అనువాదలహరి

మనసు ఆమెను ఎలా మరచిపోగలదు? … అజ్ఞాత కవి

Image Courtesy: http://us.123rf.com
Image Courtesy: http://us.123rf.com

(ప్రేమ సర్వకాలీనం. అయితే చెప్పేవిధానం, ఉపయోగించే ప్రతీకలలోని కొత్తదనం మనసు ఆకర్షించుకుంటుంది.  ఈ కవితలో ప్రేమికుడు తన ప్రేమని నిరాకరించే స్త్రీని మరచిపోదామనుకుంటూ పడిన ఊగిసలాటని అజ్ఞాతకవి ఎంత అందంగా వ్యక్తపరచేడో గమనించండి. )

.

ఆమె సొగసైన చేతులు పట్టుకుని, పదేపదే ప్రార్థిస్తూ,

ఎన్నిసార్లు ఆమె ప్రేమని అర్థించలేదు?

అయినా సరే, నా ప్రేమ తృణీకరింపబడింది

మనసా! ఇక ఆమెను విడిచిపెట్టు, ఇక ఆమె మనసు మారదు

(మనసు) అయితే ఆమెను విడిచిపెడుదునా?

ఓహ్! వొద్దు. వొద్దు. వొద్దు.వొద్దు. వొద్దు.

ఆమె అత్యంత సౌందర్యరాశి..మనసే కఠినశిలగాని.

.

ఎన్నిసార్లు నేను రోజూ తపించే నిట్టూర్పులు

నా వేదనని తెలియజేసి ఉంటాయి,

అయినా ఆమె వాటిని లక్ష్యపెట్టదు.

మనసా! ఆమెను మరిచిపో! ఇక నేను భరించలేను.

అయితే ఆమెను విడిచిపెడుదునా?

ఓహ్! వొద్దు. వొద్దు. వొద్దు.వొద్దు. వొద్దు.

ఈ గాయం ఆమె చేసింది. కనుక దీన్ని ఆమే మాన్పాలి

.

నాకు ఇంకా ఆమె పైన నిజమైన ప్రేమ ఉంది

దాన్ని నా ప్రార్థనలూ, నిట్టూర్పులూ, కన్నీళ్ళూ తెలియజేస్తుంటాయి

అయినా, ఆమె ఇంకా నన్ను ఉపేక్షిస్తుందా?

మనసా! ఆమెని వదిలెయ్. ఇవేవీ ఆమెని కరిగించలేనపుడు.

అయితే ఆమెను విడిచిపెడుదునా?

ఓహ్! వొద్దు. వొద్దు. వొద్దు.వొద్దు. వొద్దు.

ఆమె నన్ను తనవాణ్ణి చేసుకుంది. ఆమే తనవాడిగా నిలుపుకుంటుంది

.

ఆమె పట్ల నా ప్రేమ మారక, నన్నిలా దహిస్తుంటే,

ప్రేమకి బదులు ఇవ్వకపోతే,

ఇక ఆమెని నా ఆలోచనలోంచే తరిమేస్తాను.

మనసా! నిన్ను బతిమాలుకుంటాను. ఆమెను వదిలెయ్

అయితే ఆమెను విడిచిపెడుదునా?

ఓహ్! వొద్దు. వొద్దు. వొద్దు.వొద్దు. వొద్దు.

హృదయం లో ప్రతిష్టింపబడింది. మనసు ఆమెని ఎలా మరిచిపోగలదు?

.

అజ్ఞాత కవి .

.

How can the Heart forget her?
(Davison’s Poetical Rhapsody ? F. or W. Davison)
.
AT her fair hands how have I grace entreated
With prayers oft repeated!
Yet still my love is thwarted:
Heart, let her go, for she’ll not be converted—
Say, shall she go?
O no, no, no, no, no!
She is most fair, though she be marble-hearted.

How often have my sighs declared my anguish,
Wherein I daily languish!
Yet still she doth procure it:
Heart, let her go, for I can not endure it—
Say, shall she go?
O no, no, no, no, no!
She gave the wound, and she alone must cure it.

But shall I still a true affection owe her,
Which prayers, sighs, tears do show her,
And shall she still disdain me?
Heart, let her go, if they no grace can gain me—
Say, shall she go?
O no, no, no, no, no!
She made me hers, and hers she will retain me.

But if the love that hath and still doth burn me
No love at length return me,
Out of my thoughts I’ll set her:
Heart, let her go, O heart I pray thee, let her!
Say, shall she go?
O no, no, no, no, no!
Fix’d in the heart, how can the heart forget her?

.

Anonymous

(Possibly ? F. or W. Davison )

Text Courtesy: The Oxford Book of English Verse: 1250–1900.

Ed. Arthur Quiller-Couch.

%d bloggers like this: