అనువాదలహరి

“పేకాట — ముద్దులూ” … జాన్ లిలీ (1553–1606)

(సమకాలీనతనీ, ప్రాచుర్యంలోఉన్న ఇతిహాసాన్నీ జోడించి జాన్ లిలీ రాసిన బహుచమత్కారమైన కవితల్లో ఇది ఒకటి.  స్త్రీ అందాన్ని వర్ణించడానికి ఇంతకుముందు ఎవ్వరూ చెయ్యని ప్రయోగం చేశాడు. గురజాడవారి కన్యాశుల్కంలో మధురవాణి పేకాడడం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.  అందుకని లిలీ పాత్ర Campaspe ని (ఆమె అలెగ్జాండరు ది గ్రేట్ ప్రియురాలు, అపురూప సౌందర్యవతి. ఆమెని చిత్రకారులు చిత్రాలలో ఎంత ఎక్కువగా బంధించారంటే ఆమె పేరు అందమైన స్త్రీలకు రాజదర్బారుల్లో ఒక పర్యాయపదమైపోయింది)నేను మధురవాణిగామార్చి, మన పురాణాలలోని మన్మధుడికి అనుగుణంగా ఒకటి రెండు మార్పులు చేశాను.

మధురవాణిచేత ఎలాగైనా ముద్దుపెట్టించుకోవాలని తహతహలాడి పోయాడు మన్మధుడు (రామప్ప పంతులులా) ఆ లక్ష్యంతో పేకాటలోదిగి ఒకటొకటిగా తనవస్తువులు పందెంకాస్తూ తన సౌందర్య సాధనసంపత్తి అంతా కోల్పోయాడు. ఆమె సౌందర్యం ఇలా ఉందని చెప్పకుండా మన్మధుడిని గెలిచి సంపాదించింది అని చమత్కారంగా చెప్పడంలోనే కవి సృజనాత్మకత ఉంది. కానీ, చివరన ఒక్క కొసమెరుపు ఉంది. మీరే చదివి ఆనందించండి.)

.

మన్మధుడూ… మధురవాణీ పేకాడుతున్నారు

ముద్దులు పందెం వేసుకుని …

మన్మధుడు ఓడి ముద్దుపెట్టుకున్నాడు

రెండవసారి తన విల్లు, అమ్ములపొదీ, బాణాలూ

పావురాలూ, తనవాహనం చిలకా ఒడ్డేడు

అవీ ఓడిపోయేడు; తర్వాత ఆవేశంగా

తన పగడాల వంటి పెదాలూ,

తనబుగ్గల గులాబి రంగూ( అది ఎలా వచ్చిందో ఎవరికీ తెలీదు)

వాటితో పాటు, తీర్చిదిద్దిన కనుబొమలూ

నవ్వేటపుడు బుగ్గమీద పడే సొట్టా ఒడ్డేడు.

ఇవన్నీ మధురవాణే గెలుచుకుంది

చివరికి తన అందమైన కళ్ళు కూడా పందెం కాసేడు

మన్మధుడు గుడ్డివాడుగా లేచిపోయాడు.

.

అయ్యో మన్మధుడా! నీకే ఈ గతి పట్టిందా?

అలాగయితే, అమ్మో! నా గతేం కాను?

.

జాన్ లిలీ

1553–1606

ఎలిజబెత్ I మహారాణి కాలం లోని  ఇంగ్లీషు కవీ, నాటకకర్తా

.

Cards and Kisses

.

Cupid and my Campaspe play’d

At cards for kisses—Cupid paid:

He stakes his quiver, bow, and arrows,

His mother’s doves, and team of sparrows;

Loses them too; then down he throws

The coral of his lips, the rose

Growing on ‘s cheek (but none knows how);

With these, the crystal of his brow,

And then the dimple of his chin:

All these did my Campaspe win.

At last he set her both his eyes—

She won, and Cupid blind did rise.

O Love! has she done this for thee?

What shall, alas! become of me?

John Lyly 1553–1606

John Lyly was the inventor of an ornate style of English prose using a wide range of tropes particularly, antitheses, alliterations and rhetorical questions to enhance dramatic effect in prose. It is called “Euphuism”:

 “It is virtue, yea virtue, gentlemen, that maketh gentlemen; that maketh the poor rich, the base-born noble, the subject a sovereign, the deformed beautiful, the sick whole, the weak strong, the most miserable most happy. There are two principal and peculiar gifts in the nature of man, knowledge and reason; the one commandeth, and the other obeyeth: these things neither the whirling wheel of fortune can change, neither the deceitful cavillings of worldlings separate, neither sickness abate, neither age abolish”. (Euphues- An Anatomy of wit”)

 The proverb “All is fair in love and war” has been attributed to him.

In the present poem Lyly mixes up legend with mythology for a desired effect. Campaspe was the mistress of Alexander the Great, and was such a beauty that many ancient painters painted her famously and she became a generic name for a mistress. Lyly was praising some court beauty through this poem. In the Elizabethan period cards was a great pastime for courtesans. And Cupid wanted to win a kiss from her at any cost but went on losing one stake after the other, until he becomes blind. In other words, Lyly subtly praises the court beauty that she had all the attributes of Cupid. But it doesn’t stop at that. Look at the punch line compliment … “If a God like Cupid was so desperate to win a favour but loses all his, what about a poor mortal like me?”

%d bloggers like this: