రోజు: ఫిబ్రవరి 27, 2012
-
వీడ్కోలు … లార్డ్ టెన్నిసన్
. పరుగెత్తు, పరుగెత్తు చలువ సెలయేరా! వడివడిగ వడివడిగ కడలికడకు మెచ్చుకుని కెరటాలు కౌగిలిస్తాయిలే! ఈ ఏటితీరాన నా కాలిగురుతులు కనుమరగులైపోవు నింక అనవరతము. పరుగెత్తు నెమ్మదిగ పరుగెత్తు శాంతముగ పసరు మైదానాలలో పిల్ల సెలయేరుగా పచ్చికబయళ్ళలో పొరలు జీవన నదిగ నీ నీటితీరాల నా కాలిగురుతులు కనరావు కన రావు ఇంక అనవరతము. ఇక్కడొక “ఆల్డరు” నిట్టూర్పు విడిచితే అక్కడొక “ఆస్పెన్” విలవిలవణుకులే అటు యిటు తిరుగాడు ఆ నల్ల తుమ్మెదా ఝుమ్మనుచు పాడులే ఇంక అనవరతము.…