అనువాదలహరి

జోలపాట … రిచర్డ్ రౌలండ్స్

.

ఒడిలోన నా రాజు కూరుచున్నాడు
తమిదీర చనుబాలు త్రావుచున్నాడు
ఆ ప్రేమ  ఉసురునకు ఊపిరుల నూదు,
నా తనువు అణువణువు విశ్రాంతి నందు
పాడనా ఒక జోల చిన్ని నా మొలకా
ఏకైక ఆనంద హేతువుర కొడుకా.

.

చిన్నారి నీ బొజ్జ నిండారగానే
కన్నార నా మేన నిదురించవయ్య
తల్లి, దాదియె గాక, చిన్ని కన్నయ్య
నన్ను నీ ఊయలగ జేసుకోవయ్య
పాడనా ఒక జోల చిన్ని నా మొలకా
ఏకైక ఆనంద హేతువుర కొడుకా

.

నా కోరికలమేర కెపుడు నా పనులు
చక్కబడవుర తండ్రి నే నేమిజేతు
ఉత్తమోత్తమమైన సేవనము తప్ప
అరకొరగ నీ సేవ చేయలేనయ్య
పాడనా ఒక జోల చిన్ని నా మొలకా
ఏకైక ఆనంద హేతువుర కొడుకా

.

నేడు రేపనిగాదు ఏనాటికైన
నా తీరు ఏదైన, నీకు సేవికనె
నా సేవలెంతటి అల్పమ్ములైన
స్వయముగా నే జేసి తరియింతు తండ్రి
పాడనా ఒక జోల చిన్ని నా మొలకా
ఏకైక ఆనంద హేతువుర కొడుకా.

.

రిచర్డ్ రౌలండ్స్

.

దురదృష్ట వశాత్తూ ఈ కవి గురించి నమ్మదగిన సమాచారం లేదు.  అతను షేక్స్పియర్ కి సమకాలికుడు అన్న విషయం మినహా.

.

Lullaby …

Upon my lap my sovereign sits
And sucks upon my breast;
Meantime his love maintains my life
And gives my sense her rest.
Sing lullaby, my little boy,
Sing lullaby, mine only joy!

When thou hast taken thy repast,
Repose, my babe, on me;
So may thy mother and thy nurse
Thy cradle also be.
Sing lullaby, my little boy,
Sing lullaby, mine only joy!

I grieve that duty doth not work
All that my wishing would;
Because I would not be to thee
But in the best I should.
Sing lullaby, my little boy,
Sing lullaby, mine only joy!

Yet as I am, and as I may,
I must and will be thine,
Though all too little for thyself
Vouchsafing to be mine.
Sing lullaby, my little boy,
Sing lullaby, mine only joy!

.

Richard Rowlands / Richard Verstegen

English Poet, Translator whose biographical details are vague and doubtful.

1565–1630?

(For info about Richard Rowlands read:

http://en.wikisource.org/wiki/Rowlands,_Richard_%28DNB00%29)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: