[ఈ మధ్య కొంతమంది మంత్రులు చేస్తున్న ప్రకటనలూ, మాట్లాడే విధానమూ చూస్తుంటే, ఈ కవితలో డికిన్సన్ చెప్పిన అభిప్రాయంలోని లోతైన భావన అవగతం అవుతుంది. మొన్న ఈమధ్య ఒకరాష్ట్రమంత్రిమండలి సమావేశంలో ఒక మంత్రిగారు “ఎవర్నడిగి సి.బి.ఐ. దాడులు జరుగుతున్నా” యని ముఖ్యమంత్రిని నిలదీశారట. అంటే, రాజ్యాంగము ఇచ్చిన అధికారంతో మంత్రిగా ప్రమాణస్వీకారము చేసినపుడు, ఏ రకమైన బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతమూ లేకుండా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నవాళ్ళే ప్రమాణాలకు విరుధ్ధంగా ప్రవర్తించినపుడు, అదే రాజ్యాంగపు ఇంకొక అంగం అవి బహిరంగపరచడమేగాక, నేరస్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, ఈ తప్పుడు పనులు చేసేవారి అనుమతి తీసుకుని మాత్రమే చెయ్యాలనడం ఎంత హాస్యాస్పదం. వాళ్ళు రాజ్యాంగాన్ని ఏవిధంగా పరిరక్షిస్తున్నట్టు? వాళ్లకి జండా స్ఫూర్తి తెలుసునని అనుకోగలమా?]