అనువాదలహరి

వాలిన పిట్ట … ఎమిలీ డికిన్సన్

Image Courtesy: http://t2.gstatic.com

.

నే నడిచే దారిలోకి ఒక పిట్ట వచ్చి వాలింది
దాన్ని నే చూసేనని గమనించలేదది
వానపాముని పట్టి, రెండుముక్కలుచేసి,
దాన్ని అలాగే ఆరగించింది పచ్చిగా

.

ఒక గడ్డిపరక అంచునుండి
జారబోతున్న మంచుబిందువులు తాగింది
పేడపురుగును చూసి,  దారి ఇస్తూ,
పక్కకి గెంతుకుంటూ తప్పుకుంది.

.

గబగబా నాలుగుదిక్కులూ చూస్తున్న
భీతిచెందిన దాని కళ్ళు
భయపడి చెదిరిన పూసల్లా ఉన్నాయి.
దాని మొఖ్మలు తలను ఒకసారి విదిలించింది

.

భయంగా అప్రమత్తంగా ఉన్నదానికి
నేనో రొట్టెముక్క ఇవ్వ జూపేను… కానీ,
రెక్కలు ఒక్కసారి విదుల్చుకుని
ప్రశాంత ప్రదేశానికెక్కడికో ఎగిరిపోయింది .

.

సముద్రాన్ని తరస్తున్న తెడ్లకంటె భిన్నంగా
జాడ విడవని రెక్కల విన్యాసంతో,
సీతాకోకచిలుకలు మధ్యాహ్నపు నీరెండలోకి
చప్పుడుచెయ్యకుండ దూకి ఈదుతున్నట్టు.

.

ఎమిలీ డికిన్సన్

(గమనిక: ఆఖరి చరణం లో వాడిన “నీరెండ”లో నీరులేదు గాని, leap,  plashless as they swim  అన్న కవయిత్రి భావానికి దగ్గరగా రాగలిగిన శబ్దసామ్యం అవడం వలన వాడవలసి వచ్చింది).

ఈ కవితలోని ఆయువు పట్టు అంతా ఈ చివరి చరణంలోనే ఉంది.  గాలిలోకి పిట్ట ఎగిరిపోయిన తర్వాత సాధారణంగ ఇంకే కవి అయినా కవిత ముగిస్తాడు. కానీ, కవయిత్రి భావనా పరంపర ఆగలేదు.
ఒక్క సారి ఊహించుకొండి:  దూరాన ఎక్కడో ప్రశాంత సాగరం మీద తెడ్దువేసుకుంటూ ఒక జాలరి ఒంటరిగా వెళిపోతున్నాడు. అతని రెండుతెడ్లూ నీటిని చీల్చి జాడ (Wakes) వదులుతున్నాయి. ఆ పిట్ట ఎగిరిపోయిందట సముద్రంలాంటి గాలిలోకి జాడతెలుపకుండా. దాన్ని మరికొంచెం పొడిగిస్తూ, మధ్యాహ్నపు ఎండ అనే గట్టునుండి నీటిలోకి (సముద్రం లాంటి గాలిలోకి) చప్పుడుచెయ్యకుండా గెంతి ఈదుతున్న (చేపపిల్లలు) సీతాకోకచిలుకలులా కూడ ఉందిట దాని ఎగరడం.  ( silver అన్న శబ్దం ఇక్కడ వెండి రంగు, మిలమిలల కంటే, మెత్తని, నిశ్శబ్దమైన అన్న అర్థం సూచిస్తుందని నా భావన)

.

A Bird Came Down

.

A Bird came down the Walk –
He did not know I saw –
He bit an Angleworm in halves
And ate the fellow, raw,

And then he drank a Dew
From a convenient Grass –
And then hopped sidewise to the Wall
To let a Beetle pass –

He glanced with rapid eyes
That hurried all abroad –
They looked like frightened Beads, I thought –
He stirred his Velvet Head

Like one in danger, Cautious,
I offered him a Crumb
And he unrolled his feathers
And rowed him softer home –

Than Oars divide the Ocean,
Too silver for a seam –
Or Butterflies, off Banks of Noon
Leap, plashless as they swim.

.

Emily Dickinson

American Poet

(December 10, 1830 – May 15, 1886)

The last stanza calls for great attention because of its poetic beauty. Normally any other poet would have ended the poem with the previous stanza. But she did not.

The beauty lies in comparing the seamless flight of the bird superior to the rowing of  oars on a silent sea, and the plashless, swimming of the butterflies in the expanse of the noon. 

%d bloggers like this: