ఒక్కతెనే… సారా టీజ్డేల్ Image Courtesy: http://bp2.blogger.com . నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పటికీ, ఎంతో అపురూపంగా చూచుకుంటున్నప్పటికీ, నేను నా సర్వస్వం ఇచ్చి, పుచ్చుకుంటున్నప్పటికీ, ఎందుకో, ఒక్కోసారి జీవితం పై విరక్తి కలుగుతోంది. . ఈ వేసారిన వివర్ణ విశ్వశృంగాగ్రంపై ఒక్కతెనే నిలబడి నట్టు ఒంటరితనం ఆవహించి, పురులువిప్పుకుంటున్న మంచు నా చుట్టూ పొరలుతూ, తలపై అనంత రోదసి తెరుచుకుంటున్నట్టు అనిపిస్తుంది. . భూమ్యాకాశాలు అదృశ్యమై, ప్రకృతిలో లీనమై, ఒంటరితనమెరుగని వారి ప్రశాంతత నే ననుభవించకుండా నా అస్తిత్వపు అహంకారం అడ్డుగా నిలుస్తుంది. . సారా టీజ్డేల్ . Alone . I am alone, in spite of love, In spite of all I take and give— In spite of all your tenderness, Sometimes I am not glad to live. I am alone, as though I stood On the highest peak of the tired gray world, About me only swirling snow, Above me, endless space unfurled; With earth hidden and heaven hidden, And only my own spirit’s pride To keep me from the peace of those Who are not lonely, having died. . Sara Teasdale Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 7 వ్యాఖ్యలుమార్చి 15, 2012