రోజు: ఫిబ్రవరి 18, 2012
-
నీతో ఒక గంట చాలు… సర్ వాల్టర్ స్కాట్.
. నీతో ఒక గంట చాలు! ప్రాభాతసంధ్య తూరుపు నీలితెరలపై బంగారు వన్నెలు అద్దుతున్నప్పుడు నీతో ఒక్క గంట చాలు! ఇక రోజులో రాబోయే కష్టాలనీ, కన్నీళ్ళనీ శ్రమనీ, సంక్షోభాల్నీ బాధలూ, వాటి జ్ఞాపకాలనీ మరిచిపోకుండా నన్నేదీ కట్టిపడెయ్యలేదు! నీతో ఒక గంట చాలు! మండువేసవి మధ్యాహ్న సూర్యుడు ప్రచండంగా ప్రకాశిస్తున్నప్పుడు చల్లని చెట్టునీడకంటే, సేదదీర్చే కొండవాలు కంటే పొలంలో నమ్మకంగా పాటుపడుతున్న రైతుకి శ్రమకుతగ్గ ప్రతిఫలం ముట్టజెప్పగలిగిన దెవ్వరు? నీతో ఒక్క గంట చాలు! ఆహ్!…