ఎవరికీ తెలియకుండా,
ఎవరిదృష్టీ పడకుండా,
నన్నిలా బతకనీండి;
ఎవరి విషాదాశృలూ నాకై రాలకుండా,
నన్ను మరణించనీండి;
నేనెక్కడున్నానో తెలియబరిచే ఏ శిలాఫలకం లేకుండా
ఈ ప్రపంచం నుండి జారుకో నీండి.
18వ శతాబ్దపు ఇంగ్లీషు సాహిత్య వాతావరణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనముద్ర వేయించుకోగలిగిన ప్రతిభాశాలి అలెగ్జాందర్ పోప్. ముఖ్యంగా ఈ నాటికీ తను చేసిన హోమరు అనువాదానికీ, Heroic Couplet ల పునః ప్రయోగానికీ, Rape of the Lock అన్న వ్యంగ్య హాస్య నాటకానికీ, Essay on Man and Essay on Criticism అన్న రెండు అపురూపమైన, కవితలరూపంలో ఉన్న సునిశిత విశ్లేషణాత్మకమైన వ్యాసాలకీ, Dunciad అన్న అతని Mock-Epic (వ్యంగ్య-కావ్యం) కీ సాహిత్య వ్యాసాలలో పేర్కొనబడుతున్నాడు.
చిన్నతనం లోనే అంకురించిన వ్యాధి అతన్ని కృంగదీసి పొట్టివాడుగానూ (4 అడుగుల 6 అంగుళాలు), గూనివాడుగానూ చేసినా; ఆనాటి రాజకీయ వాతావరణం కేథలిక్కు అయిన అతనికి విద్యాభ్యాసం దూరం చేసినా, స్వయంకృషితో పట్టుదలతో అనేకభాషలు అభ్యసించిన ధీశాలి పోప్.
ఆ రోజుల్లో విగ్ లకీ టోరీలకీ తీవ్రమైన విభేదాలున్నప్పటికీ, హేమాహేమీలైన రెండుపక్షాల కవులూ నాటకకర్తలతో పరిచయాలు నెరపిన వ్యక్తి. Richard Steele, Joseph Edison లతో స్నేహం పరాకాష్టలో ఉన్నప్పుడు, రోమనుసామ్రాజ్యం చరిత్రలో సీజరును ఎదిరించి నిలవగలిగిన ధైర్యశాలి, స్వాతంత్ర్యంకోసం తన ప్రాణాలు అర్పించిన దేశభక్తుడు Cato జీవితం ఆధారంగా ఆనాటి సంక్లిష్ట రాజకీయ పరిస్థితులను ప్రతిఫలిస్తూ, ఎడిసన్ వ్రాసిన అదే పేరుగల నాటకానికి Prologue వ్రాసేడు అంటే అతని ప్రతిభ ఎంతగా గుర్తింపబడినదో తెలుసుకో వచ్చు.
.
Ode on Solitude
.
Happy the man, whose wish and care
A few paternal acres bound,
Content to breathe his native air,
In his own ground.
Whose herds with milk, whose fields with bread,
Whose flocks supply him with attire,
Whose trees in summer yield him shade,
In winter fire.
Blest! who can unconcern’dly find
Hours, days, and years slide soft away,
In health of body, peace of mind,
Quiet by day,
Sound sleep by night; study and ease
Together mix’d; sweet recreation,
And innocence, which most does please,
With meditation.
Thus let me live, unseen, unknown;
Thus unlamented let me dye;
Steal from the world, and not a stone
Tell where I lye.
.
Alexander Pope
(21 May 1688 – 30 May 1744)
One of the key figures of 18th century english literary scene, Pope is still remembered for his translation of Homer, his satirical verses, Heroic Couplet, Rape of the Lock, Essay on Man and Essay on Criticism and The Dunciad.
While his Catholic lineage deprived him of formal education, his numerous health problems stunted his growth to only 4 feet 6 inches; yet, they could not dent his spirit, his humour and he became a polyglot by dint of his untiring efforts.
