I Have No Nat… Afsar . I am some limb Lingering under a hollow head You never told me Where I originated from Who brought me up or Why I was partitioned exactly in ’47 Cutting off, or appropriating each limb of God Else, looting them for yourself, You did not leave anything for me. I am an ethereal shadow A soul disposed of secretly Over the wall I am wandering about countries… Thought each one of them my own and Each station and every door mine But, no bumblebee gives out my address. Some vermilion hands Ploughed away the land under my feet The dust from those temple towers knocked down Piles up on my fluttering body entombing it. Palling my eyes with eyelids Everybody rends my cool body Snatching his pound of flesh… My body is now an Al Kabir! I am dropping down dead on the gory Bombay streets Unable to identify my own cadaver. I am an enigmatic junction, passing over which Nobody knows where he is heading to . I am an inhabitant of this vacuous world, for truth But, always an exile wherever I might live. Sinking one half of me in darkness, I illusion the other half is all bright Diving into my inner vortices I kill the soul of Time each second I ask for no kingships and no kin-shares I have no language To ask for my veins deracinating them . I am satisfied with some semblance of shelter on earth No matter there’s no room to bury me beneath. The land I live is sanctimonious to me, pray! Don’t cast me off somewhere, like a desecrated cloth. Not with forty-seven I ask you to divide me by myself My rejoices, my wails My insults and my suspicions These molestation and murdering of me Are not mine, and mine alone… but yours too. Please don’t abominate the amniotic fluid of my mother. You foes who divide and rule! You can’t sever me into two. Nor, can you blow my pupils off. . Afsar . (Written on some Dec 6) . నా కేజన్మభూమీ లేదు! శూన్యం తలకింద నేనేదో వొక అవయవాన్ని. నే నెక్కణ్ణించిపుట్టానో ఎలాపెరిగానో ’47 దగ్గిరే ఎలా విరిగానో మీరెవరూ చెప్పలేదుగా – దేవుడిఅంగాంగాన్నిపంచుకొని కోసుకొనీ లేదంటే దోచుకోనీ వెళ్ళినమీరంతా నా కేమీ మిగల్చలేదుగా – నేను శరీరంలేని నీడని ఏ గోడమీంచో రహస్యంగా పారేయబడిన ఆత్మని దేశదేశాలూ పట్టుకుతిరుగుతున్నాను అన్నిదేశాలూ నావే అనుకుంటున్నాను ఊరూరూ ఇల్లిల్లూ నాదినాదనే అనుకుంటున్నాను ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదు. ఇక్కడెక్కడో నాకాళ్ళకిందనేలని కుంకుమచేతులు కోసుకెళ్ళిపోయాయి. అక్కడెక్కడోకూలిన గోపురాల దుమ్మంతా రెపరెపలాడ్తున్ననాదేహమ్మీద సమాధికడుతోంది. రెప్పలవస్త్రాలుకళ్ళకి కప్పి నా వొంటిమీదిచల్లనిమాంసాన్ని ఎవరెవరోఅపహరిస్తున్నారు. నావొళ్ళువొకఅల్కబీర్! నాకు నేనే గుర్తుతెలియనిశవాన్నయి బొంబాయీనెత్తుటిరోడ్లమీదకుప్పకూలిపోతున్నాను. నే నెవ్వరికీ అంతుదొరకని కూడలిని నామీంచి ఎవరెటువెళ్తారో తెలీదు. నిజంగా నేనుశూన్యలోకవాసిని ఎక్కడయినాఎప్పుడయినా ప్రవాసిని. నాలో సగాన్నిచీకట్లోముంచి ఇంకోసగం అంతావెలుగేవెలుగు అనుకుంటున్నభ్రమని. నాలోపలివలయాల్లోకి నేనేదూకి కాలంఆత్మని క్షణక్షణం హత్యచేస్తున్నవాణ్ని. అర్ధరాజ్యాలూ అంగరాజ్యాలూ కోరను నా నాడుల్నినాకు కోసిమ్మనడానికి ఏ భాషాలేనివాణ్ని. శవమయిదాక్కోడానికివున్నాలేకపోయినా తలదాచుకోవడానికి చారెడునేల చాలంటాను. ఉన్నచోటే పవిత్రమనుకుంటున్నవాణ్ని ఎక్కడెక్కడోఆంటీముట్టనిబట్టలా విసిరేయొద్దంటాను. నలభైఏడుతోకాదు నాతోనన్నేభాగించమంటాను. నా నవ్వులూ నా ఏడ్పులూ నా అవమానాలూ, నా అనుమానాలూ నా మానభంగాలూ హత్యలూ అన్నీమీవికూడా అంటాను. నాతల్లివుమ్మనీరుని వుమ్మిచెయ్యొద్దంటాను. విభజించిపాలించే నా శత్రువులారా, నన్నెవరూ రెండుగా చీల్చలేరు. నా కనుపాపల్నిఎవరూపేల్చలేరు. . అఫ్సర్ (ఒక డిసెంబరు ఆరు కి రాసిన కవిత…) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 4 వ్యాఖ్యలుఫిబ్రవరి 21, 2012