అనువాదలహరి

నా భయాలు … జాన్ కీట్స్

Image Courtesy: http://www.janniefunster.com

ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు
తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను
అక్షరరూపంలో పుస్తకాలలోకి నా కలం అనువదించేదాకా
బతకనేమోనన్న భయం నన్నావహిస్తోంది.

నక్షత్రాచ్ఛాదిత నిశీధి ముఖం లోకి చూసినపుడు
దొరలాడిన మబ్బు దొంతరల శృంగారకేళీ విలాసము
తలుచుకుంటే, అదృష్టదేవత ఇంద్రజాలముచేసినా
జీవితంలో ఆ ఛాయ లనుకరించగలనని అనుకోను.

ఓ ఈక్షణిక సుందరీ!
నిన్ను మళ్ళీచూసేభాగ్యం నాకు లేదని
తలుచుకున్నప్పుడల్లా, ప్రతిఫలాపేక్షలేనిప్రేమ
సమ్మోహనశక్తిని ఆస్వాదించలేకున్నాను.

అందుకే, ఈ విశాల విశ్వసాగర తీరాన ఏకాకిగా నిలబడి
ప్రేమకీ కీర్తిప్రతిష్టలకీ కడసారి వీడ్కోలు చెబుతున్నాను.


.

Image Courtesy: http://upload.wikimedia.org

జాన్ కీట్స్

ఇంగ్లీషు రొమాంటిక్ మూవ్ మెంట్ లో రెండవతరానికి ప్రాతినిధ్యం వహించే కవులలో జాన్ కీట్స్ మొదటివాడు. అతని జీవితం 25 సంవత్సరాలపాటే కొనసాగినా, అనారోగ్యం కారణంగా అతని సాహిత్య వ్యయసాయం               6 సంవత్సరాలకే పరిమితమయినా, ఆతని జీవితకాలం లో కేవలం 200 కాపీలకు మించి అతని కవిత్వం అమ్ముడుపోకపోయినా, తన స్నేహితులకు తన జ్ఞాపకార్థం విలువైన సాహిత్య కృషి మిగల్చలేదన్న విచారంతో చనిపోయినా, తర్వాత సుమారు రెండువందల సంవత్సరాలు గతించినా ఆతని కవిత్వం విశ్వవ్యాప్తంగా అభిమానుల్ని తెచ్చిపెడుతూనే ఉంది, పరిశోధనలకు పురికొల్పుతూనే ఉంది. అతని అసంతృప్తికరమైన సాహిత్య శేషమే ఇలా ఉంటే, అతను పదికాలాలపాటు బ్రతికి, తనకు మనసుకు నచ్చినట్టుగా వ్రాసి ఉండి ఉంటే, దానివిలువ ఎలా ఉండేదన్నది శేషప్రశ్న. ఈ కవితలో మృత్యు చాయలో ఉన్న అతను తన భయాలు చెబుతూ, కీర్తిప్రతిష్టలు, అవ్యాజమైన ప్రేమ అనుభవించలేని వాడికి వాటివిలువ శూన్యం అని చెబుతున్నాడు.

.

When I Have Fears

.

When I have fears that I may cease to be

Before my pen has glean’d my teeming brain,

Before high-piled books, in charactery,

Hold like rich garners the full ripen’d grain;

When I behold, upon the night’s starr’d face,

Huge cloudy symbols of a high romance,

And think that I may never live to trace

Their shadows, with the magic hand of chance;

And when I feel, fair creature of an hour,

That I shall never look upon thee more,

Never have relish in the faery power

Of unreflecting love;–then on the shore

Of the wide world I stand alone, and think

Till love and fame to nothingness do sink.

.

John Keats

31 October 1795 – 23 February 1821

A remarkable poet of the English Romantic Movement who lived for just 25 years, whose literary career spanned 6 years of writing and 4 years of publication and a measly 200 copies of his poetry sold in his life time and whose life was cut short cruelly by Consumption (TB), an incurable disease those days. Pity is that he died with a lot of dissatisfaction about his poetry  thinking that he did not leave any worthwhile work for his friends to remember.  If this corpus of work he left behind, in his opinion, did not mean anything to him, but the generations afterwards and the literary faculty found it outstanding, it is anybody’s guess what would have been the quality of his work had he lived longer and produced to the best of his satisfaction. The world at large is unfortunate.

In this poem he speaks his fears about his impending death and the futility of love and fame when they largely remain fairy.

6 thoughts on “నా భయాలు … జాన్ కీట్స్”

    1. శర్మగారూ,
      బాగుందని చెప్పడం కొన్ని సందర్భాలలో అవసరమే. ఒక తరానికి బాగా నచ్చి బహుళప్రచారం లో ఉన్నవి తర్వాతి తరాలకి తలకెక్కకపోవడం అనుభవమే. ప్రతి తరం గొప్పకవిత్వాన్ని పునర్మూల్యాంకనం చేసుకుంటూ దానిలోని విశ్వజనీనతని ఆశ్వాదించగలిగినపుడే కవితకి మనుగడ. లేకపోతే అదికూడా ఒక relic అయి కూచుంటుంది కవి అవశేషాలతో పాటు.
      అభివాదములు.

      మెచ్చుకోండి

  1. మనసారా యేడ్వలేని అసహాయతని అధిగమించటం చాలాసేపే పట్టినా – చివరకు మసక మసక చూపుతో రాస్తున్నాను. చిక్కని కవితానువాదం. మీ కవితననుసరించి వచ్చిన మరికొన్ని జ్ఞప్తులు.

    గదిలో బందీగా మరణానికి వెరుస్తూ రాసుకున్నది కావచ్చు – తిలక్ “అదృష్టాధ్వగమనం”:

    “ఇప్పటికీ ఈ చీకటి మొగలో
    నిలిచి పాడుతున్న నా కోసం
    కుబుసం విప్పిన గోధుమ వన్నె తాచు
    మొగలి పొదల నుండి పడగ విప్పి ఆడుతుంది
    ప్రాగ్దిశా సుందరి ఖండ చంద్ర పరిదీపిత కపోలాల హసిస్తుంది
    నా గుండెలపై శుక్రతార కిరణం సూటిగా వచ్చి వాలుతుంది.”

    —–

    “జీవితం అంటే నిర్వచనం ప్రకారం సంతోషంగా మరణించటానికి తయారు అయే స్థితి. ఎంత సంతోషంగా జీవిస్తున్నా కూడా ఒక రోజుకు తాను మరణిస్తాననే భయం పీడిస్తూనే వుంటుంది…” – సి. బి. రావు గారు అందించిన సంజీవదేవ్ గారి “మరణశయ్య” వ్యాసం నుంచి (http://deeptidhaara.blogspot.com/2011/05/blog-post_04.html)

    మెచ్చుకోండి

  2. ఉషారాణిగారూ,
    ఈ కవిత అనువాదం చేస్తున్నప్పుడు, కీట్స్ రోమునగరానికి వెళ్ళడమూ, అక్కడ అతను పడిన మరణవేదనా, ఆఖరి క్షణాలగురించి చదివేను. మీ రన్నారే మనసారా ఏడ్వలేని నిస్సహాయత… అది అక్షరాలా అనుభవించాను. గట్టిగా ఏడిస్తే నాకేదో అయిపోయిందని, అర్థరాత్రి ఈ ఏడుపులేమిటని భార్యా పిల్లలూ కోపగిస్తారని భయం. కాని ఆ బాధ చదువుతున్నంతసేపూ మౌనరోదనే.
    అతని ప్రేయసి Fanny Brawne (ప్రధానం కూడా అయింది) వాళ్ల స్నేహం ఏడాది దాటకపోయినా, 6 సంవత్సరాలు Mourning పాటించిందనీ, అతను చనిపోయిన 12 ఏళ్ళవరకు పెళ్లిచేసుకోలేదంటే ఇద్దరూ ఒకర్నొకరు ఎంతగాఢంగా ప్రేమించుకున్నారో, ఆసన్నమౌతున్న మృత్యువు గురించి అతను రాసిన చివరి మాటలవెనక గాఢతనీ, నిజాయితీని, బాధని మనం అంచనావేసుకోవచ్చు.
    తిలక్ ని మరొక్కసారి గుర్తుచేసినందుకూ, సంజీవదేవ్ గారి వ్యాసానికి లింకు ఇచ్చినందుకూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
    అభివాదములతో

    మెచ్చుకోండి

    1. బాబాగారూ,
      మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. కీట్స్ జీవితంలో విషాదంలో విషాదం అతను స్వయంగా డాక్టరు, తన తమ్ముడికి క్షయ సోకితే తను అతనికి సేవలు చేశాడు. అయితే ఆ క్రమంలోనే, వంశపారంపర్యంగా వస్తున్న ఆ వ్యాదికి దొరికిపోయాడు. చివరికి అతను డాక్టరుగా కొనసాగడానికి కావలసిన వృత్తివిద్యానైపుణ్యంతోపాటు తగిన విద్యార్హతా, మందులు తయారుచేసి అమ్మడానికి కావలసిన అనుమతులూ పొందినప్పటికీ, కవిగానే కొనసాగాలని నిర్ణయించుకుని, తన విద్య తనకి ఉపయోగపడకపోగా, అతని వైద్యుడు చేసిన కొన్నిపొరపాట్లవల్ల తనువు చాలించవలసి వచ్చింది. Heard melodies are sweet, unheard melodies are sweeter అనుకుని, దొరికినమట్టుక్కి అతని సాహిత్యం ఆస్వాదించి ఆనందించడమే మనం చెయ్యగలిగినది.
      అభివాదములతో,

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: