణకంటే, పక్షి పాటకంటే,
అరుణోదయవేళ
వనిలో అతిశయించే ఆనందపుహేల కంటే,
పదాలుపాడుతున్నట్టు పైకెగజిమ్మే నీటి ఊటకంటే
వివర్ణమైన వేసవి వడగాలి వేడి ఊసులకంటే
తియ్యనిది ఇంకొకటుంది…
సృష్టిలో అంత తియ్యని స్వరం ఉందని
అది మోగేదాకా తెలీదు,
స్వర్గంలో ఉంటుందని ఊహించలేము…
అది
తూరుపు శిలాగ్రాలనుండి రాగరంజితంగా
జాలువారే కిరణాల సవ్వడిలా
సంతోషాతిశయంతో మనసు నిండినపుడు,
లలితంగానే కాని బలంగా, తేలికగానే కాని స్పష్టంగా
తొణికిసలాడే ఒక కుర్రవాడి నిర్మలమైన చిరునవ్వు.
స్వాగత గీతాలెన్నడూ అంత మధురంగా విని ఉండము;
అంత గట్టిగా ఆనందం ఎప్పుడూ కేరింతలు కొట్టదు;
స్వర్గం ఇక్కడకు దిగిందేమో అని అనిపించే
ఆ బంగారు మోములో పలికే నవ్వు
కోయిలలూ, చకోరాలూ, ఒకటేమిటి మనిషి విన్నవీ కన్నవీ
మధురంగా ఆలపించే అన్నిపక్షుల ఆలాపనలూ
ఏడేళ్ళ కుర్రాడి నవ్వు తీయదనంలో
సగానికి కూడా సాటిరావు.
.

స్విన్ బర్న్
A Child’s Laughter
.
All the bells of heaven may ring,
All the birds of heaven may sing,
All the wells on earth may spring,
All the winds on earth may bring
All sweet sounds together—
Sweeter far than all things heard,
Hand of harper, tone of bird,
Sound of woods at sundawn stirred,
Welling water’s winsome word,
Wind in warm wan weather,
One thing yet there is, that none
Hearing ere its chime be done
Knows not well the sweetest one
Heard of man beneath the sun,
Hoped in heaven hereafter;
Soft and strong and loud and light,
Very sound of very light
Heard from morning’s rosiest height,
When the soul of all delight
Fills a child’s clear laughter.
Golden bells of welcome rolled
Never forth such notes, nor told
Hours so blithe in tones so bold,
As the radiant mouth of gold
Here that rings forth heaven.
If the golden-crested wren
Were a nightingale— why, then,
Something seen and heard of men
Might be half as sweet as when
Laughs a child of seven.
.
Algernon Charles Swinburne
(5 April 1837 – 10 April 1909)
English poet, playwright, Novelist, and Critic.
Swinburne devised a verse form “Roundel” of 9 lines in 3 triplets, with equal number of syllables for each line, the first and third lines rhyming and having a common refrain at the end of 3rd and last lines. He wrote 100 Roundels and dedicated to his friend Christina Rossetti (5 December 1830 – 29 December 1894) a great poet in her own right.
Enduring Search … Dr. Madhuravani

[For the first look and for a finicky reader, it may sound funny and ridiculous(may even sound foolish) when you say you are searching for something you never knew. But if we honestly assess our lives and its pursuits, we would have to, perhaps, admit that our life is a marathon search for something we never knew clearly. Even if we had achieved something, instead of living contented with what we have achieved, like a child who cries for the toy that it did not have ignoring all that it had, we suffer with a sense of dissatisfaction and a craving for something that we did not achieve. Even at the threshold of death, our search for that unknown shall not cease. Its my opinion that this poem puts that idea so succinctly.]
.
Yesterday… today…
Day in and day out…and,
For eons…
I have been on the search ….
What is it that I am seeking after?
Who for I am searching for?
What are the places I am looking about?
But,
Why should I search for, at all?
I don’t know!
It is an infinitum of questions …
With no definite answers.
*
Did I ever allow something
To slip through my hands any where?
I don’t think so.
But yet,
I search for that elusive thing
With the illusion that I own it.
Time is fleeting… days are thawing.
Hopes are vanishing… Faith is retreating
Life is ceasing… and the Spirit, depleting
Yet, that crazy search continues…
Cutting through the dense deep darknesses…
To the limits of horizon and to the depths of oceans
For that evanescent enigmatic something
Till breath snaps
Till spirit saps
My being becomes ethereal…
Maybe,
This search shall endure… ever… for ever!
.
Dr. Madhuravani
Doctorate in Plant Biology, Dr. Madhuravani is a Research Scientist living in Germany for the last 6 years. She is a blogger since 2008 and runs 3 blogs మధుర చిత్రాలు, (Some of the most breath-taking pictures you can see here) సుజనమధురం and మధురవాణి. She is very familiar to all bloggers and netizens.
.
[మనకు తెలియని వస్తువుగురించి మనం వెతుకుతున్నామని చెబితే, స్థూల దృష్టికి చిత్రంగానూ, వంకలు వెతికే వారికి, హాస్యాస్పదంగానూ కనిపించవచ్చు. కాని, మీరు అవేవీ పట్టించుకోకుండా, “మీ జీవిత గమ్యం ఏమిటి? మీరేం సాధిద్దామనుకుంటున్నారు?” అని నవ్వుతున్నవారిని ఒక్కసారి అడిగి చూడండి. ఆ నవ్వులు, హేళనలూ ఆగిపోతాయి. ఈ దైనందినజీవితపు పరుగుపందెంలో అందరితోపాటు మనమూ పరిగెత్తితున్నాం. ఎందుకుపరిగెత్తుతున్నామో తెలీదు. దేన్ని సాధించడానికి పరిగెత్తుతున్నామో తెలీదు. ఒకవేళ ఏదైనా సాధించినా, అది ఇచ్చే సంతృప్తి కంటే, సాధించలేని విషయాలిచ్చే అసంతృప్తి ఎక్కువ. జీవిత చరమాంకంలో కూడా ఈ అసంతృప్తి మనల్ని వదలదు.’శిలాలోలిత’లో, రేవతీదేవిగారు రాసిన “దిగులెందుకో చెప్పలేని దిగులు”లాంటి భావన ఇది. ఈ భావాన్ని, మధురవాణిగారు ఇందులో చక్కగా ప్రకటించగలిగేరని నా అభిప్రాయం.]
.
నా అన్వేషణ!
.
నిన్నా నేడూ పగలూ రాత్రీ అనుక్షణం నిర్విరామంగా వెతుకుతూనే ఉన్నాను..
యుగయుగాల నుంచీ సాగుతోందీ వెతుకులాట..
దేని కోసం వెతుకుతున్నాను?
ఎవరి కోసం వెతుకుతున్నాను?
ఎక్కడని వెతకాలి?
అసలెందుకు వెతకాలి?
ఏమో.. అన్నీ ప్రశ్నలే తప్ప జవాబుల్లేవు!
నేను ఎప్పుడైనా ఎక్కడైనా దేన్నైనా నా చేతుల్లోంచి జారవిడిచానా?
లేదనుకుంటాను..
అయినా నాదైనదేదో ఈ ప్రపంచంలో ఉందన్న భ్రాంతితో వెతుకుతూనే ఉన్నాను..
కాలాలు కదలిపోతున్నాయ్.. రోజులు తరిగిపోతున్నాయ్..
ఆశలు చెదిరిపోతున్నాయ్.. నమ్మకాలు చెరిగిపోతున్నాయ్..
ఆయువు కరిగిపోతోంది.. ప్రాణం ఇగిరిపోతోంది..
ఇంకా ఇంకా చీకటిని చీల్చుకుంటూ ఆకాశపు అంచుల దాకా.. సముద్రపు లోతుల దాకా..
ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..
ఊపిరి కొడగట్టే దాకా.. ప్రాణం కడగంటే దాకా..
నా అస్థిత్వం ఆవిరైపోయే క్షణం దాకా..
ఈ నా అన్వేషణకి అంతనేదే లేదేమో!
.
మధురవాణి
Plant Biologyలో డాక్టరేటు చేసిన మధురవాణి గారు గత 6 సంవత్సరాలుగా జర్మనీలో శాస్త్ర పరిశోధకురాలిగా ఉంటున్నారు. ఆమె 2008 నుండీ బ్లాగులోకంలో ఉంటూ బ్లాగర్లందరకూ చిరపరిచితురాలే. ఆమె మధుర చిత్రాలు (ఇందులో మిమ్మల్ని ఊపిరితీసుకోనివ్వకుండ కట్టిపడేయగల ఎన్నో ఫోటోలున్నాయి), సుజనమధురం మరియు మధురవాణి అని 3 బ్లాగులు నడుపుతున్నారు.
Weapon for Thousand Tumors … K. Geetha
“వేయి వ్రణాల ఆయుధం” కవయిత్రి కె.గీత స్వరంతో ఇక్కడ వినండి
(http://archive.org/details/VeyyiVranalaAyudham)
Death is a charter on stone
Connate with life, the place is predetermined.
One has to submit to it without demur.
Death is a stigma that sticks through life;
And shadows life without ever being erased.
Life hangs on to death
Like a drop of dew to a leaf’s apex.
Yet, life is nobler than death
And one has to fight unto the last moment.
O dear body! Don’t wail!
A grim silent war wages within, you are unaware
A tumour silently crept into the cells.
Death might be on the wings like a kite
Or, ready to pounce like a cheetah in the thicket,
But, you kindle life … back to fire.
O dear body! Don’t grieve.
Don’t dab in tears the swelling emotions within.
Don’t make me crazy crying for corporal beauty
Instead of comeliness of life.
***
Yet, my darling! This is a vain affliction.
Will there be a surrogate body sleeping where I was?
Will another frame adorn my attire and ornaments?
And in your warm hands that seize me, will there be…?
Oh! What silly noxious thorny thoughts fill my mind
Smarting me sharper than reality,
Whichever way I turn in my bed!
No. No. I am not dead.
It’s more a fear for treatment, than fear for life.
Darling! What can I say?
The bosom that hugged you dearly each day
Might be missing, but not the heart behind;
When children feel for the cuddle
Your fatherly bosom stands in for mine;
In the trail of chemos and radiations
Whatever happened within,
Hair dropped down like powder, without.
Yet my loveliness…
The loveliness of my heart did not cease.
I did not decease as yet.
Forget about the beauty…
Every time the body resisted
It threw up guts with vengeance.
Darling! Pray! Save me!
Show me an easier and better alternative.
The thoughts that swing like a pendulum to and fro
Are scarier than nightmares.
Is there no exception for virtuoso artists?
Won’t the days when I ruled the roost return?
Behind that visual beauty
There lies that dream-eating Cancer worm
There was something wrong somewhere
The baby is yet to learn babbling
And the eldest son is hardly ten
O, God! Please don’t curse my children.
Don’t alienate for the greenhorns
Their mother from them
Don’t leave this body with a pain,
More painful than death itself.
***
No. No.
There is no room for fear.
In this life of Snakes and Ladders,
how can we afford not repairing the impaired steps?
How long can we go on wailing vainly
As if we were afflicted with a weeping sickness?
Even if our moments are numbered,
How can we live dying each moment,
Until we actually do?
My beloved body!
Come on! Blossom!
Fill those cells with spirit and eyes with confidence
Be the weapon
That doesn’t give a hoot to thousand tumours.
Beat the drum of life
Sending shivers across the decrees of death.
.
(To the sufferers from Breast Cancer)
.
Dr. K. Geeta
Born in 1970 at Jaggampet of East Godavari District of Andhra Pradesh. Dr. Geeta Madhavi is a PG in Telugu and English Literature and did her Ph.D. in Telugu Literature in 2004 from the Andhra University. She is very popular and widely published poet. She has 3 volumes of poetry in Telugu to her credit and bagged several notable awards for her work. She also runs her blogs : http://kalageeta.wordpress.com; http://kgeeta.blogspot.in/ and http://21stcenturytelugu.blogspot.in/. She contributes regularly to many web magazines. She lives in Mountainview, CA, USA.
వేయి వ్రణాల ఆయుధం
మరణం ఒక శిలాశాసనం
పుట్టగానే ఎక్కడో ఒకచోట పాతిపెట్టబడి ఉంటుంది
శిరసా వహించాల్సిందే
అనుక్షణం అడుగు వెనకే పడే మచ్చ మరణం
జీవితం వెనకాల చెరగకుండా వెంటాడుతుంది
ఆకు చివర వేలాడే మంచు బొట్టులా మరణం అంచున వేలాడే జీవితం
అయినా జీవితం మరణం కంటే గొప్పది
ఆఖరి క్షణం వరకు పోరాడాల్సిందే
శరీరమా! ఏడవకు–
లోపల నీకే తెలీని ఒక నిశ్శబ్ద ఘోర యుద్ధం
చడీ చప్పుడూ లేకుండా కణాల్ని పాకిన వ్రణం
మరణం ఎప్పటి నుంచో గద్దలా కాపు కాసి ఉన్నా
పొద పక్కనే చిరుత పులిలా పొంచి ఉన్నా
జీవితం అగ్నిలా రాజుకోనీ
శరీరమా దు:ఖించకు–
మనసులో ఎగిసి పడే మమకారాల పట్టికకు కన్నీళ్ల మరకలే మిగల్చకు–
పిచ్చి పట్టినట్లు జీవితం కోసం మానేసి సౌందర్యం కోసం రోదించేలా చెయ్యకు
***
అయినా ప్రియతమా ఏదో పిచ్చి దు:ఖం!
రేపు నే నిద్రించిన స్థానే కొత్త శరీరం నిద్రిస్తుందా!
నా నగలు, చీరలు మరో శరీరం అలంకరించుకుంటుందా!
నన్ను చుట్టు ముట్టే నీ వెచ్చని చేతుల్లో నా బదులు–
ఎన్నెన్ని చేదు విషపు ముళ్ల ఆలోచనలో నా శరీరం నిండా
వాస్తవం కంటే ఎక్కువగా ఎటు ఒత్తిగిలినా గుచ్చుకుంటూ–
లేదు– లేదు నేను మరణించలేదు–
ప్రాణం కంటే వణికించే వైద్యం భయం
ప్రియతమా! ఏమని చెప్పను నీకు?
నిన్ను ప్రతిరోజూ హత్తుకున్న నా గుండెలు మాయమైనా
నా హృదయం ఇంకా మిగిలే ఉంది
పిల్లలకి మమకారపు పాలు పంచుకున్న చోట
అమ్మ గుండెకి బదులు నాన్న గుండె ప్రతిష్టించబడింది
కీమో లు, రేడియేషన్ల పర్వంలో
లోపలేం జరిగినా పైపైని జుట్టు పొట్టై రాలిపోయింది
అయినా నా సౌందర్యం
హృదయం లో నా సౌందర్యం ఎక్కడికీ పోలేదు–
నేనింకా మరణించలేదు–
సౌందర్యం మాట దేవుడెరుగు శరీరం తిప్పికొట్టిన ప్రతీసారీ
పేగుల్ని పైకి తోసే కక్కులొకటి
ప్రియతమా! నన్ను రక్షించు
ఇంకేదైనా సులభ మార్గం చూపించు–
ఎన్నో సార్లు వెనక్కీ ముందుకీ లోలకంలా ఊగుతున్న ఆలోచనలు
దుస్సప్నం కంటే బాధించే వాస్తవాలు
సకల కళా నేర్పరులకూ మినహాయింపు లేదా!
నేనే కొరడానై ఝళిపించిన రోజులకు ఇక తావు లేదా!
పైకి కనిపించే కళల వెనుక
కలల్ని దోచేసిన కేన్సరు క్రిమి
ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది
పసిదానికి నోరైనా రాలేదే
పెద్దబ్బాయికి ఇంకా పదేళ్లేనే
భగవంతుడా! నా పిల్లల్ని శిక్షించకు–
ముక్కు పచ్చలారని పసి పిల్లలకి అమ్మని దూరం చేయకు–
మరణం కంటే బాధించే జీవితాన్ని ఈ శరీరానికి మిగల్చకు–
***
లేదు– లేదు–
ఏమీ భయం లేదు–
జీవన పరమ పథ సోపానం లో విరిగిన మెట్లని సరిచేసుకోపోతే ఎలా?
వ్యధా రోగం పట్టినట్టు నిత్యమూ వృధా రోదిస్తే ఎలా?
జీవించేదెన్ని క్షణాలైనా అనుక్షణమూ మరణిస్తే ఎలా?
శరీరమా!
పుష్పించు–
కణాలలో, కళ్లల్లో ధైర్యవిశ్వాసాల్ని నింపు–
వేయి వ్రణాలైనా లెక్క చేయని ఆయుధమై మొలకెత్తు–
మరణ శాసనాలు దద్దరిల్లేలా జీవన నగారా మోగించు–
.
(బ్రెస్ట్ కేన్సరు బాధితులకి)
కె.గీత
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో 1970 లో జన్మించిన కె. గీతా మాధవి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులోనూ ఇంగ్లీషులోనూ MA, ఫ్రెంచ్ లో డిప్లొమా చెయ్యడమే గాక, తెలుగులో 2004 లో Ph.D చేశారు. ఇంతవరకు రెండు కవితా సంకలనాలు … ద్రవభాష, శీతసుమాలు… తీసుకువచ్చారు. ఆమె కవితా ఖండికలకి రంజనీ కుందుర్తి అవార్డు, దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డు పొందారు. ద్రవభాష సంకలనానికి అజంతా అవార్డు పొందారు.
The Sublimity of Life … Bolloju Baba, Telugu, Indian

.
The first cloud that skims along
The last whiff of summer breeze
Leaves an impression of verdurous kiss
on earth’s parching lips
.
The cold wind that comes riding
Over the last drop of rain
Passes off … blessing each body
With an encounter of warmth
.
The Summer born
In the ultimate moments of Winter
recedes throwing a fistful of jasmines on adults
And a chestful of memories to children
.
Novelty of life and the tapering of death
Shall always fine tune
The music of Life
.
Love always
Enlivens the passages of Life
With its fragrances
.
What a sublime life it is
When we humbly subject to Time or Love
And surrender our Being and our Existence!!!
.

Bolloju Baba
Sri Bolloju (Ahmad Ali) Baba is working as a Lecturer of Zoology in Razole, EG Dt. Andhra Pradesh, and is running his blog http://sahitheeyanam.blogspot.in since April 2008.
.
జీవన సౌందర్యం
వేసవి చివరి తెమ్మెరపై
తేలుతూ వచ్చిన తొలకరిమబ్బు
అవని పెదవులపై ఆకుపచ్చని
చుంబనాన్ని వొదిలిపోయింది.
వర్షాకాలపు ఆఖరు చినుకుపై
స్వారీ చేస్తూ వచ్చిన శీతవాయువు
దేహ దేహానికీ వెచ్చని స్పర్శలను
ప్రసాదించి సాగిపోయింది.
శీతవేళ చివరి ఘడియలో
మొలకెత్తిన వేసవి
గుప్పెడు మల్లెల్ని పెద్దలకు
పుట్టెడు జ్ఞాపకాల్ని పిల్లలకూ ఇచ్చి
కనుమరుగైంది.
పుడమి సంగీతాన్ని
నూత్న సృష్టి, మృత్యువు లు
నిత్యం శ్రుతి చేస్తూనే ఉంటాయి.
జీవితపు దారులను
ప్రేమ తన పరిమళాలతో
ప్రకాశింపచేస్తూనే ఉంటుంది.
కాలానికో, ప్రేమకో
వినమ్రంగా నమస్కరించి
అస్థిత్వాన్నో, ఆత్మనో
ఆనందంగా సమర్పించుకోవటంలో
ఎంతటి జీవన సౌందర్యముందీ!
బొల్లోజు బాబా
An Exposition of Peace … Kavi Yakoob
The peace we long for
swings between
The point of a bayonet and the heart beat
Like a dying man’s last breath
The peace we long for
Lies on the bed.
The peace we long for is a temple, a masjid,
an explosion, a cease-fire, an ending, a continuance
An injured song, a thunder of lightning
dropped, snapped from heavens.
It’s like the foot of a banned poem
Buried in the gullet.
Amidst the sonorous expositions of peace
By the bearded Mullahs and Sadhus
The peace we long for gasps for breath.
.
The peace we long for
is lame like the gait
of a dog that broke his leg.
.
Pity!
We have to get on
With whatever amount of peace
The state rations us
Collecting it in our bags.
.
(From “eDategani prayANam”.)
Kavi Yakoob
Dr. Kavi Yakoob is working as Associate Professor at Anwarul – Uloom Degree College, University of Hyderabad, Hyderabad, Andhra Pradesh. He runs a blog: http://kaviyakoob.blogspot.in/
Apart from eDategani prayAnam(2009) from which the present poem is taken, he has two more publications of poetry to his credit: PravahimcE jnApakam (1992) and Sarihaddu rEkha (2002).
.
శాంతి ప్రవచనం
.
మనం కోరుకునే శాంతి
గుండెచప్పుడుకూ, తుపాకీ మొనకూ మధ్య ఊగిసలాడుతుంది.
మనం కోరుకునేశాంతి
మరణించే మనిషి చివరిశ్వాసలాగా మంచం మీద ఉంది.
మనం కోరుకునే శాంతి ఒక మందిరం, ఒక మసీదు
ఒక ప్రేలుడు, ఒక కాల్పుల విరమణ, ముగింపు, కొనసాగింపు
గాయపడిన పాట, రాలిపడిన విద్యుత్ నినాదంలా ఉంది.
నిషేధింపబడి గొంతులోనే సమాధి అయ్యే కవితాపాదంలా ఉంది.
గడ్డాలు పెంచిన ముల్లాల, సాధువుల
శాంతిప్రవచనరాగాల మధ్య
మన శాంతి ఉక్కిరిబిక్కిరిగా ఉంది.
మన శాంతి
కాలువిరిగిన కుక్కపిల్ల నడకలా
కుంటికుంటిగా ఉంది.
రేషన్ లో శాంతిని ఈ రాజ్యం ఎంతకేటాయిస్తే
అంతే సంచిలో తెచ్చుకోవాలి.
అంతటితోనే సరిపుచ్చుకుని గడపాలి.
ప్చ్…
.
యాకూబ్
(ఎడతెగని ప్రయాణం నుండి)
కవి యాకూబ్ గారు ఈ కవిత తీసుకున్న ఎడతెగనిప్రయాణం(2009) కాకుండా, ప్రవహించే జ్ఞాపకం (1992) సరిహద్దు రేఖ (2002) అన్న రెండు కవితాసంకలనాలు వెలువరించారు.
On the Sparrow from my Village … Usharani

You little sparrow,
Ha, I could make you out….you are from my village.
That cute little nose and those elfin feathers… betray you.
But then, when I ask you if you have come alone,
Why are you so insolent, taking off without answering me?
As if you only have those dainty feathers?
Reconciling that you might not have noticed me,
I just crossed your way
But, no. You did not give even a cursory look at me.
I don’t know if I had changed with times
Or time had changed me,
You did not recognize me, for sure.
.
Let me make another trial.
Do you remember the other day
When you hurt your nose gory
Pecking at your own image in the mirror?
Can you recall my chasing you jumping on my feet
And catching you in your flight at last?
And when I left you free far off in the open
You teased me by coming home earlier than me?
.
Did you forget your taunting me once more
Playing with your mates on the posts
At the Jasmine garden of Booriyyagaru
When I went there to collect a few flowers
On that festive day
In a silk petticoat, salving my feet with saffron
And wearing ankle bells?
.
Do you remember
Your roaming around the place
When my granny was telling me stories
Picking all the grits thrown at you
By my sister Kamakshi?
.
Isn’t it you who protected the crop
Weeding out the pests in Ramannatata’s farm?
This is exactly how you dissed at me last time
When I wanted to check up with you
The lore I heard about you.
.
Though I left that place you stayed behind.
Maybe, you could not find a mate, like me,
to enchant you out to alien lands.
You were even greeting me
Whenever I came home for festival or vacation.
But suddenly, one day, when my brother Venu said,
“Did you hear, sister?
All the sparrows have disappeared suddenly.
They say, they might have been dead?”
I was so sad and depressed.
When I asked for the reason,
Everybody had given some reason or the other.
And, somebody had said it was due to the use of pesticides.
Well, why could you not convince them
That they were redundant so long as you were there?
.
And now after a long absence
Here in this cold country
In Fall,
You suddenly appeared and delighted me.
Oh! There is a flock around you.
Have you migrated here like me, perchance?
Hey, you are jeering at me in your wont way.
Thank heavens!
Have you recognised me?
.