He kept very illustrious company of both Whigs and Tories. And at the height of his best relations, he wrote Prologue to Joseph Edison’s most successful play … The Cato, based on the life of Roman Hero of the same name who vehemently opposed Caesar and his despotic ways.
@మూర్తి గారు,
నాకు ఈ కవిత చూసిన తరవాత రవీంద్రుని కవిత గుర్తుకొచ్చింది. where the mind is without fear. ఈ కవితని మీ సరళ అనువాదాన్ని నా దగ్గర ప్రముఖంగా కనపడేలా పెట్టుకుంటున్నా, అనుమతించగలరు.
ధన్యవాదాలు.
శర్మగారూ,
Merchant of Venice కోర్టు సీనులో పోర్షియా అంటుంది:
The quality of mercy is not strain’d,
It droppeth as the gentle rain from heaven
Upon the place beneath. It is twice blest:
It blesseth him that gives and him that takes.
అలాగ, అనువాదం కూడా, మూల రచయితతో పాటు, అనువాదకుణ్ణికూడా ఆశీర్వదిస్తుంటుంది.
ఇది మీ ఆశీస్సుగా భావిస్తాను.
అభివాదములతో,
అద్బుతమైన కవితను అందించారు సార్.
కొన్ని జ్ఞాపకాలు.
(సుమారు ఇరవై యేళ్ళ క్రితం నాటి మాట ఇది)
ఈ కవిత మాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండేది. మా ఇంగ్లీషు మాష్టారు శ్రీ చిరంజీవేశ్వర రావు గారు ఈ కవితను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ, ఎన్నో ఉదాహరణలు ఇస్తూ చెప్పారు. ఈ కవితలోని ఆఖరి వాక్యాలు నాలో బలంగా నాటుకొన్నాయి. ఆ ఫీల్ ఇప్పటికీ నేను తెచ్చుకోగలుగుతున్నాను.
దానికి బహుసా ఒక కారణం ఆ తరువాత పీరియడ్ ఎగ్గొట్టి ఇంగ్లీషు నోటు బుక్కులో నే వ్రాసుకొన్న ఈ కవితే కావొచ్చు.
మలి సంధ్య
పెద్దవి కాని చిన్నవి కాని అవసరాలేమీ లేవు
సాకారం చేసుకోవాల్సిన కలలేమీ లేవు
సాధించాల్సిన ఆశయాలేమీ లేవు
ఏ ప్రపంచము లేని చోట వశించాలన్నది తప్ప
జాలి చూపులు, ఓదార్పు మాటలు,
పెద్దగీత తో పోల్చడాలు, ధైర్యవచనాల కు దూరంగా,
ఆలోచనలతోటి, జ్ఞాపకాలతోనూ
గతంతోను ఒంటరిగా వశించాలన్నది తప్ప.
బాబా గారూ,
మీ గురువుగారు అంత ఎమోషనల్ గా ఫీల్ అయారు అంటే, అందులో ఆయన సంస్కారం ఇమిడి ఉంది.
ఈ కవిత నిజానికి పోప్ తన జీవితంలో పడిన ఆవేదనలలోంచి వచ్చింది. ఈ ఆశలూ ఆశయాలూ, వేదనలూ, కీర్తిప్రతిష్టలూ మనిషి బ్రతికి ఉన్నంతవరకూ వెన్నాడుతూనే ఉంటాయి. కాని అవి అశాశ్వతములనీ, నిజమైన జీవితం అతి సాధారణమైనా, జీవించడం లోనే ఉందనీ తెలిసిన తర్వాత ఈ ప్రపంచపు కీర్తి, కిరీటాలకూ మనకూ ఏ సంబంధమూ లేదని స్పష్టం అవుతుంది.
There is beauty in anonymity. మన కర్తవ్యం మనం చేసుకుని నిశ్శబ్దంగా నిష్క్రమించడంలోని ఆనందం బహుశా ఆ సత్యం గ్రహించినతర్వాత అవగతమౌతుందేమో!
మీ చేత ఆ వయసులో ఒక మంచి కవిత వ్రాయడానికి మీ గురువుగారు ప్రేరణ కలిగించారంటే, ఆయన నిజంగా చరితార్థుడు. వారికి తప్పకుండా పాదాభివందనం చెయ్యాల్సిందే.
మీ కవిత చాలా బాగుండడమే కాదు, దాని శీర్షిక ఇంకా చాలా బాగుంది. మనః పూర్వక అభినందనలు.
అభివాదములతో,
జ్ఞాపకాలనీ, అనుభవాలనీ తవ్వి తీస్తున్నారు మీ అనువాదాలు;సేకరణల కలనేతతో. కృతజ్ఞతలు. బాబా గారికి మాదిరే మా మేరీ మాణిక్యం, సలేషియా, మార్గరెట్ ఇలా మరికొందరు టీచర్స్, లెక్చరర్స్. ఇలా పద్యాల ప్రపంచంలోకి విసిరేసేవారు – ఏడ్చుకుని, నవ్వుకుని, ఎమోషనల వరదల్లో మునిగి తేలి, ఒక్కోసారి, అసలు వీళ్ళే రాసారా అన్నంత భ్రమలో మునిగి అరిచి వాదించి మరీ నెమరేసిన కవితలు మళ్ళీ ఇక్కడ తేలుతున్నాయి, ఈ ముంపులో ఎమౌతామో. కవి సమయాల్లో రాసుకున్నానెపుడో “అడవి” స్వచ్ఛత లో మునిగినవాడే మనిషని –
అభయావాసం ఇంకెక్కడవుంది?
అడవి నా పుట్టినిల్లు,
అడుగడుగున నేస్తాలు,
పచ్చికబైళ్ళు పట్టుకంబళ్ళు,
పూలసరాలు ఆభరణాలు,
లేతరెమ్మలు వీవెనలు,
గాలిస్వరాలు వేణువులు,
ఎగిరే రెక్కల కచ్చేరీలు,
కదిలే పాదాల నాట్యాలు,
స్వస్థానాన నేను నవ్వే మనిషిని
– మూసేసిన టాకీసు లో మొదటాటలు మరొక్కసారి గుర్తుకొస్తున్నాయి. ధన్యవాదాలు.
ఉషారాణిగారూ,
మనం రాసిన నాటకంలో నైనా, కొన్నిపాత్రలకి బాధలు కల్పించక తప్పవు. కనుక మీకు నా సవినయ విన్నపం “టాకీసు” మూసివేయవద్దు. అది మీ తాత్త్విక చింతనా పరిథిలోనిది.
Emotions మనని ఆవేశిస్తాయి గాని అవి మనం కాదు. కష్టమూ సుఖమూ ఆనందమూ మనం అనుభవిస్తాము. కాని ఆవే మనం కాదు,కాలేము, కాకూడదు.
చాలా చక్కని కవిత మీరు గుర్తుతెచ్చుకుని నా బ్లాగులో ఉంచినందుకు ధన్యవాదాలు. అపూర్వమైన భాషాభిమానాన్ని రగిల్చి మిమ్మల్ని పద్యప్రపంచం లోకి తోసిన మేరీ మాణిక్యం, సలేషియా, మార్గరెట్ లాంటి టీచర్లు అందరికి నా నమోవాకాలు.
అడవిలాంటి ఈ శరీరంలో మనిషి బందీగా ఉంటూ జైలుశిక్ష అనుభవిస్తున్నట్టు భావిస్తాడో, స్వతంత్రంగా బ్రతకడానికి దీనిని మించిన సాధనం లేదని ఆనందిస్తూ ప్రకృతికి కృతజ్ఞతతో ఉంటాడో… ఎవరి choice వారిది.
ధన్యవాదాలతో.
స్పందించండి