అనువాదలహరి

నాదగ్గరే గనక దేవతావస్త్రాలుంటేనా … WB Yeats

Image Courtesy: https://encrypted-tbn3.google.com

(ఈ కవితలో గొప్పదనం అలతి అలతి మాటలతో సుకుమారమైన భావనని అందించగలగడం. మొదటి నాలుగు పాదాల్లో అపురూపమైన దేవతా వస్త్రాల్నీ, వాటి రంగుల్నీ వర్ణించిన కవి, వాటిని దేనికి నియోగిస్తానంటాడు?  తన ప్రేయసి పాదాలక్రింద పరచడానికి. అంటే ఆమె తనకెంత ప్రీతిపాత్రమైనదో  చెప్పకనేచెబుతున్నాడు. కాని, తను పేదవాడు. అటువంటి అపురూపవస్త్రాలు తనదగ్గరలేవు. కానీ, అంతకంటే పదిలంగా తను ఆలోచనలతో, ఊహలలో రంగురంగులతో అల్లుకున్న కలలున్నాయి ఆమెకివ్వడానికి. వాటిని పరుస్తానంటున్నాడు తివాచీలా. కానీ, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అవి దేవతా వస్త్రాల్లాగే విలువైనవీ, అపురూపమైనవీ. తను నిర్లక్ష్యంగా నడిస్తే చిరిగో, విరిగో చెల్లాచెదరైపోతాయని హెచ్చరిక చేస్తున్నాడు.

ఈ కవిత విశేష జనాదరణ పొందటమేగాక చాలా సినిమాల్లో, బి.బి.సి. రేడియో కార్యక్రమాల్లో… చాలాచోట్ల వినియోగించబడింది. ప్రేమికులమధ్య తరచుగా బట్వాడా అయ్యే ఈ కవిత చాలాసార్లు వివాహాలలో  పాడబడిందికూడా.)

.

నా దగ్గరే గనక బంగారు, వెండి జలతారులతో

రచించి సింగారించిన దేవతా వస్త్రాలుండి ఉంటే

చీకటిలోని ముదురు, లేత రంగుల నీలవస్త్రాలూ

పగటిలో సగవన్నెగలిగిన ధవళ వస్త్రాలూ ఉండి ఉంటే

నీ పాదాలక్రింద పరిచి ఉండే వాడిని…

కాని,  నిరుపేదనైన నాదగ్గర ఉన్నవి కలలు మాత్రమే!

నా కలల తివాచీ పరచాను నువ్వు పాదాలు మోపడానికి

నెమ్మదిగా నడువుసుమీ! నువ్వు నడిచేది నా కలలమీద!

.

Image Courtesy: http://www.jssgallery.org/paintings/mugs/William_Butler_Yeats.jpg

విలియం బట్లర్ యేయ్ ట్స్.

.

He wishes for the cloths of heaven

.

Had I the heavens’ embroidered cloths,

Enwrought with golden and silver light,

The blue and the dim and the dark cloths

Of night and light and the half-light,

I would spread the cloths under your feet:

But I, being poor, have only my dreams;

I have spread my dreams under your feet;

Tread softly, because you tread on my dreams.

.

William Butler Yeats

(13 June 1865 – 28 January 1939)

Irish Poet and Playwright and Nobel Laureate for Literature, 1923.

This is one of his most famous poems, sweet and short. This is packed

with emotion, imagery and artistic expression.

[In Drumcliff, Co. Sligo, Ireland, in the churchyard where Yeats is buried, there’s a life-size sculpture of a man crouched over a bronze cloth, set in a marble base. Inscribed in the marble and bronze is this poem.

It is commonly believed that Yeats wrote this poem for his unrequited love Maud Gonne.

The poem appears  quoted in the movie “84 Charing Cross Road” and the sci-fi movie “Equilibrium“. And in the BBC Programme Ballykissangel – Series 3, there will be a touching scene in which a young priest, who falls in love with a young woman, and who even decides to leave his priesthood for her sake, finds his love electrocuted before he could express his mind to her and the poem is played in the background.

(Material Courtesy: wonderingminstrels.blogspot.in)]

8 thoughts on “నాదగ్గరే గనక దేవతావస్త్రాలుంటేనా … WB Yeats”

 1. చాలా బాగుందండీ! దేవతా వస్త్రాలంత విలువయిన తన కలలని అంటే తన జీవితాన్ని ఆమె పాదాల క్రింద పరిచాడనమాట చక్కని భావం.

  మెచ్చుకోండి

  1. అమ్మా రసజ్ఞా,
   ప్రేమలోని గొప్పదనం మనిషిని మెత్తన (mellow) చేస్తుంది. వ్యక్తి ఒక్కటొక్కటిగా తనకిష్టమైన వస్తువులతో పాటు, చివరికి తనని (the egoless self)ని కూడా అవతలి వ్యక్తికి / లక్ష్యానికి సమర్పించుకునేలా చెయ్యగలదు. అది భగవంతుని పట్ల అయితే భక్తిగా, వ్యక్తిపట్ల అయితే ప్రేమ లేదా ఆరాధనగా, సమాజం పట్ల అయితే దేశభక్తిగా మారుతుంది.
   స్త్రీకి పురుషుడిపట్లా పురుషుడికి స్త్రీపట్లా ఉండే అకళంకమైన ప్రేమ, ఇద్దరినీ ఉదాత్తులని చేస్తుంది. ఇక్కడ ఉదాత్తత కోల్పోవడం లోనే. ప్రేమ ఎప్పుడూ ఇవ్వడమేగాని పుచ్చుకోవడం కాదు. (అందుకే తల్లిప్రేమ అన్నిటికంటే ఉదాత్తమైనది.)
   అహంకారమంత నిలువెత్తు విల్లునైనా వంచగలిగింది నారి ఒక్కతే (టే).
   ఆశీస్సులతో

   మెచ్చుకోండి

 2. శర్మగారూ,
  ఐరిష్ సంప్రదాయం లోని విశేషమేమిటోగాని, అక్కడ రచయితలూ, నాటకకర్తలూ, కళాకారులూ అద్భుతమైన కృతులనీ, ఆకృతులనీ అందించారు. సముద్రం బహుశా వాళ్ళ భావనలకు తన గంభీరత్వాన్ని అద్దిందేమో అనిపిస్తుంది.
  అభివాదములతో

  మెచ్చుకోండి

 3. నమస్తే అండీ! నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం. మీ అనువాద లహరి… చాలా బాగుంది. మీ పుణ్యమా అని ,అపుడప్పుడు “అక్షరం” బ్లాగ్ లోను అనువాద కవిత్వాన్ని చదువుతుంటాను. కవిత్వం చదవడానికి చాలా సమయం పడుతుంది. పై పై చదివేసేవారు ఉన్నారు అనుకోండి. నెమ్మదిగా చదువుతా ఆకళింపు చేసుకుంటే..ఆ చైతన్యమే వేరు. :))). అందుకే మీకు చిన్నగా కామెంట్ పెట్టలేకపోయాను.

  మాకు పవర్ కట్ వల్ల,ఇంట్లో పనుల వత్తిడివల్ల మంచి పోస్ట్లు అనుకున్నవి కూడా చదవడం వీలు కుదరడం లేదు. నిద్రాదేవిని కనులమీద పెట్టుకుని చదువుతూ..వ్రాస్తూ.. ఉన్నాను.

  మీరు కవిత సంపుటి ప్రచురిస్తే ..తప్పక చెప్పగలరా? ధన్యవాదములు.

  మెచ్చుకోండి

  1. వనజ గారూ,
   కవిత్వం ఆస్వాదించడమే ముఖ్యం. అందులో భాగంగానే ఈ బ్లాగు ప్రారంభించాను. ఎవరైనా పాఠకులు చదివితే బ్లాగు రచయితకి బోనస్ క్రింద లెక్క. మీకు నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడవేసిన కవితలని కవితా సంపుటిగా ప్రచురించే ఉద్దేశ్యం ప్రస్తుతానికి లేదు. వేరే రెండు పుస్తకాలున్నాయి తీసుకు రావడానికి. పుస్తకప్రచురణ అంటే ఆదాయాన్ని ఆశించకుండా చెయ్యవలసిన సాహిత్య సేవ. దానికి తగిన వనరులు జమకూర్చుకోవడం కొంచెం సమయం తీసుకునే వ్యవహారం. కవితా సంపుటి తీసుకువస్తే, తప్పకుండా మీ వంటి అభిమానులకి ముందుగా తెలియజేస్తాను. మీ అభిమానానికి మరొక్క సారి కృతజ్ఞతలు.
   అభివాదములతో

   మెచ్చుకోండి

  1. అమ్మా మధురవాణీ,
   నిజమైన ఆరాధకుడు (భగవద్భక్తుడైనా, ప్రేమికుడైనా) ఎప్పుడూ తను చెయ్యలేకపోయిన వాటిగురించీ, తనకు లేకపోయిన వాటిగురించీ ఆలోచిస్తూ తనదగ్గర ఉన్న దాన్ని ఇచ్చే ఆలోచనలో ఉంటాడు. నిజమైన ప్రేమ భావన మనిషి ఎప్పుడూ ఉదాత్తునిగా చేస్తుంది. మోహం ఎప్పుడూ మనిషిని పతనావస్థలోకే తీసుకెళుతుంది.
   ఆశీస్సులతో,

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: