నెల: మార్చి 2012
-
మనసు ఆమెను ఎలా మరచిపోగలదు? … అజ్ఞాత కవి
(ప్రేమ సర్వకాలీనం. అయితే చెప్పేవిధానం, ఉపయోగించే ప్రతీకలలోని కొత్తదనం మనసు ఆకర్షించుకుంటుంది. ఈ కవితలో ప్రేమికుడు తన ప్రేమని నిరాకరించే స్త్రీని మరచిపోదామనుకుంటూ పడిన ఊగిసలాటని అజ్ఞాతకవి ఎంత అందంగా వ్యక్తపరచేడో గమనించండి. ) . ఆమె సొగసైన చేతులు పట్టుకుని, పదేపదే ప్రార్థిస్తూ, ఎన్నిసార్లు ఆమె ప్రేమని అర్థించలేదు? అయినా సరే, నా ప్రేమ తృణీకరింపబడింది మనసా! ఇక ఆమెను విడిచిపెట్టు, ఇక ఆమె మనసు మారదు (మనసు) అయితే ఆమెను విడిచిపెడుదునా? ఓహ్! వొద్దు.…
-
“పేకాట — ముద్దులూ” … జాన్ లిలీ (1553–1606)
(సమకాలీనతనీ, ప్రాచుర్యంలోఉన్న ఇతిహాసాన్నీ జోడించి జాన్ లిలీ రాసిన బహుచమత్కారమైన కవితల్లో ఇది ఒకటి. స్త్రీ అందాన్ని వర్ణించడానికి ఇంతకుముందు ఎవ్వరూ చెయ్యని ప్రయోగం చేశాడు. గురజాడవారి కన్యాశుల్కంలో మధురవాణి పేకాడడం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకని లిలీ పాత్ర Campaspe ని (ఆమె అలెగ్జాండరు ది గ్రేట్ ప్రియురాలు, అపురూప సౌందర్యవతి. ఆమెని చిత్రకారులు చిత్రాలలో ఎంత ఎక్కువగా బంధించారంటే ఆమె పేరు అందమైన స్త్రీలకు రాజదర్బారుల్లో ఒక పర్యాయపదమైపోయింది)నేను మధురవాణిగామార్చి, మన పురాణాలలోని మన్మధుడికి…
-
నాదగ్గరే గనక దేవతావస్త్రాలుంటేనా … WB Yeats
(ఈ కవితలో గొప్పదనం అలతి అలతి మాటలతో సుకుమారమైన భావనని అందించగలగడం. మొదటి నాలుగు పాదాల్లో అపురూపమైన దేవతా వస్త్రాల్నీ, వాటి రంగుల్నీ వర్ణించిన కవి, వాటిని దేనికి నియోగిస్తానంటాడు? తన ప్రేయసి పాదాలక్రింద పరచడానికి. అంటే ఆమె తనకెంత ప్రీతిపాత్రమైనదో చెప్పకనేచెబుతున్నాడు. కాని, తను పేదవాడు. అటువంటి అపురూపవస్త్రాలు తనదగ్గరలేవు. కానీ, అంతకంటే పదిలంగా తను ఆలోచనలతో, ఊహలలో రంగురంగులతో అల్లుకున్న కలలున్నాయి ఆమెకివ్వడానికి. వాటిని పరుస్తానంటున్నాడు తివాచీలా. కానీ, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అవి…
-
నారీ ప్రశంస … రాబర్ట్ మానింగ్ ఆఫ్ బూర్న్.
Image Courtesy: http://upload.wikimedia.org “I will not be separated from my husband. As we have lived, so we will die: together.”… Ida Straus, wife of Isidor Straus the Founder of Macy’s (The Departmental stores fame) … on the fateful day, 15th April 1912 shortly before The Atlantic sank. And both of them died together, the man…
-
జోలపాట … రిచర్డ్ రౌలండ్స్
. ఒడిలోన నా రాజు కూరుచున్నాడు తమిదీర చనుబాలు త్రావుచున్నాడు ఆ ప్రేమ ఉసురునకు ఊపిరుల నూదు, నా తనువు అణువణువు విశ్రాంతి నందు పాడనా ఒక జోల చిన్ని నా మొలకా ఏకైక ఆనంద హేతువుర కొడుకా. . చిన్నారి నీ బొజ్జ నిండారగానే కన్నార నా మేన నిదురించవయ్య తల్లి, దాదియె గాక, చిన్ని కన్నయ్య నన్ను నీ ఊయలగ జేసుకోవయ్య పాడనా ఒక జోల చిన్ని నా మొలకా ఏకైక ఆనంద హేతువుర కొడుకా .…
-
హిమ పరాగము … రాబర్ట్ ఫ్రాస్ట్
(రాబర్ట్ ఫ్రాస్ట్ 139 వ జన్మదినం సందర్భంగా) . గన్నేరు చెట్టు మీంచి ఒక కాకి నా మీదకి మంచుధూళిని, విదిలించిన తీరు… నా మనస్థితిలోమార్పు తీసుకు వచ్చి, రోజులో మిగిలిన భాగాన్ని, దుఃఖిస్తూ గడపనవసరం లేకుండా రక్షించింది . రాబర్ట్ ఫ్రాస్ట్ (March 26, 1874 – January 29, 1963) అమెరికను కవి రాబర్ట్ ఫ్రాస్ట్ (1874 – 1963) అమెరికను కవి The Dust of Snow . The way a…
-
ఇంద్రజాలం… జెస్సిక హాగ్ దోర్న్
. నాకుతెలిసిన కొందరున్నారు, వాళ్ళు అందంగా ఉండడమే వాళ్ళ నేరం. వాళ్ళంటే నీకు ఎంత మోహం, వివశత్వం కలుగుతుందంటే, వాళ్ళకు దాసోహమనాలో, ఇంకేమైనా చేసెయ్యాలో నీకు తెలీదు. రెండవది నీ ఒంటికి మంచిది కాదు, అది శాశ్వత మతిభ్రమణకు దారితీస్తుంది. కనుక అటువంటి పరిస్థితులురాకుండా జాగ్రత్తగా ఉండడమే మంచిది. . చీకటినుండి దూరంగా ఉండు. వాళ్ళు గదిలో ఏ మూలనో నక్కి, మనని ఎవరూ గమనించరులే అని దాక్కుని ఉండొచ్చు. కాని వాళ్ళ అందమైన వెలుగే వాళ్ళని పట్టి ఇచ్చెస్తుంది.…
-
Death in a Hospital … Bolloju Baba
. A soul liberated from body shackles with a swan song. . “Woe betided me, Mother! How could you leave us, having lived your whole life for us?…” A son was grieving effusively with matchless histrionics, Who till yesterday treated her like a housemaid . On the countenances of other patients fear spread like an…
-
ప్రభాత స్తుతి— ఫిల్లిస్ వ్హీట్లీ
నా సహ బ్లాగర్లకీ, నా బ్లాగుదర్శకులకీ, మిత్రులకీ శ్రేయోభిలాషులందరికీ నందన నామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు. మీ కందరికీ ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటు సుఖశాంతులు కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నాను. . ఓ నవ కళాధిదేవతలారా! నా కృషికి చేయూతనిచ్చి నా గీతాల్ని సంస్కరించండి; ప్రాభాతదేవతకి నేను స్వాగతమాలపించాలి శ్రుతిబధ్ధమైన పల్లవులు నా నోట జాలువార నీయండి ప్రభాత దేవీ! నీకివే నా నమస్సులు. నీవు ఒక్కొక్క అడుగూ ఖగోళాన్నధిరోహిస్తుంటే, పవలు నిద్రలేచి తన కిరణాలని దశదిశలూ విస్తరిస్తోంది.…
-
గెలుపు … ఎమిలీ డికిన్సన్
. [ఈ మధ్య కొంతమంది మంత్రులు చేస్తున్న ప్రకటనలూ, మాట్లాడే విధానమూ చూస్తుంటే, ఈ కవితలో డికిన్సన్ చెప్పిన అభిప్రాయంలోని లోతైన భావన అవగతం అవుతుంది. మొన్న ఈమధ్య ఒకరాష్ట్రమంత్రిమండలి సమావేశంలో ఒక మంత్రిగారు “ఎవర్నడిగి సి.బి.ఐ. దాడులు జరుగుతున్నా” యని ముఖ్యమంత్రిని నిలదీశారట. అంటే, రాజ్యాంగము ఇచ్చిన అధికారంతో మంత్రిగా ప్రమాణస్వీకారము చేసినపుడు, ఏ రకమైన బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతమూ లేకుండా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్నవాళ్ళే ప్రమాణాలకు విరుధ్ధంగా ప్రవర్తించినపుడు, అదే రాజ్యాంగపు ఇంకొక అంగం అవి…