అనువాదలహరి

హిమ పరాగము … రాబర్ట్ ఫ్రాస్ట్

(రాబర్ట్ ఫ్రాస్ట్ 139 వ జన్మదినం సందర్భంగా)

.

గన్నేరు చెట్టు మీంచి

ఒక కాకి నా మీదకి

మంచుధూళిని,

విదిలించిన తీరు…

నా మనస్థితిలోమార్పు తీసుకు వచ్చి,

రోజులో మిగిలిన భాగాన్ని,

దుఃఖిస్తూ గడపనవసరం లేకుండా

రక్షించింది

.

రాబర్ట్ ఫ్రాస్ట్ 

(March 26, 1874 – January 29, 1963)

అమెరికను కవి

Iamge Courtesy: http://upload.wikimedia.org

రాబర్ట్ ఫ్రాస్ట్

(1874 – 1963)

అమెరికను కవి

The Dust of Snow

.

The way a crow

Shook down on me

The dust of snow

From a hemlock tree

Has given my heart

A change of mood

And saved some part

Of a day I had rued.

.

Robert Frost

7 thoughts on “హిమ పరాగము … రాబర్ట్ ఫ్రాస్ట్”

 1. నందకిషోర్ గారూ,
  ఒకోసారి మనం దుఃఖంలో మునిగిపోయినపుడు ప్రపంచం గురించి తెలియదు. ఒక రకంగా “we shut ourselves from the world” అంటే ప్రపంచంతో మనకు ప్రమేయం లేనట్టు ప్రవర్తిస్తాం. ప్రకృతిలోని అందమైనవస్తువులు మనకు ఎంత ఆహ్లాదకరమైనవి ఉన్నా మనం వాటి ఉనికిని పట్టించుకోకుండా ప్రవర్తిస్తాం. కాని ప్రకృతి ఊరుకోదు. మన భుజాలు కుదిపిమరీ తన ఉనికి చాటుకుంటుంది. తన ఉనికి మనం గుర్తించేలా చేస్తుంది.
  అలాంటి సంఘటనే కవికి కలిగింది. తను విచారం లో మునిగిపోయినపుడు. చక్కని మంచు పొడిలారాలుతోంది గాని కవికి దాన్ని ఆశ్వాదించే స్థితిలో లేడు. కాని పైనుండి మంచు పొడిలా తనమీద రాలింది. ఒక్కసారిగాపడిన ధూళిలాంటి మంచు అతని ఆలోచనలకి అంతరాయం కలిగింది. పైకి చూశాడు. కాకి తనమీదకూడ రాలిన మంచుని దులుపుకుంటోంది. అతని ఆలోచనలకి అనుకోకుండా ఆటంకం diversion రావడంతో పాటు అతని మానసిక స్థితి (mood) కూడ మారిపోయింది. ఒక్క సారి తనమీదకప్పి ఉన్న దుఃఖపు మంచుపొరని తనుకూడ దులిపేసుకున్నాడు తెలియకుండానే. ఆ అనుభవం తనకు కలిగి ఉండకపొటే తను మరికొంతసేపు అలా విచారం లోనే గడిపేసి ఉండేవాడు. ఇప్పుడు తన దుఃఖపుపొరవీడిపోవడంతో తను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. అందుకే తన మానసిక స్థితిని విశ్లేషించుకోగలుగుతున్నాడు.
  దీన్నే శాస్త్రజ్ఞులు మనం ఒక System or Processలో ఉన్నంతకాలం మన ఆలోచనలు దానిలో అంతర్భాగమైపోతాయనీ, ఆ పరిథిదాటి ఆలోచించలేమనీ, ఆ స్థితిని ఆ System or Processని బయటనున్నవాడే గ్రహించగలడనీ అంటారు. మనం దుఃఖిస్తున్నప్పుడు we identify ourselves with grief. We are not even aware that we are grieving. But when the grief is vented out and subsides then we come to know of ourselves and our state of mind.
  ఇందులో మంచుని దుఃఖానికి ప్రతీకగా తీసుకుంటే, జీవితం లో దుఃఖం ఒక భాగమేననీ, దాన్ని దులిపేసుకుని మనపని మనం చేసుకుంటూ ఉండాలనీ కవిభావం. (నాకు అర్థమైనంతవరకు)
  అభివాదములతో

  మెచ్చుకోండి

 2. మూర్తి గారూ ఈ కవిత చదివాక నాకూ ఏమీ అర్ధం కాలేదు. మీరు కవిత గురించి చాలా బాగా వివరించారు. ఆ దుఃఖ౦ మేఘంలా కమ్ముకున్నప్పుడు వేరే ప్రపంచం తోచకపోవడం..అద్భుతంగా ఉంది భావం.

  మెచ్చుకోండి

  1. అమ్మా జ్యోతిర్మయీ,
   మన మామూలు అనుభవాలనుండే, ఒక తాత్త్విక దృక్పథాన్ని మలచగల శిల్పి రాబర్ట్ ఫ్రాస్ట్. అతనికి 4 సార్లు పులిట్జర్ ప్రైజు వచ్చిందని ఎక్కడో చదివాను. మొదటిసారి నేను నెహ్రూ గారి గురించి ఆయన మరణనంతర వ్యాసాలు చదువుతున్నప్పుడు నెహ్రూగారి టేబిలు మీద ఎల్లప్పుడూ రాబర్ట్ ఫ్రాస్ట్ కవిత: “Miles to go before I sleep” ఉండేదని చదివాను. ఆ వయసులో అర్థం కాలేదు గాని, తర్వాత తర్వాత తెలిసింది దాని అర్థం. అప్పటినుండీ అతని కవితలు చదువుతున్నప్పుడు మరింత శ్రద్ధపెట్టి చదవడం అలవాటుచేసుకున్నా.
   ఆశీస్సులతో,

   మెచ్చుకోండి

 3. నేను ఆలస్యంగా చూస్తున్నాను మీ సమాధానాన్ని. thanks a lot మూర్తి గారు..! ఎప్పటిలాగే ఒక poem చదివి ఆస్వాదించి తర్వాత మర్చిపోకుండా ఇందులో ఉన్న సత్యాన్ని అవగతం చేసుకొని మరింత ఆనందంగా బతకడానికి ప్రయత్నిస్తాను.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: