అనువాదలహరి

ఒక పురాతన అభినయం … Edna St. Vincent Millay

Image Courtesy: http://www.shmoop.com

[గమనిక: ఈ కవితని బాగా అర్థం చేసుకోవాలంటే ఇందులో ప్రతీకలుగా ప్రస్తావించిన రెండు పాత్రలగురించి కొంత తెలియాలి. పెనిలోప్, యులిస్సిస్ … ఈ ఇద్దరూ హోమరు మహాకవి వ్రాసిన గ్రీకు మహాకావ్యంలోని రెండు పాత్రలు.  ట్రోజను యుధ్ధంలో నిమగ్నమైన భర్త యులిస్సిస్ గురించి భార్య పెనిలోప్ కి 20సంవత్సరాలపాటు ఏ సమాచారమూ ఉండదు. అసలు బ్రతికిఉన్నాడో లేదో కూడా తెలియదు. కాని ఆమె భర్త వస్తాడని అలా సముద్రం వైపు నిరీక్షిస్తూ చూస్తుంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆమెను పెళ్ళిచేసుకుందికి చాలా మందికి ముందుకు వస్తారు. వాళ్లని తప్పించుకుందికి ఆమె తను నేస్తున్న వస్త్రం పూర్తయేదాకా ఎవరినీ వివాహం చేసుకోనని, భర్తమీది ప్రేమతో ఉదయం రోజల్లా వస్త్రం నేస్తుండడం, రాత్రల్లా మళ్ళీ ఏ పోగుకి ఆ పోగు విప్పేస్తూ, కాలవ్యాపనం చేస్తుంది. యులిస్సిస్ మాత్రం ఆమెపట్ల అంత విశ్వాసము ప్రకటించక బలహీనతకు లొంగిపోతాడు. అతను తిరిగివచ్చిన తర్వాత ఏర్పాటైనసభలో అతను నిజాన్ని చెప్పకుండాఉండడానికి అనువుగా ఆవేశంతో కన్నీళ్ళు తుడుచుకుంటాడు. పెనిలోప్ నిజంగా భర్తకోసం కన్నీళ్ళు కారిస్తే, యులిస్సిస్ మొసలికన్నీళ్ళు కార్చేడని వ్యంగ్యంగా రచయిత్రి ఇందులో సూచిస్తుంది]

.

నా చీరకొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటున్నప్పుడు అనుకున్నాను:
నేనే నేమిటి? ఇంతకుముందు పెనిలోప్ కూడా ఇలాగే కళ్ళుతుడుచుకుందని.
ఒకసారి కాదు. అనేక సార్లు.  రోజల్లా అల్లిక అల్లుతూ,
రాత్రయేసరికల్లా దాన్ని పోగుపోగూ విప్పదీస్తూ ఉండడం అంత చిన్న విషయమేం కాదు.
చేతులు పీకెడతాయి, మెడనరాలు పట్టేసినట్టుంటుంది,
తెల్లారి లేచి, ఎన్నేళ్ళక్రిందటో ఇల్లువీడిన భర్త ఇంకా ఇంటికిరాకపోయేసరికి,
ఎప్పుడువస్తాడోకూడా తెలియక, ఆ అల్లిక పని అలాకొనసాగుతూనే ఉండాలని తెలిసినపుడు
ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చి కన్నీళ్ళు పెల్లుబుకుతాయి.
అంతకంటే చేసేదేమీ ఉండదు.

.

నా చీర కొనకొంగుతో కన్నీళ్ళుతుడుచుకొంటున్నప్పుడు అనుకున్నాను:
ఈ ఎదురు చూపులూ కన్నీళ్ళూ ఇవాళిటివీ నిన్నటివీ కావు…
అనూచానంగా వస్తున్నవే… పూర్వపు గాధలున్నాయి…
ప్రామాణికమైన… గ్రీకు చారిత్రక ఆధారాలు…
యులిస్సిస్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు…
కాకపోతే తన హావభావప్రకటనకి…
దానర్థం తనముందున్న సభికులకి,
బాధతో తనగొంతు పూడిపోయిందని చెప్పడానికి.
తను పెనిలోప్ నుండి నేర్చుకున్నాడు…
పెనిలోప్ నిజంగా ఏడ్చింది.

ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలే.

(ఫిబ్రవరి 22, 1892 – అక్టోబరు 19, 1950)

అమెరికను కవీ, నాటకకర్తా, స్త్రీవాద రచయిత్రి.

.

( Note: You can appreciate the poem if you have a slight hint of the two characters mentioned here in allusion. Penelope and Ulysses are characters from Homer’s Epic, Odyssey. Involved in Trojan war, he will be away from home for 20 years and there is no information to his wife of his whereabouts, not even whether he is alive or dead. Meanwhile there are many suitors seeking her hand but she remains faithful and hopeful of Ulysses’ return and so sets the condition that she would marry after she finishes off the weaving work at hand. She works all through the day weaving the cloth and at night undoes it all to pre-empt its completion. While she really waits for him and wails for him in anguish, Ulysses succumbs to temptation on his way home and becomes unfaithful to her. He sheds crocodile tears in front of the assembled throng to avoid speaking the truth.

There is also a subtle criticism of our volition in believing statements not on their merit, but only on authority. That is why the protagonist of this poem makes reference to the story in the first place.)

.

An Ancient Gesture

.

I thought, as I wiped my eyes on the corner of my apron:
Penelope did this too.
And more than once: you can’t keep weaving all day
And undoing it all through the night;
Your arms get tired, and the back of your neck gets tight;
And along towards morning, when you think it will never be light,
And your husband has been gone, and you don’t know where, for years.
Suddenly you burst into tears;
There is simply nothing else to do.

And I thought, as I wiped my eyes on the corner of my apron:
This is an ancient gesture, authentic, antique,
In the very best tradition, classic, Greek;
Ulysses did this too.
But only as a gesture,—a gesture which implied
To the assembled throng that he was much too moved to speak.
He learned it from Penelope…
Penelope, who really cried.

.

Image Courtesy: http://upload.wikimedia.org

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American Lyrical Poet, Playwright and Feminist.

%d bloggers like this: