రోజు: ఫిబ్రవరి 13, 2012
-
పాటా – బాణమూ … HW లాంగ్ ఫెలో. అమెరికను కవి
. నేను గాలిలోకి ఒక బాణం విసిరా అదెక్కడో పడిపోయుంటుంది; తెలీదు ఎందుకంటే, అదెంత జోరుగా దూసుకెళ్ళిందంటే దాని వేగాన్ని నా కళ్ళు అనుసరించలేక పోయాయి నేను గాలిలోకి ఒక పాట ఆలపించేను. అదికూడా ఎక్కడో పడిపోయింది; తెలీదు. అంత చురుకైన కళ్ళెవడికున్నాయి గనక పాట వేగంతో దృష్టి మరలించడానికి? చాలా చాలా కాలం తర్వాత, విరిగిపోకుండా సింధూరవృక్షానికి గుచ్చుకుని ఆ బాణం దొరికింది. మొదటినుండి చివరిదాకా పొల్లుపోకుండా ఆ పాట నా మిత్రుడి గళంలో మారుమ్రోగడం విన్నాను. .…