మృత్యుల్లేఖము … వాల్టర్ డి ల మేర్

Image Courtesy: http://idiva.com

.

ఆర్య నిదురించునిచట సౌందర్య రాశి
లలితపద, నిరతహృదయోల్లాసి యామె,
“మాపు సీమ”ను లావణ్య రూపు రేఖ
కీరుగలవారు లేరు నా ఎరుక మేర.

.

వాయు సొబగులు, రూపలావణ్య మడగు
యెంత అపురూప మెంత దురంతమైన
కాలగతియంతె! ఎవరు వాక్కొనగ గలరు
మిత్తి ఎంతటిపోడుముల్  మట్టిగలుపు!

.

వాల్టర్ డి ల మేర్

(25 April 1873 – 22 June 1956)

ఇంగ్లీషు కవీ, నాటకకర్తా, కథా రచయితా అయిన వాల్టర్ డి ల మేర్  తన ప్రఖ్యాతినందిన ఉపన్యాసం “Rupert Brooke and his intellectual imagination” లో ప్రతిపాదించిన  మనుషులలోని రెండురకాల ఆలోచనా స్రవంతుల ద్వారా ఎక్కువగా నేడు గుర్తింపబడుతున్నాడేమో! బాల్యపుటూహలు(Childlike) సత్యమే సౌందర్యమని భావిస్తాయనీ, అవి సహజాతమూ (intuitive),  ఆగమవాదములూ (inductive) అయితే, కౌమారపుటాలోచనలు(Boylike) సౌందర్యమే సత్యమని భావిస్తాయనీ, అవి తార్కికమూ, నిగమితములూ (Deductive) అని ప్రతిపాదించేడు.  అంతేగాక, యౌవనారంభవేళలో, ఈ బాల్యపుటాలోచనలలోకి బాహ్యప్రపంచపు  నిరంతరచొరబాటు వలన, అవి నత్త గుల్లలోకి ముడుచుకుపోయినట్టు, లోనికి ముడుచుకుపోవడముగాని, లేదా, శక్తిమంతముగా ఎదిగి బాహ్యప్రపంచాన్ని ఎదుర్కోడానికి తగిన సన్నధ్ధత సమకూర్చుకోవడంగాని చేస్తాయని ప్రతిపాదించేడు.

“Memoirs of the Midget” అన్న అతని నవలా, 100 కు పైగా రాసిన అతని దయ్యాల కథలలో “Seaton’s Aunt”, “Out of the Deep” అన్న కథలూ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. “Songs of Childhood” తో పాటు అతను 5 కవితా సంకలనాలూ, 10కి పైగా కథా సంకలనాలూ, 5 నవలలూ వెలువరించాడు.

.

An Epitaph
.

Here lies a most beautiful lady,
Light of step and heart was she;
I think she was the most beautiful lady
That ever was in the West Country.

But beauty vanishes, beauty passes;
However rare — rare it be;
And when I crumble,who will remember
This lady of the West Country.

.

Walter de la Mare

(25 April 1873 – 22 June 1956)

English poet, Short Story Writer and Novelist  De la Mare, apart from his short stories and ghost stories for children, is perhaps most remembered for his lecture, “Rupert Brooke and the Intellectual Imagination,” wherein he delineated two kinds of imagination in people: the childlike and the boylike… the childlike imagination being visionary and “intuitive and inductive” whereas the Boylike imagination is “logical and deductive”. He also claimed that if ‘truth is beauty’ for childlike imagination, for boylike, it is the other way. He proposed that the increasing intrusions of the external world upon the mind would frighten the childlike imagination to retire it into a shell, like a shocked snail, and from then on the boyish imagination flourishes. By adulthood the childlike imagination would either retreat for ever or would grow bold enough to face the real world.

“మృత్యుల్లేఖము … వాల్టర్ డి ల మేర్” కి 4 స్పందనలు

  1. నిత్య సత్యం, తెలుసుకోలేక భ్రమల్లో జీవిస్తాం. అనువాదం అద్భుతం.

    మెచ్చుకోండి

  2. Sarmagaru,

    So true. But that is the beauty of life. There is perhaps no greater temptation than life itself.

    with best regards

    మెచ్చుకోండి

  3. మూర్తిగారికి
    నమస్తె
    అనువాదం కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తోంది. కొన్ని వాడుకలోలేని పదాలను వాడారు.
    మీటర్ కోసం ప్రయత్నించారా?
    చందోబద్దంగా వ్రాసారా?
    మాతృక సరళంగానే ఉన్నది కదా?
    తెలుసుకోవాలని ఉంది.
    వివరిస్తారని ఆశిస్తూ
    భవదీయుడు
    బొల్లోజు బాబా

    మెచ్చుకోండి

    1. బాబా గారూ,
      మీ రన్నది నిజమే! ఇందులో కొన్ని వాడుకలోలేని పదాలను వాడవలసి వచ్చింది. మీటరుకోసం ప్రయత్నించేను. మూలం చాలా సరళంగా ఉండడంవలన, నా అనువాదం నాకు చాలా పేలవంగా కనిపించింది. బాగా తేలిపోయింది. నాకే నచ్చలేదు, ఇక ఇతరులకేం నచ్చుతుందని, మీటరులో అనువదిద్దామని ప్రయత్నించాను. But beauty vanishes, beauty passes; However rare — rare it be; అన్న మాటలు మీటరులో అంత క్లుప్తంగానూ, effectiveగానూ చెప్పగలమేమోననిపించింది. నా ఛందో, వ్యాకరణ, భాషాజ్ఞాన పరిమితులవల్ల అది సాధ్యపడలేదనుకొండి, ఒక్క నాలుగు లైన్లలోకి కుదించడం మినహా. అయితే, ఇందులో మంచి తెలుగుపదాలు వాడడానికి అవకాశం చిక్కింది. “కీరు” అన్న మాట త్యాగరాజస్వామివారి “ప్రక్కలా నిలబడి” అన్న కీర్తనలో కనిపిస్తుంది, చుక్కలరాయుడిని మించిన అందం సీతాదేవి మోములో ఉంది అన్న భావనలో. నాకు గట్టిచిక్కు తెచ్చిపెట్టిన మాట West Country. అది క్లుప్తంగా ఉండాలి, భావాన్ని అందజెయ్యాలి. ఆలోచించి ఆలోచించి దాన్ని చివరికి “మాపు సీమ” అని అనువదించేను. మాపు కి సాయంత్రం, రాత్రి అన్న అర్థాలున్నాయిగదా అన్న ఆలోచనతో, పడమటిదిక్కును సూచించడానికి. మంచి కవితను వదల్లేక, మరీ పేలవమైన నా అనువాదాన్ని ఉంచలేక, సందిగ్ధంలో, సరే, మీటరు చాలకపోయినా, భావం అందుతుందిగదా అని ఇది పోస్టుచేశాను.
      సాటి అనువాదకునిగా, నా అవస్థని ఈపాటికి అర్థంచేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను.
      చక్కని విశ్లేషణాత్మకమైన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
      అభివాదములతో,

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: