ఇంద్రజాలం… జెస్సిక హాగ్ దోర్న్

Image Courtesy: http://t2.gstatic.com

.

నాకుతెలిసిన కొందరున్నారు,

వాళ్ళు అందంగా ఉండడమే వాళ్ళ  నేరం.

వాళ్ళంటే నీకు ఎంత మోహం,

వివశత్వం కలుగుతుందంటే,

వాళ్ళకు దాసోహమనాలో,

ఇంకేమైనా చేసెయ్యాలో నీకు తెలీదు.

రెండవది నీ ఒంటికి మంచిది కాదు,

అది శాశ్వత మతిభ్రమణకు దారితీస్తుంది.

కనుక అటువంటి పరిస్థితులురాకుండా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

.

చీకటినుండి దూరంగా ఉండు.

వాళ్ళు గదిలో ఏ మూలనో నక్కి,

మనని ఎవరూ గమనించరులే అని దాక్కుని ఉండొచ్చు.

కాని వాళ్ళ అందమైన వెలుగే వాళ్ళని పట్టి ఇచ్చెస్తుంది.

.

పగటి నుండి దూరంగా ఉండు.

వాళ్ళు బహుశా నువ్వు ఊహించని క్షణంలో

వీధంట చాలా సీదాసాదాగా నడుస్తూ కనిపిస్తూనే

నీ హృదయాన్ని కొల్లగొట్టి,

నువ్వు ఇతర అవకాశాలకోసం కలవరించేలా చేస్తారు.

.

నిన్ను వెర్రెక్కించే సంగీతం నుండి దూరంగా ఉండు.

వాళ్ళు బహుశా దాన్ని సృష్టిస్తూ ఉండొచ్చు.

అంత అందంగా ఉన్నవాళ్ళు అలాంటి సంగీతం సృష్టించకుండా ఉండలేరు.

అది ఎంత ప్రమాదకరంగా పరిణమించవచ్చో అందరికీ తెలుసు.

.

గారడీలనుండి దూరంగా ఉండు…

ముఖ్యంగా మాటల గారడీలు.

మాటలు చాలా గమ్మత్తైనవి .

అవి సహజ భ్రాంతికారక వస్తువులని అందరికీ తెలుసు.

బహుశా వాళ్ళు అవే అంటున్నారేమో!

వాళ్ళు ఎంత లయబద్ధంగా కవితలల్లుతారంటే

నువ్వు వాటికి నృత్యంచెయ్యకుండా ఉండలేవు.

ఒక సారి మాటలకి నృత్యం చెయ్యడంప్రారంభిస్తే,

దాన్ని నువ్వు ఆపలేవు కూడా.

.

Image Courtesy: http://upload.wikimedia.org

జెస్సిక హాగ్ దోర్న్ (1947 – )

ఫిలిప్పినో – అమెరికను.

ఆమె, కవయిత్రి, కథా రచయితా, నాటక కర్తా, గేయరచయితా, రాక్ బ్యాండ్ కళాకారిణి.
Pet Food and Tropical Apparitions, Dogeaters అన్న ఆమె నవలికలు (తర్వాత నాటక రంగానికి అనువుగా తీర్చబడ్డాయి) అందులో ఆమె చేసిన ప్రయోగాలకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టాయి. Dangerous Music అన్నది ఆమె తొలి కవితా సంకలనం. ఆమె Where the Mississippi Meets Amazon, Mango Tango, The Holy Food, Tenement Lover అన్న నాలుగు నాటకాలేగాక రేడియోలకీ, రంగస్థలికీ ఇంకా ఛాలా వ్రాసింది.

పసి పిల్లలు అన్న మాట ఎక్కడా వాడకుండా, పైకి ప్రేమకవితలా కనిపింపజేస్తూ, మాటలు ఎంత భ్రాంతికారకాలో నిరూపించడానికా అన్నట్టు ఈ కవితని చక్కగా నిర్వహించిందని నా అభిప్రాయం.

.

Sorcery

there are some people i know
whose beauty
is a crime.
who make you so crazy
you don’t know
whether to throw yourself
at them
or kill them.
which makes
for permanent madness.
which could be
bad for you.
you better be on the lookout
for such circumstances.

stay away
from the night.
they most likely lurk
in the corners of the room
where they think
they being inconspicuous
but they so beautiful
an aura
gives them away.

stay away
from the day.
they most likely
be walking
down the street
when you least
expect it
trying to look
ordinary
but they so fine
they break your heart
by making you dream
of other possibilities.

stay away
from crazy music.
they most likely
be creating it
cuz
when you’re that beautiful
you can’t help
putting it out there.
everyone knows
how dangerous
that can get.

stay away
from magic shows.
especially those
involving words
words are very
tricky things.
everyone knows
words
the most common
instruments of
illusion.

they most likely
be saying them.
breathing poems
so rhythmic
you can’t help
but dance.

and once
you start dancing
to words
you might never
stop.

.

Jessica Tarahata Hagedorn 

(1947 – )

A Filipino-American Poet, Novelist, Dramatist, Short Story Writer, Performance Artist, Rock-and-Roll Band Leader and Filipino diva.

Her novel “Dogeaters” was critically acclaimed (later it was adapted to stage), and so were her poetry (Dangerous Music) and her plays (Where the Mississippi Meets Amazon, Mango Tango, The Holy Food, Tenement Lover etc. ).  She won American Book Award in 1981  for  her Novella Pet Food and Tropical Apparitions  and the book also won MacDowell Colony Fellowship for 1985.

In the present poem you can see how deftly she handles the subject with the apparent traits without ever making the explicit use of the words… babies or children.

(Text Courtesy : http://www.english.illinois.edu/maps/poets/g_l/hagedorn/online.htm)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: