అనువాదలహరి

గెలుపు … ఎమిలీ డికిన్సన్

Image Courtesy: http://www.boloji.com

.

[ఈ మధ్య కొంతమంది మంత్రులు చేస్తున్న ప్రకటనలూ, మాట్లాడే విధానమూ చూస్తుంటే, ఈ కవితలో డికిన్సన్ చెప్పిన అభిప్రాయంలోని లోతైన భావన అవగతం అవుతుంది. మొన్న ఈమధ్య ఒకరాష్ట్రమంత్రిమండలి సమావేశంలో ఒక మంత్రిగారు “ఎవర్నడిగి సి.బి.ఐ. దాడులు జరుగుతున్నా” యని ముఖ్యమంత్రిని నిలదీశారట. అంటే, రాజ్యాంగము ఇచ్చిన అధికారంతో మంత్రిగా ప్రమాణస్వీకారము చేసినపుడు, ఏ రకమైన బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతమూ లేకుండా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నవాళ్ళే ప్రమాణాలకు విరుధ్ధంగా ప్రవర్తించినపుడు, అదే రాజ్యాంగపు ఇంకొక అంగం అవి బహిరంగపరచడమేగాక, నేరస్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, ఈ తప్పుడు పనులు చేసేవారి అనుమతి తీసుకుని మాత్రమే చెయ్యాలనడం ఎంత హాస్యాస్పదం. వాళ్ళు రాజ్యాంగాన్ని ఏవిధంగా పరిరక్షిస్తున్నట్టు? వాళ్లకి జండా స్ఫూర్తి తెలుసునని అనుకోగలమా?]

.

గెలుపు అన్నది, దాన్ని ఎన్నడూ ఎరుగనివాళ్ళు

అత్యంత మధురమైనదిగా పరిగణిస్తారు.

అమృతం విలువ తెలియాలంటే

అదిలేకుండా మనలేని అవసరం కలగాలి.


యుధ్ధరంగంలో ఓడిపోయి, చనిపోతూ,

దూరంనుండి వినిపిస్తున్న విజయోత్సాహాల గీతికలు

అతని చెవులకు కర్ణకఠోరంగా వినిపించి

వేదనపడుతున్న వీరుడు  చెప్పగలిగినంత స్పష్టంగా


ఈరోజు అధికారంతో పతాకావిష్కరణలు చేసి,

వందనాలు స్వీకరిస్తున్న వాళ్ళలో

ఒక్కడుకూడా విజయమంటే ఏమిటో

వివరించమంటే, వివరించలేడు.

.

ఎమిలీ డికిన్సన్

(డిశెంబరు 1830 – 15 మే 1886)

అమెరికను కవయిత్రి

.

Success

.

Success is counted sweetest

By those who ne’er succeed.

To comprehend a nectar

Requires sorest need.

.

Not one of the purple host

Who took the flag today

Can tell the definition,

So clear, of victory

.

As he, defeated, dying,

On whose forbidden ear

The distant strains of triumph

Break, agonized and clear.

.

Emily Dickinson

(December 10, 1830 – May 15, 1886)

American Poet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: