ప్రభాత స్తుతి— ఫిల్లిస్ వ్హీట్లీ
నా సహ బ్లాగర్లకీ, నా బ్లాగుదర్శకులకీ, మిత్రులకీ శ్రేయోభిలాషులందరికీ
నందన నామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు.
మీ కందరికీ ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటు
సుఖశాంతులు కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నాను.
.
ఓ నవ కళాధిదేవతలారా!
నా కృషికి చేయూతనిచ్చి నా గీతాల్ని సంస్కరించండి;
ప్రాభాతదేవతకి నేను స్వాగతమాలపించాలి
శ్రుతిబధ్ధమైన పల్లవులు నా నోట జాలువార నీయండి
ప్రభాత దేవీ! నీకివే నా నమస్సులు.
నీవు ఒక్కొక్క అడుగూ ఖగోళాన్నధిరోహిస్తుంటే,
పవలు నిద్రలేచి తన కిరణాలని దశదిశలూ విస్తరిస్తోంది.
ప్రతి తలిరాకు పైన చిరుగాలి లాస్యం చేస్తోంది.
పక్షులు తమ కలస్వనాలు పునఃప్రారంభించి
సారించిన దృక్కులతో తమ వన్నెల రెక్కలు సవరించుకుంటున్నాయి.
చాయనొసగే ఉపవనాల్లారా! మీ పచ్చదనాల నీలినీడలు
నన్ను ఎండ తీవ్రతనుండి కాపాడుగాక;
నీ సఖులు ఆనందాగ్నిని రగుల్కొలిపేట్టుగా
ఓ వీణాపాణీ! ఏదీ, నీ కఛ్ఛపినొకసారి పలికించు!
ఓహ్! ఈ పొదరిళ్ళు, ఈ పిల్లగాలులు, ఈ వింతవన్నెల ఆకాశపు
సోయగాలకి నా మనసు పరవశంతో ఎక్కడికో తేలిపోతోంది.
అదిగో చూడు, తూర్పున దినరాజు!
అతని వెలుగురేకలు చీకట్లు తరుముతున్నాయి.
కాని, అమ్మో! అతని కిరణాలు అప్పుడే చురుక్కుమంటున్నాయి.
ఇంకా ప్రాంభించకముందే, ఈ గీతం ముగించాల్సి వస్తోంది.
.

మీకు నందన నామ ఉగాది శుభాకాంక్షలండీ..
మెచ్చుకోండిమెచ్చుకోండి
అమ్మా సుభ హాసినీ,
ఈ నందననామ సంవత్సరం మీకు ఆయురారోగ్యాలూ, మానసిక ఆనందాన్నీ కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆశీస్సులతో
మెచ్చుకోండిమెచ్చుకోండి