మంచుమరక … రాబర్ట్ ఫ్రాస్ట్

ఆ మూల నొక మంచుమరక ఉంది
గాలి ఎగరేసుకుపోతున్న కాగితాన్ని
వర్షం అదిమిపెట్టినట్టు;
నేను దాన్ని ఈపాటికి పోల్చుకుని ఉండాల్సింది.
.
కాగితం మీద ముద్రించిన అక్షరాల్లా
బురద అక్కడక్కడ మచ్చలా కనిపిస్తోంది.
దానిమీద ఏమిటి రాసుందో,
చదివుంటే, నాకిపుడు గుర్తు లేదు.
.
