నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను? ( సానెట్ 43) … ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్

Photo Courtesy:
https://www.poets.org/poetsorg/poet/elizabeth-barrett-browning
(ఈ రోజు మార్చి 6, 2012… ఆమె 207వ జయంతి సందర్భంగా)
[ఈ కవిత ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందంటే కొంతమంది Shall I compare thee to a Summer’s day అన్న షేక్స్పియర్
సానెట్ 18 ని గుర్తుతెచ్చుకుని ఇదికూడా అతనిదే అనుకునేంత. నిజానికి ఇది ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ తన
ప్రేమచిహ్నంగా భర్త రాబర్ట్ బ్రౌనింగ్ కి వ్రాసిన 45 సానెట్లలో 43వది. ఈ సానెట్ లకి ఆమె ఇచ్చిన నర్మగర్భమైనపేరు
Sonnets from the Portuguese అని. అది చదివితే ఇవేవో పోర్చుగీసు భాషనుండి అనువదించినవని ప్రజలు అనుకుందికి.
కానీ అసలురహస్యం, బ్రౌనింగ్ ఆమెని ముద్దుగా My Little Portuguese అనిపిలవడం.
ఈ కవిత మామూలు ప్రేమకవితలలాంటిదికాదు. ఇందులో చిత్రమైన ఉపమానాలున్నాయి. మనం సరిగా గమనించకపోతే
వాటిని తప్పిపోతాం. నాకు చిన్నప్పుడు బుడుగు కార్టూనొకటి గుర్తొస్తుంది. నీకు తెలిసిన పెద్ద సంఖ్య చెప్పరా బుడుగూ
అని ఎవరో అడిగితే, వాడు ఆలోచించి ఆలోచించి మూ….డు. అంటాడు. అలాగే చిన్నపిల్లల్ని నీకు అమ్మంటేనో
నాన్నంటేనో ఎంత ఇష్టం అని అడిగితే, వాళ్ళు చేతులుబారజాపి… “ఇంత ఇష్టం” అనడం మనకి అనుభవమే. దాన్ని
ఇక్కడ ఎలిజబెత్ 3-dimensional spaceలో చెబుతుంది. అలాగే, Ends of being, Passion put to use in my old griefs,
Childhood faith, అన్న పదబంధాలు చాలా జాగ్రత్తగా గమనించి ఆనందించవలసినవి.]
.
నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను? లెక్క పెట్టనీ…
ఊర్థ్వ అథోలోకాలూ, దిగంతాల అంచులని నా
ఆత్మ అందుకోగలిగినంత విశాలంగా; నువ్వు కనుమరుగైనపుడు
నా ఆలోచనల, ఇంద్రియానుభూతుల అవధులు సంభావించగలిగినంత;
రేయింబవళ్ళు నీ సాన్నిధ్యం నాకివ్వగలిగిన లౌకికానందం మేరకేగాక,
నువ్వు నీహక్కుగా ననుకోరుకునేంత స్వేచ్ఛగా,
పొగడ్తలకి ఒదగనంత స్వచ్ఛంగా,
నా గత విషాదాలతలపుల్లో మగ్గినంత గాఢంగా,
చిన్నతనపు విశ్వాసాలంత అచంచలంగా,
ఒకప్పుడు నా అభిమాన హీరోలను అరాధించినంత నిరవధికంగా,
నా శ్వాసలో, చిరునవ్వులో, కన్నీటిలో రూపింపగలిగినంత స్పష్టంగా,
భగవంతుడనుగ్రహిస్తే, తనువు వీడినతర్వాతకూడా
నిన్ను మిన్నగా ప్రేమిస్తూనే ఉంటాను.
.
ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్
.
How Do I Love Thee (Number 43)
.
How do I love thee? Let me count the ways.
I love thee to the depth and breadth and height
My soul can reach, when feeling out of sight
For the ends of Being and ideal Grace.
I love thee to the level of everyday’s
Most quiet need, by sun and candlelight.
I love thee freely, as men strive for Right;
I love thee purely, as they turn from Praise.
I love thee with the passion put to use
In my old griefs, and with my childhood’s faith.
I love thee with a love I seemed to lose
With my lost saints,—I love thee with the breath,
Smiles, tears, of all my life!—and, if God choose,
I shall but love thee better after death.
.
Elizabeth Barrett Browning
(6 March 1806 – 29 June 1861)
English Poet.
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి