అనువాదలహరి

ఔష్విద్ తర్వాత … ఆన్ సెక్ష్టన్ (Anne Sexton)

[2009 IPS Batchకి చెందిన నరేంద్ర కుమార్ సింగ్ విధినిర్వహణలో ఉండగా,  మొన్న గురువారం 8మార్చి2012 న గనులమాఫియా అతని మీదనుండి ట్రాక్టరు తోలి పొట్టనబెట్టుకుంది. నిజాయితీగా పనిచెయ్యడమే అతని పాపం. అది నిజాయితీగల అధికారులకి వాళ్ళ వార్నింగు అయితే,నిజాయితీగల అధికారులకు, ప్రజలు తాము వాళ్లకి అండగాఉన్నామన్న  విశ్వాసాన్ని కలిగించలేకపోతే, ఉన్న ఆ ఒకటి రెండు తులసి మొక్కలు కూడా అధికారానికి దాసోహం అనవలసి విషమ పరిస్థితి వస్తుంది. అవినీతిమీద యుధ్ధం చెయ్యాలంటే మౌనం పనికి రాదు. ఇది ఖచ్చితంగా నాజీల ఘోరాలకు సాక్షులుగా నిలిచిన ఔష్విద్(Auschwitz)లోని అరాజకాన్ని గుర్తుచేస్తుంది. రెండవ ప్రపంచసంగ్రామం తర్వాత జరిపిన Nuremberg Trials లో ఔష్విద్ మొదటి కమాండెంట్ Rudolf Höss “2.5 మిలియన్ మందిని గాస్ ఛాంబర్ కి పంపగా, మరో 0.5 మిలియన్ మంది రోగాలవల్లా, తిండిపెట్టక మాడ్చడం వల్లా చనిపోయా”రని చెప్పాడు. అవి అతిశయోక్తులుగా కొట్టి పారేసి, ఆ అంకెల్ని మొత్తం 3 మిలియనునుండి 1.3 మిలియనుకి అధికారగణాంకాలు సవరించి అందులో 90 శాతం యూదులుగా గుర్తించారు) ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలు తమగొంతు వినిపించకపోయినా, అధికారులు తమబాధ్యతలను నిర్వర్తించక పోయినా జరిగే పరిణామాలను సోదాహరణంగా ఎప్పటికప్పుడు చరిత్ర మనకి చూపిస్తోంది.

అందుకోసమే ఈ రోజు ఏన్ సెక్ష్టన్ (Anne Sexton) కవిత  “ఔష్విద్ తర్వాత”  సమర్పిస్తున్నాను.

ఇది నరేంద్ర కుమార్ సింగ్ కి నా అశ్రునివాళి. His death should not go unnoticed or his dedication to duty unhailed and unsung.)  మీరు కూడా మీ గొంతు వినిపించండి.

ఈ కవితలో ఆన్ సెక్ష్టన్ (Anne Sexton) కొన్ని చిత్రమైన మాటలు ప్రయోగించింది… మృత్యువు చెయ్యవలసిన పనిని మనిషి చేసేస్తుంటే తనకి పనేంలేక గోళ్ళు గిల్లుకోవడం, ముడ్డి గోక్కోవడం వంటివి. ఈ మాటలు అసభ్యంగా కనిపించినా, మనిషిచేసిన పనియొక్క అసభ్యత తీవ్రతను సూచించడానికి ఆమె ఈ మాటలు వాడినట్లు నే భావిస్తాను.

గమనిక: మనం సరిగా అవగాహన చేసుకోక పోతే “దేముడు వినకూడదని నేను కోరుకుంటున్నాను” అన్న చివర మాటలు ముందు చెప్పిన వాటికి వ్యాఘాతంలా కనిపిస్తుంది. దేముడువినకూడదని కోరుకోవడంలో ఆంతర్యం, అటువంటిమనిషిని సృష్టించినందుకు దేముడికి  సిగ్గువేస్తుంది కాబట్టి అతనికి ఆ యిబ్బంది తప్పించడానికి అని మనం అర్థం చేసుకోవాలి]

                                                            Auschwitz Holocaust                                                   Hungarian Jewish mothers, children,     elderly and infirm sent to the left after ‘selection” They will be murdered in the gas chamber soon after (May 1944)

.

గాలం లాంటి నల్లని ఆవేశానికి

నేను దొరికిపోతాను.

.

ప్రతి రోజూ,

ప్రతి నాజీ,

ఉదయం 8 గంటలకి,

తన ఫలహారానికి,

ఒక పసిపాపని,

తన పెనం మీద దోరగా వేపుకుంటాడు.

.

మృత్యువు చాలా నిర్లిప్తంగా చూస్తుంటుంది

గోళ్ళ మధ్య మట్టి తీసుకుంటూ.

.

మనిషి పరమదుర్మార్గుడు…

ఈ మాట నేను గట్టిగా అంటాను.

మనిషి ఒక పువ్వు.

కాలికింద నలిపేయవలసినది.

ఈ మాటలు నేను అరిచి మరీ అంటాను.

మనిషి ఒక బురద పక్షి.

ఈ మాటలు నేను అరిచి మరీ అంటాను

.

మృత్యువు నిర్లిప్తంగా చూస్తుంటుంది…

ముడ్డి గోక్కుంటూ.

.

జీవం ఉట్టిపడే పాదాలతో,

అద్భుతమైన చేతులతో….

మనిషి ఒక దేవాలయం కాదు…

ఒక పశువులకొట్టం.

ఇక

ఎన్నడూ, ఎన్నడూ, ఎన్నడూ, ఎన్నడూ, ఎన్నడూ

మనిషికి ప్రకృతిలో  ఏవిధమైన ఆధిక్యతా లేకుండుగాక!

మనిషికి సృజనశక్తి  లేకుండు గాక!

మనిషికి ఏ శాసనాధికారాలూ లేకుండుగాక!

మనిషి  తలెత్తుకోలేక ఉండుగాక!

ఈ మాటలు నేను అరిచి మరీ అంటాను.

.

కాని ఈ మాటలు దేముడు వినకూడదని కోరుకుంటున్నాను.

.

After Auschwitz

.

Anger,
as black as a hook,
overtakes me.
Each day,
each Nazi
took, at 8: 00 A.M., a baby
and sauteed him for breakfast
in his frying pan.

And death looks on with a casual eye
and picks at the dirt under his fingernail.

Man is evil,
I say aloud.
Man is a flower
that should be burnt,
I say aloud.
Man
is a bird full of mud,
I say aloud.

And death looks on with a casual eye
and scratches his anus.

Man with his small pink toes,
with his miraculous fingers
is not a temple
but an outhouse,
I say aloud.
Let man never again raise his teacup.
Let man never again write a book.
Let man never again put on his shoe.
Let man never again raise his eyes,
on a soft July night.
Never. Never. Never. Never. Never.
I say those things aloud.

I beg the Lord not to hear.

Anne Sexton

(9 November, 1928 – 4 October, 1974)

(Text Courtesy: http://www.poemhunter.com/poem/after-auschwitz/)

%d bloggers like this: